DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్ మోడల్ పేపర్లు రెడీ | జూన్ 3న ఇంటర్ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల
🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు. ‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM 4,657 మందికి ఊరట అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్ మెరిట్ లిస్టులో ఉండి.. సెలెక్షన్ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్ టీచర్(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 🔳టెన్త్ మోడల్ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM 100 మార్కులను విభజిస్తూ ...