నవ్గురుకుల్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలకు ఈ నెల 19న ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి తెలిపారు. అభ్యర్థులు ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ పాస్/ఫెయిల్, ఇంజినీరింగ్ పాస్/ఫెయిల్ పీజీ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు 17 నుంచి 28 ఏళ్ల లోపు ఉండాల న్నారు. ఎంపికైన వారికి పూణేలో ఏడాది పాటు భోజనం, వసతితో కూడిన శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణలో ల్యాప్టాప్ కూడా ఇస్తామని పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ లాంగ్వేజస్, కోడింగ్, పైథాన్, జావా, సీ, సీ++ తో పాటు, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్ లో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తయిన వారికి మల్టీ నేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ డెవలపర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, బ్యాండ్ డెవలపర్, సాఫ్ట్ వేర్ టెస్టింగ్, కోడింగ్ ట్రైనర్ ఉద్యోగాలకు ఎంపిక చేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9000487423 6905934287 7780752418 నంబర్లను సంప్రదించాలన్నారు. --------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. ...