KGBV: కేజీబీవీల్లో 729 పోస్టులకు మరో నోటిఫికేషన్ అక్టోబరు 7 నుంచి 15 తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగుసేవల ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన వారు అక్టోబరు 7 నుంచి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టైప్-3 కేజీబీవీల్లో 547, టైప్-4లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. టైప్-3లో హెడ్ కుక్ 48, సహాయ వంటమనిషి 263, వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉండగా.. టైప్-4లో హెడ్‌కుక్ 48, సహాయ వంటమనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా W...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు