16, జనవరి 2021, శనివారం

అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీలు

🔳ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన దివ్యాంగుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెన్ , ఆఫీస్ సభాడినేట్లు, టెక్నికల్ సభాడినేట్లు, ధోభి, స్వీపర్, డ్రెయిన్ క్లీనర్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, వాచ్ మన్, కుక్.
ఖాళీలు : 18
అర్హత : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఇంటర్ తోపాటు ఎంపీహెచ్ కోర్సు చేసి ఉండాలి. రెండేళ ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్) కోర్సు చేసినవారు ఏడాది వ్యవ ధిగల క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్లకు, డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత అవసరం. (బీఎస్సీ / పీజీ డిప్లొమా) (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ / లైఫ్ సైన్స్) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ అటెండెంట్లకు పదోతరగతితోపాటు ఐటీఐ కోర్సు చేసి ఉండాలి.
సబార్డినేట్లకు ఏడోతరగతి ఉత్తీర్ణతతో 35. వైకల్యా నికి 30 / 40. అకడమిక్ ప్రతిభకు పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి.
మిగిలిన 25. సీనియారిటీకి 10 మార్కులు వెయిటేజీ పోస్టులకు అయిదో తరగతి పాసైతే చాలు. Note: ఈ పోస్ట్స్ కి అంగవైకల్యం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అనంతపురం జిల్లా వాసులు మాత్రమే అర్హులు.
వయస్సు : 18-52 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 25,000/- 80,000
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌ , ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 10, 2021.
దరఖాస్తులకు చివరితేది : జనవరి 22, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయం , అనంతపురం .

ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.


Edu news
ఆర్‌ఆర్‌టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఇండియన్ ఆర్మీ చేపడుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల నుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో తగిన నైపుణ్యం కలిగి ఉం డాలి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 194
పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ -171
అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ(ఏ గ్రూప్ వారైనా) ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ (గూర్ఖా)- గూర్ఖా రెజిమెంట్-09 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: గ్రంథి -05
అర్హత: ఈ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వీ(సున్నీ) -05
అర్హత : ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వి(షియా ) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన షియాలు మాత్రవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పాడ్రే -02 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది.. ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: బోధ్ సన్యాసి(మహాయాన) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్పా/లోపాన్/రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి.

వయసు: సివిలియన్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయసు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అక్టోబర్ 01,1987- సెప్టెంబర్ 30, 1996 మధ్య జన్మించి ఉండాలి.
 
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.Career guidance
పరీక్షా విధానం..
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులం దరికీతొలుత స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

రాత పరీక్ష..
  1. ఈ పరీక్షల్లో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్ సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇందులో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
  2. పేపర్-1 పరీక్షను అర్హత పరీక్షగానే చూస్తారు. ఇందు లో కనీసం 40శాతం మార్కులు సాధించిన అభ్యర్థు లు మాత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
  3. పేపర్ -2 : ఈ పరీక్ష కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మతపరమైన విషయాలను గురించిన ప్రశ్నలుంటాయి. మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
  4. పేపర్-2లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పేపర్-2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


ముఖ్యమైన సమాచారం..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09.02.2021
  3. పరీక్ష తేదీ : 27.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.joinindianarmy.nic.in
 
 

జూన్‌ రెండో వారంలో ఎంసెట్‌



*📃వర్షిక, ప్రవేశ పరీక్షల ఫీజులు రద్దు చేయాలంటూ వినతులు*

*🌀ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) ఎంసెట్‌ను జూన్‌ రెండో వారంలో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. ఈసారి ఇంటర్‌ పరీక్షలు ఏప్రిల్‌ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తి చేయాలని ఇంటర్‌బోర్డు అధికారులు యోచిస్తున్నారు. అవి ముగిశాక, 4, 5 వారాల సమయం ఇచ్చి ఎంసెట్‌ను జూన్‌లో జరపాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇతర ప్రవేశ పరీక్షలు కూడా ఆ నెలలోనే జరిపేందుకు అవకాశం ఉందని పేర్కొంటున్నారు.*

*💰పరీక్ష ఫీజులు వసూలు చేస్తారా?... రద్దు చేస్తారా?*

*🌀కరోనా పరిస్థితుల్లో విద్యార్థుల నుంచి ఈసారి అన్ని రకాల వార్షిక పరీక్షలు, ప్రవేశ పరీక్షల ఫీజు రద్దు చేయాలని పలువురు విన్నవిస్తున్నారు. ఒడిశాలో ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ తమ రాష్ట్రంలో పది, ఇంటర్‌ వార్షిక పరీక్షల రుసుములను ఇప్పటికే రద్దు చేశారు. తెలంగాణలోనూ అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తల్లిదండ్రులు, సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తరగతులు జరగకున్నా ప్రైవేటు కళాశాలలు ట్యూషన్‌ ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. కనీసం పరీక్ష ఫీజులైనా రద్దు చేయాలని కోరారు. ఇంజినీరింగ్‌లో చేరాలనుకున్న విద్యార్థులు పలు ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని, కనీసం ప్రభుత్వ ప్రవేశ పరీక్షలకైనా రుసుములు మినహాయించాలని ఐఐటీ జేఈఈ-నీట్‌ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌కుమార్‌ సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులకైనా ఫీజులు మినహాయించాలని మరికొందరు కోరుతున్నారు.*

💁‍♀ఏప్రిల్ 18న నీట్..




🔰నయా ఢిల్లీ : నీట్ పీజీ -2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్షిప్ పూర్తిచేసి వుండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్ సైటు సందర్శించవచ్చు.

*💁‍♀️దూరవిద్య కోర్సులకు అనుమతి..*

🍁ఈనాడు, అమరావతి:

*🔰ఆచార్య నాగార్జున, శ్రీకృష్ణదేవరాయ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయాలకు దూరవిద్య కోర్సుల నిర్వహణకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. ఆచార్య నాగార్జునలో డిగ్రీ, పీజీ కలిపి 46 కోర్సులు, శ్రీకృష్ణదేవరాయలో 17, శ్రీపద్మావతి మహిళా వర్సిటీలో 11కోర్సులకు అనుమతించింది. ఇప్పటికే నిర్వహిస్తున్న ఈ కోర్సులపై వర్సిటీలు చేసిన దరఖాస్తుల మేరకు ఆమోదం తెలిపింది.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

*2️⃣💁‍♀️ఇంటిగ్రేటెడ్‌ కోర్సు విద్యార్థులూ.. ఉపాధ్యాయ కొలువులకు అర్హులే*

*🔰బఈడీ-ఎంఈడీ మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులూ ఉపాధ్యాయ కొలువులకు పోటీపడవచ్చు. ఈ మేరకు జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) సర్వసభ్య సమావేశం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిపై కొన్ని రాష్ట్రాల్లో వివాదం తలెత్తడంతో నిపుణుల కమిటీని నియమించారు. ఆ కమిటీ సిఫార్సులను ఆమోదించిన ఎన్‌సీటీఈ..మూడేళ్ల ఇంటిగ్రేటెడ్‌ పూర్తిచేసిన వారు టెట్‌ రాసి టీఆర్‌టీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలకు పోటీపడవచ్చని పేర్కొంది.*

*💁‍♀️ఇంటర్‌ మొదటి ఏడాది తరగతులు మే 31వరకు..*



*🔰రెండో శనివారం, వేసవి సెలవులు రద్దు..*

🍁ఈనాడు, అమరావతి:

*🔰ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం తరగతులు మే 31వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ విద్యా మండలి ప్రకటించింది. సవరించిన మొదటి ఏడాది అకడమిక్‌ కేలండర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే తరగతులు మొత్తం 106 రోజులు జరగనున్నాయి. రెండో శనివారం, వేసవి సెలవులను రద్దు చేశారు. అర్ధ సంవత్సరం పరీక్షలు మార్చి 25 నుంచి 31వరకు నిర్వహిస్తారు. ప్రీఫైనల్‌, బోర్డు థియరీ పరీక్షలను ఏప్రిల్‌, మే నెలల్లో నిర్వహిస్తారు*.

*💥నవోదయ పరీక్ష తేదీల మార్పు..*



*🌻హదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీలను మార్చారు.*

*🔹ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. దీనిని ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నామని జవహర్‌ నవోదయ సమితి తెలిపింది.*

---------------------------------------------

*💥ఏప్రిల్ 18న నీట్..*

*🔹నయూఢిల్లీ : నీట్ పీజీ -2021 పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నీట్ పీజీ పరీక్షల తేదీలను వెల్లడించింది. ఏప్రిల్ 18న దేశ వ్యాప్తంగా నీట్ పీజీ- 2021 పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షకు హాజరు కావడానికి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునేవారు జూన్ 30, 2021 తేదీ లోపు లేదా అంతకన్నా ముందు ఇంటర్న్ షిప్ పూర్తిచేసి వుండాలి. ఇతర వివరాల కోసం nbe.edu.in వెబ్ సైటు సందర్శించవచ్చు.*

#NATIONAL_NEWS

 

💁‍♀నవోదయ పరీక్ష తేదీల మార్పు..

🔰హదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షల తేదీలను మార్చారు.

🔰ముందుగా నిర్ణయించిన ప్రకారం 9వ తరగతిలో ప్రవేశాలకు ఫిబ్రవరి 13న పరీక్ష జరగాల్సి ఉంది. దీనిని ఫిబ్రవరి 24న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12-30 గంటల వరకు నిర్వహించనున్నామని జవహర్‌ నవోదయ సమితి తెలిపింది.

🕉– *తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం*


        ➖〰〰〰〰〰〰➖
🟢 TTD News™ తిరుమల:
 కనుమ పండుగ సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం శుక్ర‌‌వారం ఘనంగా జరిగింది. మ‌ధ్యాహ్నం 1 గంట‌కు శ్రీమలయప్పస్వామివారు తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి పార్వేట మండపమునకు చేరుకున్నారు . పుణ్యాహవచనం తర్వాత మంచెలో వేంచేసారు. శ్రీస్వామివారికి ఆరాధనము, నివేదన,  హారతులు జరిగాయి.

■ శ్రీకృష్టస్వామివారిని మాత్రము సన్నిధి యాద‌వ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలువెన్న ఆరగింపు అయి హారతి జరిగిన పిమ్మట శ్రీమలయప్పస్వామివారి సన్నిధికి వెళ్ళారు. తరువాత స‌న్నిధి యాద‌వ‌ సమర్పించిన పాలు వెన్న శ్రీమలయప్పస్వామివారికి నివేదనము హారతి అయి యాద‌వ‌కు బహుమానము జరిగింది. తరువాత శ్రీమలయప్పస్వామివారు ముందుకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసి వెనుకకు వచ్చారు. ఇలా మూడుసార్లు జరిగింది. 

🟢 శ్రీమలయప్పస్వామివారు ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హథీ రాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు.

👉 ఈ ఉత్సవంలో అదనపు ఈవో శ్రీ ఏ.వి.ధర్మా రెడ్డి దంపతులు, డిఎఫ్.వో. శ్రీ చంద్ర శేఖర్, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఎస్.ఈ. శ్రీ నాగేశ్వర్ రావు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.* 

Co-Op Society Jobs 2021 Update || గోదావరి -కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీలో ఉద్యోగాల భర్తీ

 

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు :

బ్రాంచ్ మేనేజర్స్9
మార్కెటింగ్ మేనేజర్స్18
గోల్డ్ లోన్ ఆఫీసర్స్5
క్లర్క్స్9
డీటీపీ ఆపరేటర్స్3
సేల్స్ అడ్మిన్ – ఫిమేల్ (తెలుగు &ఇంగ్లీష్ )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ విద్యార్హతగా కలిగి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించరాదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈమెయిల్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

దరఖాస్తు ఫీజు లేదు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా 10,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.ఈ జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా లభిస్తాయి.

ఈమెయిల్ అడ్రస్ :

అభ్యర్థులు తమ విద్యా అర్హత సర్టిఫికెట్స్, ఉద్యోగ విభాగం మరియు ఫోన్ నంబర్లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ :

admin@godavarikrishna.com

సంప్రదించవల్సిన అడ్రస్ :

గోదావరి – కృష్ణా కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్,

9-61-13,

బీ. ఆర్. పీ రోడ్, ఇస్లాం పేట,

విజయవాడ – 520001,

కృష్ణా జిల్లా.

ఫోన్ నంబర్లు :

0866 – 2957177

9100068751

Anantapuramu District Classifieds