శ్రీవారి భక్తులకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం త్వరలో కల్యాణమస్తు పునఃప్రారంభం టిటిడి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల ధర్మకర్తల మండలి సమావేశం నిర్ణయాలు వెల్లడించిన ఛైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువమంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించడం కోసం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని పది రోజుల పాటు తెరచి ఉంచాలని నిర్ణయించినట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ప్రకటించారు. పేద ప్రజలకు వివాహాలు ఆర్థికభారాన్ని మిగల్చకుండా ఉండేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులతో గతంలో అమలుచేసిన కల్యాణమస్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తామని చెప్పారు. టిటిడికి దేశవ్యాప్తంగా భక్తులు కానుకగా అందించిన ఆస్తులకు సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శనివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. సమావేశంలో తీసు...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు