Scholarship Guide: మెడికల్ స్టడీస్‌కి టాప్ 5 స్కాలర్‌షిప్స్.. తక్కువ నీట్ స్కోర్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు! అంతకంతకూ పెరుగుతున్న విద్యా ఖర్చులు చాలా మందికి చదువు దూరం చేస్తున్నాయి. కోరుకున్న కళాశాలల్లో నచ్చిన కోర్సులు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇలాంటి సమస్య విదేశాల్లో మెడిసిన్ చేయాలనుకునే వారికి ఎదురవుతోంది. నిధుల కొరత సహా అనేక సవాళ్ల కారణంగా కోరుకున్న చదువు పొందలేకపోతున్న వారికి ఓ అవకాశం ఉంది. అవే ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలు అందించే స్కాలర్‌షిప్‌లు. ఇవి 100% ట్యూషన్ ఫీజును కవర్ చేస్తాయి.
నేషనల్ ఎడ్యుకేషన్ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో తక్కువ స్కోర్ సాధించిన వారి కోసం ‘న్యూస్18’ అందిస్తున్న టాప్ ఫైవ్ గ్రాంట్స్ గురించి తెలుసుకుందాం. విదేశాల్లో చాలా కళాశాలలకు నీట్ స్కోర్ అవసరం లేదు. కానీ నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) నిబంధనలలో మార్పు కారణంగా ఇప్పుడు విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా నీట్ క్లియర్ చేయడం తప్పనిసరి. * ఆల్ ఇండియా యూత్ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(AIYSEE) AIYSEE అనేది జాతీయ స్థాయి మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌ను ఇంజనీరింగ్, మెడికల్ స్టడీస్ అభ్యసించే విద్యార్థుల కోసం నిర్వహిస్తారు. సాధారణంగా ఏప్రిల్, మేలో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ప్రతిభ చూపిన వారికి స్కాలర్‌షిప్ అందిస్తారు. AIYSEE స్కాలర్‌షిప్‌లు పరీక్షకు హాజరయ్యే మొత్తం విద్యార్థులలో కేవలం 10% మందికి ఇస్తారు. విద్యార్థి ఎన్‌రోల్ చేసుకునే ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాల ఆధారంగా స్కాలర్‌షిప్ ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. AIYSEE స్కాలర్‌షిప్‌లు అన్ని ఆర్థిక నేపథ్యాలకు చెందిన వారికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ కళాశాలల్లోని విద్యార్థులకు, స్కాలర్‌షిప్ వారి ట్యూషన్ ఫీ...