30, డిసెంబర్ 2020, బుధవారం

AP Police 14341 Jobs Vacancies 2020 || నూతన సంవత్సర కానుక 14,341 పోలీస్ పోస్టుల భర్తీ

 

పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త :

రానున్న నూతన సంవత్సరం 2021 లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పోలీసు పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.

తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న  పోలీసు పోస్టుల లెక్కను డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ నివేదిక అధికారికంగా తెలిపింది.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 జనవరి 1 నాటికీ పోలీసు శాఖలో మొత్తం 14,341 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఈ నివేదికలో పొందుపరిచారు.

మొత్తం 73,894 పోలీసు పోస్టుల భర్తీకి కేటాయింపులు జరగగా,59,553 పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి.

మిగిలిన 14,341 పోస్టులు భర్తీకి ఎదురు చూస్తున్నాయి.

ఈ తాజా సమాచారంతో ఏపీ లో త్వరలో భర్తీ చేయనున్న పోలీస్ శాఖ పోస్టులపై ఒక క్లారిటీ వచ్చినది.

2021 జనవరి లో ఈ 14,341 పోస్టుల భర్తీకి గాను ఏపీ నిరుద్యోగులు ముందుకు పోలీసు శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రానున్నట్లు సమాచారం.

కామెంట్‌లు లేవు: