ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

ఫిబ్రవరి 26, 2023లోని పోస్ట్‌లను చూపుతోంది

మీ పోలింగ్ స్టేషన్ తెలుసుకోండి ఇలా ఉపాధ్యాయ మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను మీరు ఓటరుగా నమోదు చేసుకున్నట్లయితే మీ ఓటు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నదో తెలుసుకోవడానికి కింది లింకును క్లిక్ చేసి_👇👇

https://ceoaperolls.ap.gov.in/status_mlc_2023/search_ps.aspx 1️⃣ మీరు గ్రాడ్యుయేట్  లేదా టీచర్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2️⃣ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసుకోండి 3️⃣ ఇదివరకే మీ దగ్గర అప్లికేషన్ ఐడి ఉన్నట్లయితే అప్లికేషన్ ఐడిని type చేయండి. మీ దగ్గర లేకపోయినట్లయితే...._ మీ పేరును అక్కడ టైప్ చేసి 4️⃣ Search పైన క్లిక్ చేయండి గమనిక: A - (గ్రాడ్యూయేట్ నియోజక వర్గం లు 3 ఉన్నాయి వాటిలో 1) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం; 2) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు; 3) కడప, అనంతపురం, కర్నూలు. B - (టీచర్ నియోజక వర్గం లు 2 ఉన్నాయి వాటిలో... 1) ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు; 2) కడప, అనంతపురం, కర్నూలు. C - ( మీ పేరుతో సెర్చ్ చేసేటప్పుడు మొదటగా మీ పూర్తి పేరు ఆ తర్వాత మీ ఇంటి పేరు టైప్ చేసి సెర్చ్ చేయండి. ఒకవేళ అలా కానిపక్షంలో మీ పేరు మాత్రమే టైప్ చేసి తర్వాత సెర్చ్ కొట్టిన మీ నాన్నగారి పేరు లేదా ఇంటి నెంబర్ ని సరిచూసుకోండి. అలాగా కాకపోయినా మీ పేరులో ఎక్కడైనా స్పేస్ ఉన్న యెడల స్పేస్ ఇచ్చి సెర్చ్ చేయండి. ఈ విధంగా పలు విధాలుగా ట్రై చేస్తే మీ పేరు ఉన్నదా లేదా అని తెలుసుకోవచ్చు) Search చేసిన ...

KCET 2023 Notification Details

Online Application Notification Information Bulletin Flow Chart Press Note CBSE Candidate Note   ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును...

9 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్ పరీక్షలు • 20 వరకు నిర్వహణ • 1-9 తరగతి విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్-4 పరీక్షలు • పరీక్షల షెడ్యూళ్లను ప్రకటించిన పాఠశాల విద్యా శాఖ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో ప్రీ ఫైనల్ పరీక్షలు ఈ నెల 9 నుంచి 20 వరకు నిర్వహించనున్నారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ - 2 కాంపోజిట్ పేపర్ మినహాయించి అన్ని పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ - 2 కాంపోజిట్ పేపర్ ఒక్కటే ఉదయం 9.30 గంటల నుంచి 11.15 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ బుధవారం షెడ్యూళ్లను ప్రకటించారు. అలాగే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్-4 పరీక్షలను కూడా ఇవే తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మూల్యాంకనాన్ని పూర్తి చేసి విద్యార్థులు సాధించిన మార్కులను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్లో నిర్ణీత గడువులోగా అప్లోడ్ చేయాలని ఆదేశించారు.    ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో ...

💥 Mandatory Aadhar UPDATE : Doubts Clarifications కొత్తగా వచ్చిన ఆధార్‌ అప్డేషన్‌ అంశంపై సందేహాలు - సమాధానాలు✒️

Q: ఆధార్ అప్డేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేనా లేక దేశంలో అందరికీ ఉందా?  A: సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి ఆధార్‌లో డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి. Q: కొత్తగా ఈ ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎందుకు?  A: 2010 నుంచి 2016 వరకు ఆధార్ ఇచ్చేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా ఆధార్‌ ఇవ్వబడింది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న బోగస్ ఆధార్ కార్డులను ఏరివేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఆధార్ ఉన్న పౌరుడు వారి పేరు & అడ్రస్‌ను సరైన ఆధారాలతో ధృవీకరించుకోవాలి. Q: డాక్యుమెంట్ అప్డేట్ ఎవరు చేసుకోవాలి?  A: 2010 నుంచి 2016 మధ్యలో ఆధార్ తీసుకుని 2016 తర్వాత ఆధార్‌లో పేరు గానీ అడ్రస్ గానీ మార్చుకోకపోతే వాళ్లు తప్పనిసరిగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలి.  Q: 2016 తర్వాత  నేను నా ఫోటో & డేట్ అఫ్ బర్త్‌ను మార్చుకున్నాను. ఇప్పుడు నేను మరలా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవాలినా?  A: 2016 తర్వాత పేరు అడ్రస్ మార్చుకోలేదు కాబట్టి మీరు డాక్యుమెంట్ అప్డేట్ చేయించుకోవాల్సిందే.  Q: డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోకపోతే ఏమవుతుంది?  A: డాక్యుమెంట్ ...

విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలకు అమ్మఒడి నుంచే ఫీజులు✍️📚 ♦️. అన్ని ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్ల కేటాయింపు ♦️. 60 రోజుల్లో ఫీజు చెల్లించకపోతే ప్రభుత్వమే మినహాయించి చెల్లిస్తుంది ♦️. ఉత్తర్వులు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ

🌻ఈనాడు, అమరావతి: ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో 25% కోటాలో సీట్లు పొందే విద్యార్థుల తల్లిదండ్రులు అమ్మఒడి పథకం సాయం నుంచే ఫీజులు చెల్లించుకోవాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. విద్యాహక్కు చట్టం కింద రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25% ప్రవేశాలకు నోటిఫికేషన్‌ ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదివారం విడుదల చేశారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారికి, దివ్యాంగులకు రిజర్వేషన్ల వారీగా ఉచితంగా కేటాయించాలి. విద్యాసంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి. కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టాన్ని ఇలాగే అమలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన, బలహీనవర్గాలకు వందశాతం అమ్మఒడి పథకం కింద సాయం అందిస్తున్నందున ఇందులోంచే ఫీజులు చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం అమ్మఒడి కింద రూ.15వేలలో పాఠశాల,...

EWS Age exemption ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

సీఎం వైఎస్ జగన్కు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకరరెడ్డి కృతజ్ఞతలు సాక్షి, అమరావతి/ కృష్ణలంక(విజయవా డతూర్పు): రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఐదేళ్లు పొడిగించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు వయో పరిమితిని ఐదేళ్లు సడలించడం హర్షణీయమని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ ఎక్కడా వయోపరిమితి సడలించలేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇక నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిని 34 నుంచి 39 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో వేలాది మంది నిరుద్యోగ ఓసీ అభ్యర్థులు లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య కార్పొరే షన్లను ఈడబ్ల్యూఎస్ శాఖ పరిధిలోకి తీసుకు రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వే...

*సీపీటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్‌-2, 3 నియామకాలకు అర్హత✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2, 3 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(సీపీటీ) ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే సీపీటీ లేదంటే ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు, యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారని.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 30, బీసీలకు 35, ఓసీలకు 40 చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. పార్ట్‌-ఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం, సాఫ్ట్‌వేర్‌ రకాలు, ఆపరేటింగ్‌ విధానాలు, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వరల్డ్‌వైడ్‌ వెబ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు.. పార్ట్‌ -బీలో ఆఫీస్‌ సూట్‌, ఆఫీస్‌ అప్లికేషన్లు, ఎంఎస్‌ వర్డ్‌, స్ప్రెడ్‌ షీట్‌, ప్రజంటేషన్‌ తదితర అంశాలకు సంబంధించి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 ద్వారా నేరుగ...

*దివ్యాంగ విద్యార్థులకు**భత్యం విడుదల✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద రూ.5.29 కోట్లు విడుదల చేసి నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) సురేశ్కు మార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంటి వద్ద చదువుకుంటున్న 1-8 తరగతులకు చెందిన 5,559 మంది విద్యార్థులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నారు. పాఠశాల లకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దే బోధన చేస్తున్నారని, 1-10 తరగతులు చదు వుతున్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని ఎస్పీడీ వెల్లడిం చారు. ప్రాథమిక స్థాయిలో 9,886 మంది, మాధ్యమిక స్థాయిలో 2,220 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగ బాలికలకు రూ. 2వేల చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నామని తెలిపారు.

*8 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్*

🌻ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వుల మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి 16 వరకూ 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా పాఠ శాల విద్యాశాఖాధికారి ఎన్వీ రవిసాగర్ ఓ ప్రకట నలో తెలిపారు. 4వ ఫార్మేటివ్ పరీక్షలకు బదులుగా వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.