AFCAT 2023 Notification: వాయుసేనలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ | దేశ రక్షణలో వెన్నెముక వంటి వాయు సేనలో చేరాలని కోరుకునే యువతకు అద్భుతæఅవకాశం స్వాగతం పలుకుతోంది. వివిధ విభాగాల్లో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది!! జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. ఎయిర్‌ఫోర్స్‌లో.. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో గెజిటెడ్ ఆఫీసర్ కొలువు సొంతమవుతుంది. నెలకు రూ.లక్షకు పైగా వేతనం అందుకునే అవకాశం లభిస్తుంది. ఏఎఫ్‌క్యాట్(2)-2023 నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్ అంశాలు తదితర వివరాలు..
ఏఎఫ్‌క్యాట్(2)-2023 నోటిఫికేషన్ విడుదల ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో 276 పోస్ట్‌లు ఏఎఫ్‌క్యాట్ ద్వారా ఎంపిక బ్యాచిలర్ డిగ్రీ, బీటెక్ అర్హతలుగా ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే ప్రక్రియే.. ఏఎఫ్‌క్యాట్. వాయుసేన ఏటా రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. మొత్తం 276 పోస్ట్‌లు ఏఎఫ్‌క్యాట్ (2)-2023 ద్వారా మొత్తం 276 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఫ్లయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్(ఫ్లైయింగ్)ల్లో పోస్టులు ఉన్నాయి. అర్హతలు ఫ్లయింగ్ బ్రాంచ్: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ పాస్ అవ్వాలి. ఏరోనాటికల్ ఇంజనీర్(ఎలక్ట్రానిక్స్): నిర్దేశిత బ్రాంచ్‌లతో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. ఏరోనాటిక్ ఇంజనీర్(మెకానికల్): ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటనెన్స్, మెకానికల్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఆటోమేషన్, ప్రొడక్షన్, మెకట్రానిక్స్, ఇండస్ట్...