25, డిసెంబర్ 2020, శుక్రవారం

📚✍జనవరి 4 నుంచి ట్రిపుల్‌ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్‌✍📚



🌻వేంపల్లె, న్యూస్‌టుడే: రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం జనవరి 4 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వర్సిటీ కులపతి ఆచార్య కేసీరెడ్డి తెలిపారు. ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థుల జాబితాను వర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. ఎంపికైనవారు కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఒంగోలు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలకు సంబంధించి ఇడుపులపాయలో..శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్‌ఐటీలకు నూజివీడు ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఉంటుందని వివరించారు.

కామెంట్‌లు లేవు: