ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు | ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు | Progress Cards for Inter Students | Steps to fill up AP NIT jobs
ఇంటర్ విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ఎయి డెడ్ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు కేంద్రీకృత ప్రోగ్రెస్ కార్డుల విధానాన్ని అమలు చేయాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణ యించింది. ఇప్పటివరకూ జిల్లా స్థాయిల్లో ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. చాలా జిల్లాల్లో ఇది అమలు కావట్లేదు. ఇకపై ప్రోగ్రెస్ కార్డుల జారీని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర స్థాయిలో కేంద్రీకృత విధానాన్ని అమలుచేయాలని ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్ కృతికా శుక్లా శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీఫైనల్ పరీక్షలు ముగిసిన వెంటనే కార్డులు ఇవ్వాలని, తల్లిదండ్రుల సమావేశా ల్లోనూ వాటిని ప్రస్తావించాలని స్పష్టంచేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డులు వేర్వేరు రంగుల్లో కార్డులు ఉండాలన్నారు. విద్యార్థులందరినీ కాలేజీలకు రప్పించ డమే తమ లక్ష్యమని అధికార వర్గాలు తెలిపాయి. ఏపీ నిట్ లో ఉద్యోగాల భర్తీకి చర్యలు తాడేపల్లిగూడెం అర్బన్, సెప్టెంబరు 27: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఏపీ నిట్లో అధ్యాపక పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 127 ప...