18, డిసెంబర్ 2021, శనివారం

తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ శ్రీవారి సేవలో అత్యంత ఖరీదైన టికెట్టు | ధర కోటి యాభై లక్షలు


■ ఆ సేవకు ఎందుకు అంత డిమాండ్..?
■ ఇంతకీ ఏంటి ఆ సేవలు ?

పూర్తి వివరాలు మీకోసమే....!
              👇👇👇
*🙏ఉదయాస్తమాన సేవ🙏*.    
         తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర...?
ఎందుకు అంత డిమాండ్...?

👉 సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.

★ ఆ డిమాండ్ కి తగ్గట్టే ఉదయాస్తమాను సేవ టికెట్ల ధరల కోటిన్నర రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది.

🕉 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది.

🟢  సధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున 1.5 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది.

 🕉 పరస్తుతం తిరుమల తిరుపతి
దేవస్థానం దగ్గర 531  ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.

🕉 ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందుతారు.

◆ ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు.

🟢 "ఉదయాస్తమాన సేవా"
 టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు 600 కోట్ల పైగా ఆదాయం వస్తుంది.

◆ ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇప్పటికే నిర్ణయించింది.

◆ సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం.

◆ °అందుకే సేవ ఎంత ఖరీదైనా భక్తులు వెనుకాడరు.
టికెట్ల ధరలు ఎంతైనా భారీగా డిమాండ్ ఉంటుంది..

🕉 అసలు ఉదయాస్తమాన సేవలు అంటే ఏంటి.. ?
🕉 ఏఏ సేవలు అందుబాటులో ఉంటాయి.
🕉 వటికి ఎందుకంత డిమాండు.?

👉 పురాణ పురుషోత్తముడైన వేంకటేశ్వర స్వామి వారికి తిరుమల లో ఉదయము నుండి రాత్రి వరకు జరిగే ఆర్జిత సేవలను ఉదయాస్తమాన సేవ అంటారు.

 🕉 శ్రీవారి ఆర్జిత సేవలు ఇవే...!

1. సుప్రభాత సేవ
2. తోమాల సేవ
3. కొలువు
4. అష్ట దళ పాద పద్మారాధన (సువర్ణ పుష్ప అర్చన)
5. అభిషేకం
6. వస్త్రాలంకార సేవ
7. కల్యాణోత్సవం
8. రథోత్సవం
9. తిరుప్పావడ
10. సహస్ర దీపాలంకరణ సేవ
11. ఏకాంత సేవ.

ఈ సేవలు ఎలా చేస్తారు.. ప్రత్యేకతలు ఏంటి..?

🕉 1. సుప్రభాత సేవ:
తర తరాలుగా హైందవ ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తర శ్రీ వేంకటేశ్వరస్తవం ఈసుప్రభాతం.

👉 ఇందులో..
● ఇరువది తొమ్మిది శ్లోకాలు గల సుప్రభాతాన్ని,
● పదకొండు శ్లోకాలున్న స్తోత్రాన్ని,
● పదహారు శ్లోకాలున్న ప్రపత్తి ని,
● పదునాలుగు శ్లోకాలున్న మంగళ శాసనాన్ని,

 👉 15వ శతాబ్దములో  మహాముని శిశ్యులైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి రచించారు.

★ ఈ దివ్య గానం ఎక్కడ విన్న మనస్సు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటుంది.
★ శ్రీ వారి సుప్రభాతం అనే ఈ మేలు కొలుపు సేవలో పాల్గొంటే మన మనస్సు మేల్కొని శ్రీ వారి సేవ కు అంకితమవుతుంది.

🕉 2. తోమాల సేవ:
          పుష్పాలంకార ప్రియుడైన శ్రీనివాసుని దివ్య మంగళ మూర్తి కి అనేక పుష్ప మాలికలతో, తులసి మాలలతో చేసే అలంకారమే తోమాల సేవ.

👉 ఈ సేవ లో పాల్గొన్న వారి మనస్సు అనే పుష్పం శ్రీ వారి పదాల చెంత చేరి జన్మ ధన్య మవుతుంది.

🕉 3. కొలువు:
         తిరుమల లో బంగారు వాకిలికి ఆనుకొని వున్న గది ని స్నపన మండపం అంటారు.

  ఇక్కడే శ్రీ వారికి ప్రతి రోజు ఆస్థానం జరుగు తుంది.
సన్నిధి లో వున్న కొలువు - శ్రీనివాస మూర్తి ని,
ఛత్ర చామరాది మర్యాదలతో, మంగళ వాద్య పురస్సరంగా స్నపన మండపంలో  ఉంచిన బంగారు సింహాసనం పై వేంచేపు చేస్తారు.

◆ ఆ తరువాత స్వామి కి కొలువు నిర్వహించబడుతుంది.
◆ అనంతరం ఆలయ అర్చకులు పంచాంగ శ్రవణాన్ని స్వామి వారికి విన్న విస్తారు.

◆ అలాగే ఆలయ ట్రెజరీ స్వామి వారి యొక్క లావాదేవీలను (ఆదాయ వ్యయాలను) స్వామి వారికి విన్న విస్తారు.
👉 °ఈ సేవ ను చూసి తరించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి స్వామి వారి అనుగ్రహం కలుగు తుంది.

🕉 4.అష్ట దళ పాద పద్మారాధన:
    (సువర్ణ పుష్ప అర్చన)
తిరుమల క్షేత్రం లో ప్రతి నిత్యం వెయ్యి నూట ఎనిమిది (1108) సువర్ణ పుష్పాలతో,
 సహస్ర నామాలతో స్వర్ణాలంకార భూషితుడయిన శ్రీ
వారికి ఈ అర్చన సేవ జరుగు తుంది.

◆ శ్రీ వారి అర్చనలో భక్తులు మనస్సు ఏకాగ్రతను పొంది,
శ్రీ వారి పాదాల మీద కేంద్రీకరింపబడి,
ఆధ్యాత్మిక ఆనందం మరియు లక్ష్మి కటాక్షం కలుగుతుంది.

🕉 5. అభిషేకం:
           శ్రీ వారి అభిషేకాన్ని దర్శిస్తే చాలు భక్తులు శారీరక, మానసిక రుగ్మతలు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి.

🕉 6. వస్త్రాలంకరణ సేవ:
        అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసునకు సర్వాంగ సుందరంగా, నయనానంద కరంగా పట్టు వస్త్రాలను
అలంకరించడమే వస్త్రాలంకరణ సేవ.

🕉 7. కల్యాణోత్సవం:
        శ్రీ దేవి, భూదేవి సమేతుడైన శ్రీ మలయప్ప స్వామి వారికి ప్రతి రోజూ నిత్యం కల్యాణోత్సవం జరుగుతుంది.
★ 15వ శతాబ్దములొ  తాళ్ళపాక వంశస్థులచే ఈ కల్యాణోత్సవం ఆరంభిచబడినట్లు శాసనాల వల్ల తెలుస్తుంది.
👉 సర్వ జనులు క్షేమ, స్థైర్య,
ధైర్యాదులతో ఉండాలంటే
 ★ మహా సంకల్పం తో శ్రీ వారికీ కల్యాణోత్సవం చేయటం పరిపాటి.
👉 ఈ నిత్య కళ్యాణం వల్లనే శ్రీ వారిని కల్యాణ చక్రవర్తి అని,
తిరుమల క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా విరాజిల్లు తున్నది.

🕉 8. రథోత్సవం:
         "రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే..|"
◆ సకల లోకాధిపతి అయినటువంటి శ్రీ వేంకటేశ్వర స్వామి ని రథోత్సవం లో దర్శించు భాగ్యం వలన మరి యొక్క జన్మ ఉండదు అని ఆగమ శాస్త్రం చెబుతుంది.

🕉 9. తిరుప్పవాడ:
       ప్రతి గురువారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి రెండవ అర్చన అనంతరం జరిగే నివేదనను తిరుప్పావడ సేవ అంటారు.
తిరుప్పావడ సేవ లో
పాల్గొన్న భక్తులకు నిత్యం అన్నం సమృద్ది గా కలుగుతుంది.
పాడి పంటలు వృద్ధి చెందుతాయి.

🕉 10.సహస్ర దీపాలంకరణ సేవ:
       ఉభయ దేవేరులతో కూడిన మలయప్ప స్వామి వారు, సర్వాలంకార భూషితుడై వైభవోత్సవ మండపం నుండి కొలువు మండపానికి
విచ్చేస్తారు.
◆ అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య వున్న ఊయలలో స్వామి వారు ఉభయ దేవేరుల సమేతంగా
ఆశీనులై, భక్తులకు దర్శనమిస్తారు.
👉 ఆ సమయం లో వేద పండితులు వేద మంత్రాలతో స్వామి వారిని కీర్తిస్తారు. నాద స్వర విద్వాంసులు
సుస్వరంగా నాదస్వరాన్ని విని పిస్తారు. అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతో, పురందర దాసు కీర్తనలతో శ్రీ వారికి
స్వరార్చన చేస్తారు.

◆ వేద, నాద, గానాలను ఆలకిస్తూ, మలయప్ప స్వామి మెల్ల మెల్లగా ఉయ్యాల తూగుతూ భక్తులకు దర్శనమిస్తారు.
👉 °ఈ సేవ లో దేవ దేవున్ని  దర్శించిన భక్తునకు సత్సంతానం కలుగుతుంది.

🕉 11.ఏకాంత సేవ:
       తిరుమల శ్రీ వారి ఆలయం లో చివరగా జరిగే సేవ ఏకాంత సేవ.
👉 ఈ సేవ లో స్వామి వారు బంగారు పట్టె మంచం లో శయన మూర్తి గా దర్శన మిస్తారు.
◆ శ్రీ వారి పరమ భక్తురాలయిన మాతృ శ్రీ వెంగమాంబ ముత్యాల హారతి ని స్వామి వారికి సమర్పిస్తారు.
🟢 అన్నమా చార్యుల
వారి జోల పాట ను పాడి ఆరోజు సేవలను ముగిస్తారు.

14, డిసెంబర్ 2021, మంగళవారం

Income Tax Notice: ఇన్‌కమ్ టాక్స్ నుంచి నోటీసు వచ్చిందా ?.. అప్పుడేం చేయాలి ?.. పూర్తి వివరాలు

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, ఫైలింగ్, జేఎస్​ఓఎన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ, కామన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ  శాఖ నుండి నోటీసు రావాలని ఎవరూ కోరుకోరు. అక్కడి నుంచి నోటీసులు రావొద్దనే ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. 

Gemini Internet

ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. దీని కారణంగా ఆ శాఖ నుంచి మీకు నోటీసులు కూడా రావొచ్చు. అయితే ఈ రకంగా నోటీసులు పొందిన వాళ్లు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది.

సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది.

ఇక్కడ వచ్చే సాధారణ నోటీసులు కోసం సెక్షన్ 139(9) ప్రకారం ఐటీఆర్‌లో ఏదైనా సమాచారం లేకపోయినా లేక ఐటీఆర్ ఫారమ్‌లో ఇచ్చిన సమాచారం ఐటీ డిపార్ట్‌మెంట్ డేటాతో సరిపోలకపోతే అది తప్పుడు సమాచారంగా పరిగణించబడుతుంది.

ఈ పరిస్థితిలో పన్ను చెల్లింపుదారులు దీనికి 15 రోజుల్లోగా స్పందించాలి. అలా చేయడంలో విఫలమైతే వారి ఐటీఆర్ తిరస్కరించబడుతుంది. డిపార్ట్‌మెంట్ అడిగిన ప్రశ్నకు వివరంగా సమాధానం ఇవ్వాలి. దీని వల్ల వారికి మీ సమస్యను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది ఉండదు.

అదనపు పన్ను చెల్లించినప్పుడు, వాపసును పన్ను చెల్లింపుదారుకు నివేదించినప్పుడు లేదా అసలు పన్ను కంటే తక్కువ చెల్లించినప్పుడు పన్ను బాధ్యతల గురించి శాఖ పన్ను చెల్లింపుదారులకు తెలియజేస్తుంది. ఇందుకోసం 143(1) కింద ఒక సమాచార నోటీసు పంపుతుంది.

ఫారమ్ 16, ఫారమ్ 16A ITR, TDS సర్టిఫికేట్‌లో ఆదాయం, మినహాయింపు లేదా మినహాయింపు మధ్య ఎటువంటి సంబంధం లేనప్పుడు సెక్షన్ 143(1)(a) ప్రకారం సమాచార నోటీసు పంపిస్తారు.

ITRపై పన్ను చెల్లింపుదారు నుండి అసెస్సింగ్ అధికారికి ఏదైనా అదనపు సమాచారం అవసరమైనప్పుడు సెక్షన్ 142(1) కింద నోటీసు ఇవ్వబడుతుంది. పన్నుచెల్లింపుదారుడు ఏ సంవత్సరంలో అయినా ITR ఫైల్ చేయకపోయినా, దానిని పంపవచ్చు.

కానీ మునుపటి సంవత్సరాల ఆధారంగా, అసెస్సింగ్ అధికారి ITRని ఫైల్ చేయాలని డిమాండ్ చేస్తారు. సెక్షన్ 142(1) కింద నోటీసుకు స్పందించకపోతే రూ. 10,000 జరిమానా లేదా చట్టపరమైన చర్య తీసుకోవచ్చు.

జరిమానా, జరిమానా లేదా పన్ను డిమాండ్ చేసినప్పుడు సెక్షన్ 156 కింద IT శాఖ డిమాండ్ నోటీసును పంపుతుంది. నోటీసు అందుకున్న 30 రోజులలోపు మీరు బకాయి మొత్తాన్ని చెల్లించాలి.

ఎవరైనా ITRలో ఆదాయం చాలా తక్కువగా ఉందని లేదా నష్టం ఎక్కువగా నివేదించబడిందని గుర్తించినప్పుడు ఆదాయపు పన్ను శాఖ సెక్షన్ 143(2) కింద స్క్రూటినీ ఆర్డర్ ఇస్తుంది. ఇది దర్యాప్తు కోసం ఇచ్చే ఆర్డర్.

13, డిసెంబర్ 2021, సోమవారం

EPFO: పీఎఫ్‌ వడ్డీ మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో చెక్‌ చేయండిలా..

ఇంటర్నెట్డెస్క్‌: పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం చొప్పున 25 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి. ఎస్సెమ్మెస్‌, ఉమాంగ్‌ యాప్‌, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌, మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా మీ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు.

ఈపీఎఫ్వో పోర్టల్‌: ఈపీఎవో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్‌ సర్వీసెస్‌’లోని ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.

మిస్డ్ కాల్ ర్వీస్‌: ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్‌కాల్‌ ఇచ్చిన తర్వాత ఓ రింగ్‌ అయి వెంటనే కాల్‌ కట్‌ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్‌ వివరాలు ఎస్సెమ్మెస్‌ రూపంలో ప్రత్యక్షమవుతాయి.

ఉమాంగ్యాప్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్‌ యాప్‌ ద్వారా మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్‌ యాప్‌లోని ఈపీఎఫ్‌వోను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్‌ సర్వీసెస్‌’ విభాగంలోకి వెళ్లి ‘వ్యూ పాస్‌బుక్‌’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్‌ నంబర్‌తో పాటు మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్‌ ఐడీని క్లిక్‌ చేయడం ద్వారా పీఎఫ్‌ బ్యాలెన్స్‌ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్‌ ఖాతాతో మొబైల్‌ నంబర్‌ ముందే జత చేసి ఉండాలి.

ఎస్సెమ్మెస్ద్వారా: యూఏఎన్‌ యాక్టివేట్‌ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్‌ ఖాతాకు జత చేసిన మొబైల్‌ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 77382 99899 నంబ‌ర్‌కు ఎస్సెమ్మెస్‌ పంపించాలి. ప్రస్తుతం ఈ సదుపాయం పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. ఒకవేళ తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని ఎస్సెమ్మెస్‌ పంపించాల్సి ఉంటుంది.

Visit Gemini Internet for EPF withdrawals

పి ఎఫ్ లో డబ్బు విత్ డ్రా చేయాలనుకునే వారు, వారి ఒరిజినల్  బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఆధార్ కు లింక్ అయిన మొబైల్, UAN నెంబర్ UAN కు లింక్ అయిన మొబైల్ నెంబరును తీసుకుని  జెమిన ఇంటర్ నెట్ నందు సంప్రదించవచ్చు.

12, డిసెంబర్ 2021, ఆదివారం

LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్‌ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి

LIC Scholarship 2021: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2020 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం గ్రేడ్‌తో X, XII లేదా తత్సమానం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆల్ ఇండియా ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న ఆర్థికంగా బలహీన విద్యార్థులు డిసెంబర్ 31, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలి. LIC స్కాలర్‌షిప్‌లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు, ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు

LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు

LIC డివిజనల్ కేంద్రానికి మొత్తం 20 సాధారణ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఇందులో బాలురకు 10, బాలికలకు 10 కేటాయిస్తారు. ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి వీటిని అందిస్తారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థలు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలోవృత్తి విద్యా కోర్సులు చదివేవారికి అవకాశం ఉంటుంది.అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.20,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమాన గ్రేడ్) XII పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన, ఉన్నత విద్యను అభ్యసిస్తున్న అభ్యర్థులందరూ LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు.

ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు

అర్హత కలిగిన బాలికలకు LIC ప్రతి డివిజన్ కేంద్రానికి మొత్తం 10 ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. అర్హులైన బాలికలకు సంవత్సరానికి రూ.10,000 అందజేస్తారు. 2020-21 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో (లేదా తత్సమానమైన గ్రేడ్) పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, రెండేళ్లపాటు 10+2 పద్ధతిలో ఉన్నత చదువులు చదువుతున్న బాలికలు పొందేందుకు అర్హులు.

LIC స్కాలర్‌షిప్ కోసం ఇతర అర్హత ప్రమాణాలు

వారి చివరి పరీక్షలో 60% మార్కులకు తగ్గకుండా సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు/సంరక్షకుల వార్షిక ఆదాయం రూ.1,00,000 లోపు ఉండాలి. అభ్యర్థులు వారి మార్కులు, కుటుంబ ఆదాయం ఆధారంగా ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న అర్హతగల విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. అభ్యర్థులు కోర్సు చివరి పరీక్షలో వరుసగా ఆర్ట్స్/సైన్స్/కామర్స్ లేదా తత్సమాన గ్రేడ్‌లో ప్రొఫెషనల్ స్ట్రీమ్స్, గ్రాడ్యుయేషన్ కోర్సులలో 55% కంటే ఎక్కువ మార్కులు సాధించాలి.

LIC స్కాలర్‌షిప్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు LIC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

LIC స్కాలర్‌షిప్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 31, 2021

Gemini Internet

Click here for official link  https://licindia.in/Home