26, ఫిబ్రవరి 2022, శనివారం

SVPNPA Jobs: హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో ఉద్యోగాలు

SVPNPA Laboratory Technician Recruitment 2022: భారత ప్రభుత్వ హోంమత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (SVPNPA) ఔట్‌సోర్సింగ్‌ (outsourcing jobs) ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 19

పోస్టుల వివరాలు: వెటర్నరీ ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌, జూనియర్‌ ప్రొజెక్షనిస్ట్‌, కెమెరామెన్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఎక్స్‌ రే టెక్నీషియన్‌, ఫిజియోథెరపిస్ట్‌, స్టాఫ్‌నర్స్‌, స్పోర్ట్స్‌ కోచ్‌ పోస్టులు.

పే స్కేల్‌: నెలకు రూ.33,000ల నుంచి రూ.98, 000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 64 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The assistant director (Estt.I), SVP national academy, shivarampalli, Hyderabad- 500053.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

Hyderabad Army Public School Jobs: గోల్కోండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో 30 టీచింగ్ పోస్టులు

Army Public School Golconda Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) టీచింగ్‌ పోస్టుల  (teacher posts)భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 30

పోస్టుల వివరాలు:

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (PGT): 5
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (TGT): 11
  • ప్రైమరీ టీచర్‌ (PRT): 10
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ట్రైనర్‌ (PET): 2
  • స్పెషల్‌ ఎడ్యుకేటర్‌
  • కౌన్సెలర్‌ (ఫుల్‌టైం)

విభాగాలు: పొలిటికల్‌ సైన్స్‌, ఎకనామిక్స్‌, సైకాలజీ, మ్యాథ్స్‌, హిందీ, ఇంగ్లీష్‌, కంప్యూటర్‌ సైన్స్‌, సైన్స్‌ తదితర విభాగాలు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, డీఈఈడీ/బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీటెట్‌ లేదా టెట్‌ అర్హత ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Army Public School Golconda, hydershakote, hyderabad 500031.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 14, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

24, ఫిబ్రవరి 2022, గురువారం

GGH Kadapa jobs: పది/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో.. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు

GGH Kadapa Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లాలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH Kadapa) ఒప్పంద/ఔట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన (outsourcing jobs) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 25

ఖాళీల వివరాలు: ల్యాబ్ అటెండెంట్, రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, స్పీచ్‌ థెరపిస్ట్ తదితర పోస్టులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.12,000ల నుంచి రూ.37,100ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్, అనుభవం, రిజర్వేషన్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ. 300

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: సూపరింటెండెంట్‌ కార్యాలయం, జీజీహెచ్‌, కడప, ఆంధ్రప్రదేశ్‌.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

Indian Navy Recruitment 2022: రాత పరీక్షలేకుండానే.. ఇండియన్‌ నావీలో 155 ఎస్సెస్సీ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!

Indian Navy SSC Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ (Indian Navy ) 2023 జనవరి ఎస్టీ 23 కోర్సు.. వివిధ విభాగాల్లోని షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 155

పోస్టుల వివరాలు: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టులు

బ్రాంచుల వారీగా ఖాళీలు ఇలా..

ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌: 93

విభాగాలు: జనరల్ సర్వీస్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, పైలట్‌, లాజిస్టిక్స్‌

అర్హతలు: కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

  • ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌): 17

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత టెక్నికల్‌ నైపుణ్యాలు కూడా ఉండాలి.

  • టెక్నికల్‌ బ్రాంచ్‌: 45

విభాగాలు: ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌), ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ (జనరల్‌ సర్వీస్‌)

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మర్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: జనవరి 2, 1998 నుంచి జులై 1, 2003 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

23, ఫిబ్రవరి 2022, బుధవారం

RK Puram Army Public School jobs: సికింద్రాబాద్‌ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

RK Puram Army Public School Teachers Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురం ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (RK Puram Army Public School) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: లైబ్రేరియన్‌, అకౌంటెంట్‌, ఎల్‌డీసీ, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌, పారామెడిక్స్‌ (నర్సింగ్‌ అసిస్టెంట్‌), ఎంటీఎస్‌, ఎలక్ట్రీషియన్‌, గార్డెనర్ పోస్టులు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, లైబ్రరీ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Army Public School, RK Puram, Secunderabad.

దరఖాస్తు రుసుము: రూ. 100

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పోస్టు ద్వారా హార్డ్‌ కాపీలను పంపడానికి చివరితేదీ: మార్చి 22, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

Army Public School jobs: గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌లో నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

Army Public School Golconda Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ (Hyderabad)లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (Army Public School Golconda) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 7

పోస్టుల వివరాలు: అడ్మినిస్ట్రేటివ్‌ సూపర్‌వైజర్‌, ఎల్‌డీఏ, కంప్యూటర్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌ అసిస్టెంట్, సైన్స్‌ ల్యాబ్‌ అటెండెంట్, కౌన్సెలర్‌/హెల్త్‌ వెల్‌నెస్‌ టీచర్‌, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ డ్రైవర్‌ పోస్టులు.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: జనవరి 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 35 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: Army Public School, hydershakote, hyderabad 500031.

దరఖాస్తు రుసుము: రూ. 100

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

 

BOB Manager jobs: రాత పరీక్ష లేకుండానే.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 40 మేనేజర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.

Bank of Baroda Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబాయి ప్రధాన కేంద్రంగా ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (Bank of Baroda )ఒప్పంద ప్రాతి పదకన మేనేజర్ పోస్టుల (Manager posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 42

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ మేనేజర్‌ పోస్టులు: 27
  • మేనేజర్‌ పోస్టులు: 4
  • హెడ్‌/డిప్యూటీ హెడ్‌: 11

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 23 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: పోస్టును అనుసరించి సీఏ/ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణత ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. టెక్నికల్‌ నాలెడ్జ్‌ అవసరం.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 15, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

22, ఫిబ్రవరి 2022, మంగళవారం

ICAI CA exam 2022: సీఏ మే సెషన్‌ 2022 పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం.. ఈ తేదీల్లోనే పరీక్షలు

Registration process for ICAI May 2022 exams began: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) మే 2022 సెషన్‌ పరీక్షలకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సోమవారం (ఫిబ్రవరి 21) ప్రారంభించింది. ఈ ఏడాది మేలో జరిగే చార్టర్డ్ అకౌంటెంట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.orgలో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐసీఏఐ నిర్వహించే సీఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 13తో ముగుస్తుంది. ఆలస్య రుసుముతో మార్చి 20వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. కాగా చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్ పరీక్షలు ఈ ఏడాది మే 23న ప్రారంభమై, మే 29 వరకు నిర్వహించబడతాయి. ఇక గ్రూప్ 1 ఇంటర్మీడియట్ పరీక్షలు మే 15న ప్రారంభమై, మే 22 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 24న ప్రారంభమై, మే 30 వరకు జరగనున్నాయి.

సీఏ ఫైనల్ కోర్స్ గ్రూప్ 1 పరీక్షలు మే 14 నుంచి మే 21 వరకు జరుగుతాయి. గ్రూప్ II పరీక్షలు మే 23 నుంచి మే 29, 2022వరకు జరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ అసెస్‌మెంట్‌ పరీక్ష మే 14 నుంచి మే 17 జరగనున్నట్లు ఐసీఏఐ తెల్పింది.

ICAI CA exam 2022కు రిజిస్ట్రేషన్లు ఎలా చేసుకోవాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ www.icai.org ను ఓపెన్‌ చేయాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే examination tab లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్‌ ఓపెన్‌ అవుతుంది. అవసరమైన వివరాలు ఫిల్‌ చేసి, రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించి, సబ్‌మిట్‌ చేయాలి.
  • తర్వాత అప్లికేషన్‌ను సేవ్‌ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

Gemini Internet

Jobs: నకిలీ ఉద్యోగాల పట్ల జాగ్రత్త.. ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక

Jobs: కరోనా కాలంలో నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ ఉద్యోగాల పేరిట మోసాలు ఎక్కువయ్యాయి. నెలల తరబడి నిరుద్యోగులు సైతం నకిలీ ఉద్యోగాల (Fake Jobs) వలలో పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయపు పన్ను శాఖ ప్రజలను ప్రత్యేకంగా హెచ్చరించింది . ఎలాంటి మోసాలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆదాయపు పన్ను శాఖ ట్వీట్ చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. మీకు ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఆఫర్ చేస్తే అది నకిలీ. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department)లో ఉద్యోగాలకు సంబంధించి చాలా మందికి నకిలీ జాయినింగ్ లెటర్లు కూడా జారీ అవుతున్నాయి. ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మోసగిస్తున్నట్లు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పబ్లిక్ నోటీసులో పేర్కొంది. చాలా మంది అభ్యర్థులకు నకిలీ ఆఫర్ లెటర్లు, జాయినింగ్ లెటర్లు కూడా జారీ అయ్యాయి. ఇలాంటి మోసాల (Fraud) పట్ల అప్రమత్తంగా ఉండాలి.

SSC ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఉద్యోగాలు:

ఆదాయపు పన్ను శాఖ తరపున డిపార్ట్‌మెంట్‌లోని గ్రూప్-బి, గ్రూప్-సి ఉద్యోగాలు కూడా స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) ద్వారా జారీ చేయబడతాయని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం SSC వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మోసాలకు లోనుకావద్దని, నకిలీ ఉద్యోగాల జోలికి వెళ్లవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ఆదాయపు పన్ను శాఖ.

పార్ట్ టైమ్ జాబ్ ఆఫర్ల హెచ్చరిక!

దేశంలో చాలా మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోతున్న నేపథ్యంలో చాలా మంది పార్ట్‌టైమ్ ఉద్యోగాల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. పార్ట్ టైమ్ జాబ్ ద్వారా నెలకు 40-50 వేలు సంపాదించే ఆఫర్‌లు కూడా మీకు లభిస్తుంటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు మీ డబ్బుపై కన్నేసి ఉంచుతున్నారు. సైబర్ దోస్త్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ అప్రమత్తం చేస్తోంది. జాబ్‌ ఆఫర్లకు సంబంధించినవి ఏవి కూడా నమ్మవద్దని తెలిపింది.

Gemini Internet

 

Indian Bank jobs: నిరుద్యోగులకు అలర్ట్! పదో తరగతి అర్హతతో ఇండియన్ బ్యాంక్‌లో 202 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Indian Bank Security Guard Recruitment 2022: చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ బ్యాంక్‌.. ఇండియన్‌ బ్యాంక్‌ (Indian Bank) దేశ వ్యాప్తంగా పలు చోట్ల సెక్యూరిటీ గార్డు పోస్టు (Security Guard Posts)ల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 202

పోస్టుల వివరాలు: సెక్యూరిటీ గార్డులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 26 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.14,500ల నుంచి రూ.28,145ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. అలాగే దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అయ్యి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, లోకల్‌ ల్యాంగ్వేజ్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: మొత్తం 40 మార్కులకు గానూ ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. 90 నిముషాల పాటు ఈ పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 9, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

TIFR jobs: పది/ఇంటర్‌/డిగ్రీ అర్హతతో..టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌లో ఉద్యోగాలు

TIFR Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (TIFR Mumbai) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 8

పోస్టుల వివరాలు:

జూనియర్‌ హిందీ ట్రాన్సలేటర్‌ పోస్టులు: 1 ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ పోస్టులు: 1 సెక్యూరిటీ గార్డ్‌ పోస్టులు: 1 లైబ్రరీ ట్రైనీలు పోస్టులు: 4 తాత్కాలిక వర్క్ అసిస్టెంట్‌ పోస్టులు: 1

వయోపరిమితి: జనవరి 1, 2022నాటికి అభ్యర్ధుల వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల నుంచి రూ.59,478ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి పదో తరగతి, ఇంటర్‌, యూజీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధులకు టెక్నికల్‌ నాలెడ్జ్‌, టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, టీఐఎఫ్‌ఆర్‌, హోమీ భాభా రోడ్‌, నేవీ నగర్‌, ముంబాయి- 400005.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 12, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

21, ఫిబ్రవరి 2022, సోమవారం

TCS Jobs: బీటెక్‌ చేసిన వారికి బంపరాఫర్‌.. 7 లక్షల ప్యాకేజీతో టీసీఎస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు

TCS Jobs: ప్రముఖ దేశీయ ఐటీ సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులు చేసిన వారికి ఉద్యోగాలకోసం ప్రకటన జారీ చేసింది. ఇంతకీ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరు అర్హులు.? ఎలా అప్లై చేసుకోవాలి.? ఉద్యోగులను ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* టీసీఎస్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఆఫ్‌ క్యాంపస్‌ డిజిటల్‌ హైరింగ్‌ ప్రకటన జారీ చేసింది.

* టీసీఎస్‌ భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు బీఈ/బీఈ/బీటెక్‌, ఎంఈ/ఎంటెక్‌, ఎంసీఏ, ఎమ్మెస్సీ కోర్సులను పూర్తి చేసి ఉండాలి. 2019/2020/2021లో డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు. అలాగే ఐటీ రంగంలో కనీసం 6 నుంచి 12 నెలల అనుభవం ఉండాలి.

* అభ్యర్థుల వయసు 28 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

* ఇందుకోసం అభ్యర్థులు టీసీఎస్‌ కెరీర్ పోర్టల్ లోకి వెళ్లి..  రిజిస్టర్‌ నౌ క్లిక్‌ చేసి ఐటీ విభాగంలోకి వెళ్లి. వివరాలు నమోదు చేసుకోవాలి.

* ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ఫిబ్రవరి 25ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తేదీని ప్రకటిస్తారు.

* రిజిస్ట్రేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

* పూర్తివివరాలు, సందేహాల కోసం ilp.support@tcs.com మెయిల్‌, లేదా 1800 209 3111 టోల్‌ ఫ్రీ నెంబర్‌ను సంప్రదించండి.

 

Gemini Internet

Bank Of Baroda Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగాలు

Bank Of Baroda Recruitment: ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

ఖాళీల వివరాలు:

పోస్ట్ఖాళీలు
ప్రొడక్ట్ హెడ్1
అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్3
సీనియర్ మేనేజర్3
మేనేజర్3
మొత్తం: 10

 

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ఆఫీస్ అసిస్టెంట్, బిజినెస్ కరస్పాండెంట్, సూపర్ వైజర్, సీనియర్ మేనేజర్, ఫ్యాకల్టీ, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, ఇంటర్నల్ అంబుడ్స్‌మన్, ప్రొడక్ట్ హెడ్ వంటి పోస్టులు ఉన్నాయి.

* ప్రొడక్ట్ హెడ్ విభాగానికి దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఫుల్ టైమ్ డిగ్రీ, డిప్లొమా చేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్, మేనేజర్ తదితర ఖాళీలకు అప్లై చేసుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 07-03-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇలా దరఖాస్తు చేసుకోండి..

* అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.

* అనంతంర కెరీర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* తర్వాత కరెంట్‌ ఆపర్చునిటిస్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

* అభ్యర్థులు అర్హులైన పోస్టుకు సంబంధించిన నోటిఫికేషన్‌పై అప్లై నో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* చివరిగా అవసరమైన వివరాలను అందించి సబ్‌మిట్ నొక్కాలి.

 

Gemini Internet

NIN Recruitment: నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

NIN Recruitment: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ న్యూట్రీషన్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వ ఆరోగ్యర, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన ఈ సంస్థలో పలు పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసోసియేట్‌ (01), ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ (03), ప్రాజెక్ట్‌ ఫీల్డ్‌ వర్కర్‌ (04), ప్రాజెక్ట్‌ ల్యాబొరేటర్ఈ అటెండెంట్‌ (01), ప్రాజెక్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (01) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, డిప్లొమా, పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్‌/ఎండీఎస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను ది డైరెక్టర్‌, ఐసీఎమ్‌, నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రీషియన్‌, జమై ఉస్మానియా పోస్ట్‌, తార్నక, హైదరాబాద్‌ 50007, తెలంగాణ అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత విద్యార్హతలు, అనుభవవం ఆధారంగా షార్ట్‌లిస్టింగ్‌ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 15,800 నుంచి రూ. 47,000 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 10-03-2022 చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Gemini Internet

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

Railway Jobs: టెన్త్ పాస్ అయితే చాలు.. రైల్వేలో జాబ్.. ఎలాంటి రిజర్వేషన్లు లేవ్.. సోమవారమే లాస్ట్ డేట్

Rail Kaushal Vikas Yojana:  రైల్వే మంత్రిత్వ శాఖ దేశంలోని యువత కోసం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైల్ కౌశల్ వికాస్ యోజన’ పేరుతో వారిని స్వయం సాధికారత దిశగా అడుగులు వేయిస్తుంది. యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తుంది. ఇది పూర్తిగా ఉచితం.  మెషినిస్టు, వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ అంశాల్లో మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సెంటర్లలో ట్రైనింగ్ ఇస్తారు. రైల్వేలకు పనికివచ్చే ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ట్రైనింగ్ ఇస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్‌మెంట్ కల్పిస్తారు. ఇలా కాకుండా కోర్సు నేర్చుకున్న తర్వాత ఎవరైనా సొంతంగా ఉపాధి పొందాలనుకుంటే వారికి సాయ సహకారాలు అందిస్తారు. అంటే మిషనరీ కొనుగోలులో డిస్కౌంట్‌ ఇప్పించడం.. లోన్లు వచ్చేలా చేయడం వంటివి. మూడేళ్లలో 50 వేల మందికి ట్రైనింగ్ ఇవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ ఫిబ్రవరి 7న  విడుదలైంది. అప్లై చేయడానికి చివరి తేదీ 21.2.22. ఈ పోస్టులకు సంబంధించి గొప్ప విషయం ఏంటంటే.. ఎలాంటి రిజర్వేషన్లు లేవు.

ఇందుకు అర్హతలు ఒకసారి చూద్దాం… 

  1.  18 నుంచి 35 సంవత్సరాలలోపు వయసు వారై ఉండాలి.
  2. భారతీయ పౌరులై ఉండాలి.
  3. టెన్త్ పాసై ఉండాలి
  4. టెన్త్ క్లాసులో వచ్చిన మార్కుల ద్వారా దరఖాస్తుదారులను ఎంపిక చేస్తారు.
  5. ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు
  6. మంచి ఫిట్‌నెస్‌ ఉండాలి
  7. డాక్టర్ నుంచి నుంచి చూపు, వినికిడి, మానసిక ఆరోగ్యం బాగున్నాయనే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ దరఖాస్తు పత్రంతో పాటు సిబ్మిట్ చేయాలి.
  8. అభ్యర్థికి ఎలాంటి అంటువ్యాధులు లేవనే ధ్రువీకరణ కూడా అవసరం.
  9. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ‘నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇనిస్టిట్యూట్’ సర్టిఫికేట్లను ఇస్తారు

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. శిక్షణలో భాగంగా స్టైపెండ్, ఇతర అలవెన్సుల లాంటివేమీ ఇవ్వరు. ఒక ట్రేడ్‌లో ఒకసారి మాత్రమే అభ్యర్థిని అనుమతిస్తారు.  సర్టిఫికేట్ పొందడానికి 75 శాతం హాజరు మస్ట్‌గా ఉండాలి. రైల్ కౌశల్ వికాస్ యోజన వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని, పూర్తి చేసిన దరఖాస్తును ట్రైనింగ్ సెంటర్లకు పోస్టు ద్వారా పంపచ్చు. అప్లికేషన్లు ఆన్‌లైన్లో కూడా తీసుకుంటారు. మరిన్ని వివరాల కోసం https://railkvy.indianrailways.gov.in/rkvy_userHome/ చూడొచ్చు.

Gemini Internet