29, డిసెంబర్ 2020, మంగళవారం

ఇంటి నివాస స్థలం లేని నిరుపేదలకు ఉండాల్సిన అర్హతలు

1. తెల్ల  రేషన్ కార్డ్ ఉండాలి

2.  ఆధార్ కార్డ్ ఉండాలి

3. సొంత  ఇంటి స్థలం ఉండరాదు.

4. సొంత  ఇల్లు ఉండరాదు.

5. ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.

6. కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.

7. మాగాణి 2.50, మెట్ట 5 ఎకరాల లోపు ఉండవచ్చు.

8. గతంలో  ప్రభుత్వం వారు ఇంటి స్థలం  మంజూరు చేసి ఉండరాదు.

9. గతంలో ప్రభుత్వం వారు Housing లోన్ మంజూరు చేసి ఉండరాదు.

10. గతంలో ప్రభుత్వం వారు LA లో లబ్దిదారుడై ఉండరాదు.

11. గతంలో ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికెట్ పొంది ఉండరాదు.

12. లబ్దిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉన్నచో లబ్దిదారుడు ఒక్కడే వారసుడు ఉన్నచో తదనంతరం సదరు ఇల్లు గాని ఇంటి స్థలం గాని అతనికే చెందును. కాబట్టి లబ్ది దారునికి ఇంటి స్థలం ఇవ్వవలసిన అవసరం లేదు

13. ఒక కుటుంబం నకు సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబం లో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకొనరాదు.

14. ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలంలను కొని అందులో నివాసం ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకొనరాదు.

పైన పేర్కొన్న అర్హతలు అన్నీ ఉండి మీరు ఇంకా ఇళ్ల స్థలం కొరకు అప్లై చేయకపోతే మీ యొక్క గ్రామ వాలంటీర్ ను వెంటనే సంప్రదించి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్స్ మరియు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్ వారికి ఇచ్చి 'మేము ఇళ్ల పట్టా పొందడానికి అర్హులు గా ఉన్నాం సచివాలయం నందు మాకు ఇళ్ల పట్టా  కొరకు అప్లై చేయండి' అని చెప్పాలి, అప్పుడు వాళ్ళు మీ దగ్గరకు ఒక అప్లికేషన్ ఫోరం తీసుకొని వస్తారు అప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి వారు ఆ అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకొని వెళ్ళి సచివాలయం నందు అప్లై చేస్తారు


కామెంట్‌లు లేవు: