ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

అక్టోబర్ 29, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

2,000 jobs: ‘స్కిల్‌’ శిక్షకులకు ఆహ్వానం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-  రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్ ‌ హబ్స్ , ప్రతి పార్లమెంట్ ‌ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్ ‌ కాలేజీలు , ఒక స్కిల్ ‌ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది . ప్రతి జాబ్ ‌ రోల్ ‌ కు ఒక సర్టిఫైడ్ ‌ ట్రైనర్ ‌ చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీఎస్ ‌ ఎస్ ‌ డీసీ అంచనా వేసింది . అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ ‌ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని , ఇందుకు సంబంధించిన నిర్వహణ విధివిధానాలు ( ఎస్ ‌ వోపీ ) ని రూపొందించినట్లు ఏపీఎస్ ‌ ఎస్ ‌ డీసీ ఎండీ సీఈవో వినోద్ ‌ కుమార్ ‌ న ‌ వంబ ‌ ర్ 2 న ‌ ...

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 116 కోర్సులు ఇవే...🖋️

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 116 కోర్సులు ఇవే...🖋️ 001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ 002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ 003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ 004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ 005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ 006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 007. బయో మెడికల్ ఇంజనీరింగ్ 008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్ 009. సెరామిక్స్ ఇంజనీరింగ్ 010. కెమికల్ ఇంజనీరింగ్ 011. సివిల్ ఇంజనీరింగ్ 012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ 016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ 017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ 018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 019. మెరైన్ ఇంజనీరింగ్ 020. మెకానికల్ ఇంజనీరింగ్ 021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 022. మెటాలర్జీ 023. మెటరాలజీ 024. మైనింగ్ ఇంజనీరింగ్ 025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ 026. ఫిజికల్ సైన్సెస్ 027. పాలీమర్ ఇంజనీరింగ్ 028. రోబోటిక్స్ 029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ 030. అగ్రికల్చర్ సైన్స్ 031. బయోలాజికల్ సై...

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺 ‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’ - శకుంతలా దేవి

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺 ‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’  - శకుంతలా దేవి గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది.  శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.    ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.    ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది...

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు… 1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి. జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’ ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె. అయోమయంగా చూశాడు డాక్టర్. ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా…  ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ...

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు | అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.   ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు: 1. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01 2. టెక్నికల్ సూపరింటెండెంట్- 04 3. సెక్షన్ ఆఫీసర్- 02 4. జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌)- 01 5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02 6. ఫిజియోథెరపిస్ట్ (మేల్‌)- 01 7. స్టాఫ్ నర్స్- 06 8. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01 9. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01 10. జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01 11. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01 12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10 13. అకౌంటెంట్- 09 14. జూనియర్ అసిస్టెంట్- 17 15. జూనియర్ టెక్నీషియన్- 29 16. జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02 17. జూనియర్ హార్టికల్చరిస్ట్- 01 మొత్తం పోస్టుల సంఖ్య: 89. అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  దరఖాస్తు రుసుమ...

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 | పరీక్ష విధానం: | అర్హతలు: | దరఖాస్తు రుసుము: | తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: | ముఖ్యమైన తేదీలు:

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 18వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 23 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు.  వివరాలు... సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-202 పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.  అర్హతలు: పేపర్-1...

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు! * దరఖాస్తుల ప్రక్రియ షురూ * నవంబర్‌ 30 వరకు తుది గడువు * జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు * ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు!   * దరఖాస్తుల ప్రక్రియ షురూ * నవంబర్‌ 30 వరకు తుది గడువు * జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు * ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. విద్యార్థులు నవంబర్‌ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) గురువారం(నవంబర్‌ 2) నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌లో ప్రవేశానికి పేపర్‌-2ఏ, బీ-ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2బీ రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పేపర్‌-1లో 300 మార్కులు(90 ప్రశ్నలు), పేపర్‌-2ఏలో 400 మార్కులు(82 ప్రశ్నలు), పేపర్‌-2బీలో 400 మార్కులు(105 ప్రశ్నలు) ఉంటాయి...

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు.

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలోనే జాబ్ మేళాను నిర్వహించనున్నారు. నవంబర్ 03, 2023 ఉదయం 9 గంటలకు APSSDC డిస్టిక్ ఆఫీస్ అనంతపురం నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ సంస్థలు మొబైల్స్ మరియు టీం లెస్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరంలో క్యాషియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ అసోసియేట్స్ మరియు డి మార్ట్, స్విగ్గి, విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటి కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై చదువు వారికి అర్హతగా నిర్ణయించారు. వీటిలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు అనంతపురం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. మరియు అర్హత సాధించిన వారికి 12 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు నెల జీతం అందిస్తారు.పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కంపెనీలలో నూట పది ఉద్యోగాల వరకు ఖాళీగా ...

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు  నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  ఖాళీల వివరాలు: 1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు 2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 10 పోస్టులు 3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు మొత్తం పోస్టుల సంఖ్య: 74. అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి.  వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పే స్కేల్: నెలకు రూ.40000 - రూ.140000. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇం...

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023  సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు. పరీక్ష వివరాలు... జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023  సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహ...

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024  జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.  ప్రకటన వివరాలు: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు కావచ్చు. * తొలి విడతను వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుకుంటామని ఎన్‌టీఏ తేదీ. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్‌, బీ-ప్లానింగ్‌ క...

Current Affairs - 02/11/2023 (Telugu / English)

Current Affairs - 02/11/2023                 (Telugu / English)          1. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజున "మేరా యువ భారత్ సంగతన్"ని ఎవరు ప్రారంభించారు?  జ:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  2. విమాన ఇంజిన్ విడిభాగాలను తయారు చేసేందుకు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఏ భారతీయ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది?  జ:- HAL.  3. భారతదేశంలో ఐఫోన్‌ను ఏ కంపెనీ తయారు చేస్తుంది?  జ:- టాటా గ్రూప్ ద్వారా.  4. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే 5 సంవత్సరాలలో ప్రతిరోజూ 2 కొత్త పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?  జ:- అస్సాం ముఖ్యమంత్రి.  5. భారతదేశం అంతటా 31 అక్టోబర్ 2023న ఏ రోజును జరుపుకుంటారు?  జ:- జాతీయ ఐక్యతా దినోత్సవం.  6. CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఎంత మంది సభ్యుల ICN (ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్)లో సభ్యుడిగా మారింది?  జ:- 18-సభ్యులు.  7. జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ఏ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వం ఆవిష్కరించింది?  జ:- ఢిల్లీ.  8. 15వ గిరిజన యూత్ ఎ...

6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా ప్రిపేర్ అవ్వాలంటే ఇలా చేయండి

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువు కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని..ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో.. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో 5,660 టీజీటీ పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రత్యేకత, భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు.. టీచింగ్,నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో 6,329 కొలువులు టీజీటీ హోదాలో మొత్తం 5,660 పోస్ట్‌లు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌ రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థలు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 740 పాఠశాలలు ఉండగా.. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 28, తెలంగాణలో 23 స్కూల్...