కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ద్వారా కీలక ప్రకటన చేశారు. ప్యాకేజీ ఫుడ్స్, ఆసుపత్రి బెడ్స్‌పై 5 శాతం జీఎస్టీ బాదుడుపై విమర్శలు చెలరేగిన నేపథ్యంలో జీఎస్టీ వర్తించని కొన్నివస్తువుల జాబితాను విడుదల చేశారు. జీఎస్టీపై గందరగోళం నెలకొనడంతో సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ప్రీప్యాకింగ్ లేదా లేబెల్డ్ చేసి విక్రయిస్తేనే జీఎస్టీ వర్తిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఓట్స్, మొక్కజొన్న, బియ్యం, పప్పు, బియ్యం, రవ్వ, సెనగపిండి, పెరుగు, లస్సీ, మరమరాలు వంటి నిత్యావసర వస్తువులను బ్రాండెడ్‌గా, ప్యాక్ చేసి విక్రయిస్తే మాత్రమే పన్ను ఉంటుందని ఆమె వివరణ ఇచ్చారు. ఇవే ఉత్పత్తులను విడిగా, ప్యాక్ చేయకుండా, విక్రయిస్తే జీఎస్టీ వర్తించదని ఆర్థికమంత్రి వెల్లడించారు. లూజ్‌గా లేదా, బహిరంగ విక్రయాలపై జీఎస్టీ వర్తించదు అంటూ 14 వస్తువుల జాబితాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ట్వీట్ చేశారు. లేబుల్ లేని లేదా ప్యాక్ చేయని, విడిగా అమ్మే వస్తువులపై జీఎస్టీ ఉండదని న...