AP Government Jobs: 341 స్పెషలిస్టు డాక్టర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ | ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి ఆగస్టు 26 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ ఏడాది జూలై 1 నాటికి గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు మినహాయింపు ఉంటుంది. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు సమయంలో రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్–సర్వీస్‌మెన్‌లు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఎంపిక విధానం, జీతభత్యాలు, ఇతర వివరాలు https://hmfw.ap.gov.in లో అందుబాటులో ఉంచారు. ఈ ఖాళీలు తాత్కాలికమైనవని, అవసరాలకు అనుగుణంగా ఖాళీల సంఖ్య తగ్గడం, పెరగడం ఉంటుందని ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. స్పెషాలిటీల వారీగా ఖాళీలు ఇలా.. గైనకాలజీ : 60 అనస్థీషియా : 51 పీడియాట్రిక్స్ : 51 జనరల్ మెడిసిన్ : 75 జనరల్ సర్జరీ : 57 రేడియాలజీ : 27 పాథాలజీ : 8 ఈఎన్‌టీ : ...