జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్ పరీక్ష, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్‌పీటీ) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే.. మూడేళ్ల డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్) 65 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించాలి. లేదా ఇంజినీరింగ్ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 45 శాతం మార్కులు సంపాదించాలి. జూనియర్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్) డిప్లొమా అభ్యర్థులకు రెండేళ్లు, డిగ్రీ అభ్యర్థులకు ఏడాది అనుభవం ఉండాలి. లేదా పీఎస్‌యూలో ఏడాది గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ పూర్తిచేయాలి. వయసు 01.06.2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు