APPSC Group 1 Prelims Question Paper With Final Key 2023 : గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ 'కీ' తొలగించిన ప్రశ్నల గురించి వివరాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలతో పాటు.. ఫైనల్ 'కీ' ని కూడా విడుదల చేసింది. జనవరి 8వ తేదీన 111 పోస్టులకు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెల్సిందే. ప్రిలిమ్స్ పరీక్షలకు 87,718 మంది (82.38 శాతం) హాజరు కాగా, 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది ఏపీపీఎస్సీ. దాంతో గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో 6,455 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షలో పేపర్-1లో ఒక ప్రశ్నను, పేపర్-2లో ఇంకో ప్రశ్నను ఏపీపీఎస్సీ తొలగించింది. దీంతో ఎలాంటి భేదాభిప్రాయాలకు తావివ్వకుండా తప్పుగా ఉన్న రెండు ప్రశ్నలను ఏపీపీఎస్సీ తొలగించేసింది. తొలగించిన ప్రశ్నలు ఇవే.. I= పేపర్-1లో.... ఈ క్రింది వానిలో ఎంజీఎన్ఆర్ఆస్ఈజీఎస్ లక్షణము కానిది ఏది.? I= పేపర్-2లో.... 2009 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఏ సంవత్సరానికి ఒకే విధంగా ఉంటుంది.? APPSC Group 1 Prelims Paper-1&2 Question Paper With Final Key 2022 PDF: ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Ge...