KVS Admissions Notifications 2024 Details : కేంద్రీయ విద్యాలయాలో అడ్మిషన్లు ప్రారంభం... అర్హతలు ఇవే.. ! వీరికే మొదటి ప్రాధాన్యం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు, రక్షణ రంగ సంస్థల్లో పనిచేస్తున్నవారి పిల్లలకు, తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయాలు 1254 పాఠశాలల్లో ప్రవేశానికి కొత్త అడ్మిషన్ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. అర్హతలు : ఏ తరగతిలో ప్రవేశం కోరుచున్నారు అంతకుముందు తరగతిలో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : 31 మార్చి 2024 నాటికి ఒకటో తరగతికి 6–8, రెండో తరగతికి 7–9, మూడు, నాలుగో తరగతులకు 8–10 సంవత్సరాల మధ్య, 5,6,7,8,9,10 వ తరగతులకు వరుసగా 9–11, 10–12, 11–13, 12–14, 13–15, 14-16 సంవత్సరాలు కలిగి ఉండాలి. అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం వీరికి మాత్రమే పరీక్ష : దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకటో తరగతి ప్రవేశాలకు ఆన్‌లైన్ ద్వారా, ఇతర తరగతులకు ఆఫ్‌లైన్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్ల సంఖ్య కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. 9వ తరగతిలో ప్రవేశాలకు మాత్రం అడ్మిషన్ టెస్ట్ న...