3, ఆగస్టు 2024, శనివారం

NEET UG State Rank: ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల

NEET UG State Rank: ఏపీ, తెలంగాణ నీట్‌ యూజీ రాష్ట్ర ర్యాంకులు విడుదల

  • తాజా కటాఫ్‌ మార్కులివే..
  • ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఏపీ, తెలంగాణ నీట్‌-యూజీ 2024 రాష్ట్ర ర్యాంకులు విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో ర్యాంకులను ఇటీవల కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా దిల్లీ నుంచి అందే సమాచారాన్ని అనుసరించి డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర స్థాయి ర్యాంకుల జాబితా ప్రకటించింది. దీనికి అనుగుణంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ఆగస్టు 14 నుంచి ఎంబీబీఎస్‌లో అకడమిక్‌సెషన్‌ ప్రారంభమవుతుందని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ఆగస్టు తొలి వారం నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని కూడా తెలిపింది. ఈ సంస్థ  ప్రకటించిన తేదీల్లోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌన్సెలింగ్‌ను నిర్వహించాలి.

1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ
దేశవ్యాప్తంగా మొత్తం 710 వైద్య కళాశాలల్లో సుమారు 1.10 లక్షల ఎంబీబీఎస్‌ సీట్ల ప్రవేశాల కోసం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. వీటితోపాటు 21,000 బీడీఎస్‌ సీట్లతోపాటు ఆయుష్‌, నర్సింగ్‌ సీట్లను కూడా భర్తీ చేయనున్నారు. ఆలిండియా కోటా 15 శాతం సీట్లతోపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎయిమ్స్, జిప్‌మర్‌లోని ఎంబీబీఎస్‌ సీట్ల భర్తీ ప్రక్రియ చేపడతారు.
* ఏపీలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 161-127, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ (పీడబ్ల్యూబీడీ) విభాగాల్లో 143-127 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 43,788 మంది ర్యాంకులను ప్రకటించామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. 
* తెలంగాణలో మొత్తం 720 మార్కులకు అన్‌ రిజర్వుడు/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 162, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లో 127, ఓసీ- పీడబ్ల్యూబీడీ విభాగాల్లో 144 మార్కులను కటాఫ్‌గా ప్రకటించారు. మొత్తం 49,143 మంది ర్యాంకులను ప్రకటించామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు పేర్కొన్నారు. 

ఆలిండియా కోటా సీట్ల భర్తీకి మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
రిజిస్ట్రేషన్‌ తేదీలు: ఆగస్టు 14 నుంచి 20 వరకు. 
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: ఆగస్టు 21, 22. 
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: ఆగస్టు 23. 
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: ఆగస్టు 24 నుంచి 29వ వరకు.

రెండో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబరు 5 నుంచి 10వ తేదీ వరకు.
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: సెప్టెంబరు 11, 12.
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: సెప్టెంబర్ 13.
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: సెప్టెంబర్‌ 14 నుంచి 20 వరకు. 

మూడో రౌండ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌: 
రిజిస్ట్రేషన్‌ తేదీలు: సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 2 వరకు. 
సీట్ల కేటాయింపు ప్రక్రియ తేదీలు: అక్టోబరు 3 నుంచి 4 వరకు.
సీట్ల కేటాయింపు ఫలితాల వెల్లడి: అక్టోబరు 5.
సీట్లు పొందిన వారు కాలేజీల్లో చేరాల్సిన తేదీలు: అక్టోబర్‌ 6 నుంచి 12 వరకు.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల

AP RGUKT Result: ఏపీ ట్రిపుల్‌ఐటీ ఫేజ్-2 ఎంపిక జాబితా విడుదల 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లలో ప్రవేశానికి సంబంధించి రెండో దఫా(ఫేజ్-2) అర్హులైన అభ్యర్థుల జాబితా శనివారం (ఆగస్టు 3న) విడుదలైంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి 4,400 సీట్లు ఉండగా.. మొదటి దఫాలో 38,355 మంది దరఖాస్తు చేశారు. నాలుగు క్యాంపస్‌లలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. క్యాంపస్‌ల మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఫేజ్- 2 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు కాల్ లెటర్‌ను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

ఫలితాలు కోసం క్లిక్‌ చేయండి

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల యందు 2024-2025 విద్యా సంవత్సరమును కు గాను ఈ క్రింద కనపరచిన పారా మెడికల్ కోర్స్ లకు గాను అర్హత గల అభ్యర్థులు 18-07-2024 నుండి 06-08-2024 లోపు ధరఖాస్తు కు ఆహ్వానం

అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల యందు 2024-2025 విద్యా సంవత్సర ను కు గాను క్రింద కనపరచిన పారా మెడికల్ కోర్స్ లకు గాను అర్హత గల అభ్యర్థులు 18-07-2024 నుండి 06-08-2024 లోపు ధరఖాస్తు చేసుకోవలెను. ధరఖాస్తులు www.apsahpc.co.in, http://dme.ap.nic.in, www.appmb.co.in వెబ్ సైట్ నుండి పొందవచ్చును.

దరఖాస్తులు ప్రిన్సిపాల్ ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం వారికి చేరు చివరి తేది 06.08.2024.

వరుస సంఖ్య

కోర్సు పేరు

ఖాళీలు

అర్హతలు

Eligible for Admission

1

DMLT

10

Intermediate

As per GO Ms No.65, HMFW(J2) Dept, dt 15/05/2013 candidates. Passed intermediate with Bi.PC Group are eligible (If Candidates with Bi.PC Group are not available. candidates with MPC group and Thereafter other groups may be given preference

2

DOA

10

Intermediate

3

DANS

30

Intermediate

4

DMIT

10

Intermediate

5

DECG

3

Intermediate

6

DRGA

3

Intermediate

7

DDRA