ఆంధ్రప్రదేశ్ లో కొత్త సంవత్సరంలో ప్రభుత్వ నియామకాల దిశగా కసరత్తు
వీటితోపాటు త్వరలో మెగా డీఎస్సీ, పోలీస్ శాఖలో వేల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది! ఇటు తెలంగాణలోనూ ఉద్యోగాల నియామకానికి కదలిక మొదలైంది! దీంతో.. 2020లో కరోనా కారణంగా.. కొలువుల ఆశలు అడియాశలై.. నిరుత్సాహానికి గురైన నిరుద్యోగులకు.. నూతన సంవత్సరం కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఈ నేపథ్యంలో.. తెలుగు రాష్ట్రల్లో నూతన సంవత్సరంలో సర్కారీ కొలువుల నోటిఫికేషన్లు..ఆయా శాఖల్లో భర్తీ చేయనున్న పోస్టులు.. అభ్యర్థులు విజయానికి అనుసరించాల్సిన ప్రణాళికపై విశ్లేషణ..
ఏపీలో ఉద్యోగాల పండుగ..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొలువుల పండుగకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా కీలకమైన పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఇతర విభాగాల్లోనూ నియామకాలకు కసరత్తు ప్రారంభిస్తోంది. త్వర లోనే మెగా డీఎస్సీ నిర్వహించి 15వేలకు పైగా టీచర్ పోస్ట్‌లను భర్తీ చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. ఈ మెగా డీఎస్సీ ద్వారా భారీ సంఖ్యలో ఎస్‌జీటీ, స్కూల్ అసి స్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. అదేవిధంగా ఏపీ పోలీస్ శాఖలో జనవరిలో వేల సంఖ్యలో పోస్ట్‌ల భర్తీకి సన్నాహాలు జరుగు తున్నట్లు సమాచారం. ఇటు తెలంగాణ రాష్ట్రంలో గత రెండు,మూడేళ్లుగా స్తబ్ధుగా ఉన్న ప్రభుత్వ నియామకాల్లో.. తాజాగా కదలిక కనిపిస్తోంది. రాష్ట్రంలో 50 వేలకుపైగా పోస్టుల భర్తీకి కసరత్తు మొదలైనట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలా..అన్ని రకాలుగా నిరుద్యోగులకు కొత్త సంవ త్సరం సర్కారీ కొలువులు సొంతం చేసుకు నేందుకు ఆశాజనకంగా కనిపిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఏపీ వైద్యశాఖలో వేల పోస్టుల భర్తీ..
కరోనా నేపథ్యంలో వైద్య శాఖలో సిబ్బంది కొరత ను దృష్టిలో పెట్టుకొని.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభు త్వం యుద్ధప్రాతిపదికన నియామకాలకు శ్రీ కారం చుట్టింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో డాక్టర్లు, వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలోనియమిం చడానికి గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్ర, జిల్లా స్థాయి ఆసుపత్రుల్లో ఏకంగా 7634 రెగ్యులర్ పోస్టులు భర్తీ చేశారు. ఇవేకాకుండా నర్సింగ్, పారామెడికల్ తదితర పోస్టులను భారీయెత్తున భర్తీ చేస్తున్నారు. ఏపీ వైద్య శాఖలో ప్రారంభమైన ఈ కొలువుల పండుగ నిరంతరాయంగా కొనసాగనుందని ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి.
8 వేలకు పైగా పోలీసు పోస్టులు..
ఏపీ పోలీస్ విభాగంలో ఎనిమిది వేలకు పైగా పోస్టు భర్తీకి జనవరిలో ప్రక్రియ ప్రారంభించను న్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి ప్రకటించారు. వీటిలో 600 వరకు ఎస్‌ఐ పోస్ట్‌లు, మిగిలినవి కానిస్టేబుల్ పోస్ట్‌లు ఉన్నట్లు సమాచారం.
కామెంట్‌లు