జాతీయ అర్బన్ హెల్త్ మిషన్ (NUHM) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి గాను మంచి నోటిఫికేషన్ విడుదలైనది.
ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
జిల్లాల వారీగా దరఖాస్తులకు చివరి తేదీలు :
| ప్రకాశం | డిసెంబర్ 24,2020 |
| అనంతపురం | డిసెంబర్ 26,2020 |
| విజయనగరం | డిసెంబర్ 26,2020 |
| శ్రీ కాకుళం | డిసెంబర్ 26,2020 |
| కడప | డిసెంబర్ 27,2020 |
| పశ్చిమ గోదావరి | డిసెంబర్ 31,2020 |
జిల్లాలవారీగా ఖాళీలు :
| పశ్చిమ గోదావరి జిల్లా | 33 |
| ప్రకాశం | 25 |
| కడప | 33 |
| అనంతపురం | 44 |
| విజయనగరం | 20 |
| శ్రీ కాకుళం | 13 |
అర్హతలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబడే మెడికల్ ఆఫీసర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఎం. బీ. బీ. ఎస్ అర్హతను కలిగి ఉండి, డిసెంబర్ 1,2020 నాటికి ఇంటర్నషిప్ ను పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానం ద్వారా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
క్వాలిఫైంగ్ ఎగ్జామ్ మార్కులు, గత అనుభవం మరియు ఇంటర్నషిప్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అర్హతలను బట్టి జీతం లభించనుంది.
కామెంట్‌లు