SSC CHSL 2023: ఎస్ఎస్సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2023 | ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే మీకో సువర్ణావకాశం! స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో 'కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023 (సీహెచ్ఎస్ఎల్) ప్రకటన వెలువడింది.
వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, రాజ్యాంగ సంస్థలు, ట్రైబ్యునళ్లు మొదలైనవాటిలో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) 2023 సంవత్సర ప్రకటన విడుదల చేసింది. 12వ తరగతి/ ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారెవరైనా జూన్ 8లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వివరాలు... *ఎస్ఎస్సీ - కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ - 2023 ఖాళీలు: 1,600 1. లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 2. డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) 3. డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ) అర్హత: ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం తప్పనిసరి. వయసు: 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 02-08-1996 నుంచి 01-08-2005 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10-15 ...