28, ఫిబ్రవరి 2021, ఆదివారం

TTD UPDATE సర్వదర్శనం భక్తులకు విజ్ఞప్తి





తిరుమల సమాచారం

తిరుమల సర్వదర్శనం టోకెన్స్ 24×7 ప్రస్తుతానికి  02-03-2021 రోజుకు టై మింగ్ ప్రకారం భక్తులకు తిరుపతి విష్ణు నివాసంలో మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులో ఉన్న ప్రస్తుత టికెట్స్

👉🏾దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో  రెండు రోజులు వేచి ఉండాల్సిన పరిస్థితుల దృష్ట్యా తదనుగుణంగా భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది.

 👉10 ఏళ్ళ లోపు పిల్లలను, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను దర్శనంకు
 అనుమతిస్తున్న  టీటీడీ...

👉అలిపిరి కాలిబాట మార్గాన ఉదయం 6 నుండి 2 వరకు, శ్రీవారి మెట్టు మార్గనా ఉదయం 6 నుండి సాయంత్రం 4 వరకు దర్శనం టోకెన్లు ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తున్న టీటీడీ...

👉సామాన్య భక్తులకోసం పరిమిత సంఖ్యలో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ....

👉విష్ణునివాసం, భూదేవి కాంప్లెక్స్ లో సర్వదర్శన టోకెన్లను జారీ చేస్తున్న టీటీడీ

👉ప్రతి ఒక్కరు తప్పని సరి కోవిడ్ నిబంధనలు పాటించి స్వామివారి దర్శనం చేసుకోవాలని వేడుకుంటు....

 🙏సర్వేజనాః సుఖినోభవంతు 🙏

Ananthapuramu District Classifieds






 

ARJITA SEVAS RESUME IN TIRUMALA SRI VARI TEMPLE


FROM APRIL 14 ONWARDS

ఏప్రిల్ 14 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి

TTD to allow devotees physical presence for advance booked arjita sevas. Devotees with arjita Seva tickets should observe all Covid guidelines and also procure Covid test three days ahead of their Tirumala visit.

ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు కోవిడ్ 19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేవకు వచ్చే మూడు రోజుల ముందు కోవిడ్ పరీక్ష చేయించుకుని సర్టిఫికెట్ సమర్పించాలి.

టీటీడీ పాలకమండలి చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

27, ఫిబ్రవరి 2021, శనివారం

విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ | Vizag Army Recruitment

విశాఖపట్నం ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయం హకీంపేటలోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏపీ అభ్యర్థులకు నియామక ర్యాలీ నిర్వహిస్తోంది. ఏపీ రాష్ట్రానికి చెందిన ఆరు జిల్లాల (శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, యానాం)కు చెందిన అభ్యర్థులు అర్హులు. ఆసక్తి, అర్హత కలిగన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.Jobs వివరాలు:
సోల్జర్‌–ఫార్మా:
అర్హత: 10+2/ఇంటర్మీడియట్‌తోపాటు కనీసం 55శాతం మార్కులతో డి ఫార్మా/ కనీసం 50 శాతం మార్కులతో బీఫార్మా ఉత్తీర్ణులవ్వాలి. స్టేట్‌ ఫార్మసీ కౌన్సిల్‌/ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాలో రిజిస్టర్‌ అయి ఉండాలి.
వయసు: 19–25 ఏళ్ల మధ్య ఉండాలి. 01 అక్టోబర్‌ 1995–01 అక్టోబరు 2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్, ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
ర్యాలీ నిర్వహణ తేదీ: 5 మార్చి 2021 నుంచి 24 మార్చి 2021 వరకు.
ర్యాలీ నిర్వహించే ప్రదేశం: తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్, హకీంపేట్‌ (తెలంగాణ).

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 28, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: www.joinindianarmy.nic.in

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌

కొత్తగూడెం జిల్లాలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: అడ్వైజర్‌ (లీగల్‌)–01, చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 26, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి:  https://scclmines.com/scclnew/index.asp

నాబార్డ్‌ లో ఉద్యోగాలు | NABARD VACANCIES

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కన్సల్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 04
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: ఫిబ్రవరి 27, 2021.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 19, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.nabard.org

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు...

🎈FCI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే 
🔹నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 89 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు 2021 మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్లలో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
🔹FCI Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...
⭕️మొత్తం ఖాళీలు- 89
⭕️ (జనరల్- 43, ఎస్సీ- 14, ఈడబ్ల్యూఎస్- 9, ఓబీసీ- 7, ఎస్టీ-6)
⭕️అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)- 30 అసిస్టెంట్ జనరల్ మేనేజర్
⭕️అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)- 22
⭕️అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8
⭕️మెడికల్ ఆఫీసర్- 2
🔹FCI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
⭕️దరఖాస్తు ప్రారంభం- 2021 మార్చి 1 ఉదయం 10 గంటలు
⭕️దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మార్చి 31 సాయంత్రం 5 గంటలు
⭕️అడ్మిట్ కార్డుల విడుదల- పరీక్షకు 10 రోజుల ముందు
⭕️రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్- 2021 మే లేదా జూన్
🔹FCI Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
⭕️విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
⭕️ వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
⭕️దరఖాస్తు ఫీజు- రూ.1000. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.
⭕️ఎంపిక విధానం- ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ. ఆన్‌లైన్ టెస్ట్‌లో అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు రావాలి. ఖాళీల కన్నా మూడు రెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.
⭕️వేతనం- రూ.50,000 నుంచి రూ.1,80,000
🔹FCI Recruitment 2021: అప్లై చేయండి ఇలా
⭕️అభ్యర్థులు https://www.recruitmentfci.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
⭕️Assistant General Manager నోటిఫికేషన్ పైన క్లిక్ చేయాలి.
⭕️Apply Online పైన క్లిక్ చేసి పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
⭕️రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ వస్తుంది.
రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి దరఖాస్తు ఫామ్ పూర్తి చేయాలి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి పేమెంట్ చేయాలి.
⭕️దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి.