నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం(ప్రొ ఫెషనల్) | LLM (Professional) at National Law University | नेशनल लॉ यूनिवर्सिटी में एलएलएम (प्रोफेशनल)
ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్ఎల్యూ) ఎల్ఎల్ఎం (ప్రొ ఫెషనల్) ప్రోగ్రామ్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ ఇస్తారు. ఇది ఎగ్జిక్యూటివ్ డిప్లొమా ప్రోగ్రామ్. దీనిని పీజీ డిప్లొమాకు సమానంగా పరిగణిస్తారు. దీనికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు ఉంది. ప్రోగ్రామ్ వ్యవధి ఏడాది. రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్ కోర్ పేపర్లు, రెండో సెమిస్టర్లో స్పెషలైజేషన్కు సంబంధించిన పేపర్లు చదవాల్సి ఉంటుంది. సెమిస్టర్కు నాలుగు పేపర్లు ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ను డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాంటాక్ట్ లెర్నింగ్ విధానాల్లో నిర్వ హిస్తారు. కాంటాక్ట్ తరగతులు ఢిల్లీ క్యాంపస్లో ఉంటాయి. కనీసం 75 శాతం అటెండెన్స్ తప్పనిసరి. సెమిస్టర్ చివ రలో ఎండ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంటర్నల్ అసైన్మెంట్కు 30 మార్కులు, ఎండ్ ఎగ్జామ్నకు 70 మార్కుల వెయి టేజీ నిర్దేశించారు. స్పెషలైజేషన్లు: క్రిమినల్ లా, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ స్టడీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, కమర్షియల్ లా, ఎన్విరాన్మెంటల్ లా అండ్ జస్టిస్, కన్జూమర్ లా అండ్ ప్రాక్టీస్, హెల్త్ లా అండ్ పాలసీ, ట్యాక్సేషన్ లా అర్హత: గుర్తింపు పొందిన కాలేజ్...