Drysrhu: డా.వైఎస్సార్‌హెచ్‌యూలో బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్ కోర్సు | Drysrhu: B.Sc (Hons) Horticulture Course at Dr. YSRHU
పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ… 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంకు ఆధారంగా ప్రవేశాలుంటాయి. యూనివర్సిటీ కళాశాలలు, అనుబంధ కళాశాలలకు మొత్తం 541 సీట్లు కేటాయించారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10 శాతం సీట్లు ఉన్నాయి. కోర్సు వివరాలు: * నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్.) హార్టికల్చర్ డిగ్రీ ప్రోగ్రామ్ సీట్లు: 541. అర్హత: రెండేళ్ల ఇంటర్మీడియట్ పరీక్ష (ఫిజికల్ సైన్సెస్/ బయోలాజికల్/ నేచురల్ సైన్సెస్)తో పాటు ఏపీ ఈఏపీసెట్ 2024 ర్యాంకు సాధించి ఉండాలి. వయసు: 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్లు మించకూడదు). ఎంపిక విధానం: ఏపీ ఈఏపీసెట్-2024 ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ద్వారా. దరఖాస్తు రుసుము: రూ.1000(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.500) దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్...