*ఇంజనీరింగ్ కనీస ఫీజు* *రూ.79,600✍️📚* *గరిష్ఠ ఫీజు రూ.1.89 లక్షలుగా నిర్ణయం**🌻అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి*): దేశంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజు రూ.79,600గా, గరిష్ఠ ఫీజు 1.89 లక్షలుగా నిర్ణయించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు ఉండాల్సిన కనీస, గరిష్ఠ ఫీజులపై నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికను కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది. 2015లో అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ప్రైవేటు కళాశాలల్లో ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులకు వ సూలు చేయాల్సిన ఫీజులను నిర్ణయించింది. అయితే అప్పట్లో గరిష్ఠంగా ఇంతకుమించి వసూలు చేయకూడదని మాత్రమే నిబంధన పెట్టారు. కనీస ఫీజు ఎంత ఉండాలన్నదానిపై చెప్పలేదు. దీంతో పలు రాష్ట్రాల్లోని విద్యాశాఖలు దీనిపై తమకు తామే నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కళాశాల స్థాయి, మౌలిక సదుపాయాలను బట్టి ఏడాదికి రూ.30వేల నుంచి రూ.65వేల వరకు నిర్ణయించారు. తెలంగాణలో కూడా ఇలాగే చేశారు. అయితే కనీస ఫీజును కూడా నిర్ణయించాలంటూ కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఢిల్లీ హైకోర్టులో కేసు వేశాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మ...