ఆదిత్యను L1 SOME SAMACHAR* ┅┅┅┅┅┅┅┅┅ *1. ఆదిత్యను L1లోకే ఎందుకు పంపుతున్నారు?* *2. ఆదిత్య L-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే?* *3. సూర్యుడిపై ఆదిత్య-L1 ల్యాండ్ అవుతుందా?* *4. ఆదిత్య-L1 విశేషాలివే..* *5. ఆదిత్య L-1తో ఆ దేశాల సరసన భారత్* *6. ఆదిత్య L-1: రోజుకు 1,440 ఫొటోలు* *7. లాగ్రాంజ్-1 వద్దకు ఆదిత్య ఎల్-1 ఎలా చేరుకుంటుందంటే?* *8. ఆదిత్య-L1 సూర్యుడిపై ల్యాండ్ కాదు: ఇస్రో*
〰〰〰〰〰〰〰〰 *1. ఆదిత్యను L1లోకే ఎందుకు పంపుతున్నారు?* *ఆదిత్య ఎల్-1ను భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లాంగ్రెజ్ పాయింట్-1లో నిలుపుతారు. ఇక్కడికి చేరితే ఒక వస్తువు ఇంధనం అవసరం లేకుండా కక్ష్యలో అలా తిరుగుతూనే ఉంటుంది. అది కూడా స్థిరంగా! ఎందుకంటే, దానిపై రెండు ఖగోళ వస్తువుల నుంచి వ్యతిరేక దిశల్లో సమాన బలం పని చేస్తుంది. అందుకే, ఇక్కడి నుంచి ఆదిత్యుడి ఫొటోలు తీయడానికి వీలవుతుంది.* *2. ఆదిత్య L-1 ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఏంటంటే?* *సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగిస్తున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. ఈ ప్రాజెక్టు ద్వారా సౌర వ్యవస్థపై నిఘా పెట్టవచ్చు. దీంతో సౌర తుఫానులు, సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణం, పరిస్థితులపై అధ్యయనం చేయవచ్చు. కరోనాగ్రఫీ పరికరం సాయంతో సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఇస్రో తెలిపింది.* *3. సూర్యుడిపై ఆదిత్య-L1 ల్యాండ్ అవుతుందా?* *చంద్రుడిపై చంద్రయాన్-3ని ల్యాండ్ చేసినట్లుగా ఆదిత్య-L1ని కూడా సూర్యుడిపై ల్యాండ్ చేస్తారా అన్న సందేహాలు నెలకొన్నాయి. అయితే సూర్యుడిపై ల్యాండింగ్ అంటూ ఉండబోదు. గ్రహాల మాదిరిగా సూర్యుడి ఉపరిత...