29, డిసెంబర్ 2020, మంగళవారం

No Exam Tirupati Latest Jobs 2020 Telugu || పరీక్ష లేకుండా తిరుపతి లో ఉద్యోగాల భర్తీ

తిరుపతి లో ఉద్యోగాలు, వాక్ – ఇన్ -ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ  :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ (ANGRAU) కు చెందిన తిరుపతి రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Tirupati Latest Jobs 2020 Telugu

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ  నిర్వహణ తేదిడిసెంబర్ 31,2020
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం10:00 AM

ఇంటర్వ్యూ నిర్వహణ వేదిక   :

ఛాంబర్ ఆఫ్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, రిజినల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ , తిరుపతి.

విభాగాల వారీగా ఖాళీలు :

బిజినెస్ మేనేజర్1
అసిస్టెంట్ మేనేజర్1
బిజినెస్ ఎగ్జిక్యూటివ్1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు విభాగాల వారీగా  ఎంబీఏ /ఎంసీఏ /బీ. టెక్/ఎం.టెక్ /పీజీడిఎం(అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ )/ఎం. ఎస్సీ (అగ్రికల్చర్ ) కోర్సులు మరియు సంబంధిత సబ్జెక్ట్స్ లో తత్సమాన మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. మరియు సంబంధిత విభాగాలలో 2-5 సంవత్సరాలు అనుభవం అవసరం.కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం. పూర్తి వివరాలకు క్రింది నోటిఫికేషన్ ను అభ్యర్థులు చూడవచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 30,000 రూపాయలు నుండి 1,00,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి బ్రీఫ్ బయో డేటా, ఒరిజినల్ సర్టిఫికెట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

Website

కామెంట్‌లు లేవు: