ఇంటర్మీడియెట్ ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేశారా.. త్రివిధ దళాల్లో చేరాలనే ఆసక్తి ఉందా.. అయితే మీకు స్వాగతం పలుకుతోంది.. భారత నావికా దళం! కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశ పెట్టిన.. ‘అగ్నిపథ్’ స్కీమ్‌లో భాగంగా.. నావికా దళంలో.. 2,800 ‘అగ్నివీర్–ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్)’ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది! ఈ పోస్ట్‌లకు.. ఈ నెల 15 నుంచి దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో.. అగ్నివీర్ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, రాత పరీక్ష, సర్వీస్ కాలం, వేతనం తదితర సమాచారం... 2,800 పోస్ట్‌లకు నావికా దళం నోటిఫికేషన్ ఇంటర్మీడియెట్ ఎంపీసీ, బైపీసీ అర్హతగా అవకాశం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, రిటెన్ టెస్ట్‌లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక త్రివిధ దళాల్లో చేరాలనుకునే యువత దేశంలో లక్షల సంఖ్యలో ఉంటారనడంలో సందేహం లేదు. ఇలాంటి వారి కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రకటించింది. త్రివిధ దళాల్లో ఉద్యోగ నియామకాల కోసం అగ్నిపథ్ పేరిట ప్రత్యేక విధానానికి రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియెట్ అర్హతలతో సాయుధ బలగాల్లో అగ్నివీర్ పేరుత...