Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

24, జులై 2022, ఆదివారం

*IT రిటర్న్ లో--పొందగలిగే మినహాయింపులు*


1. సెక్షన్ 24 : కొత్త ఇల్లు కొనుగోలుకు తీసుకున్న గృహ రుణాలపై చెల్లించిన వడ్డీ క్లెయిమ్ చేయొచ్చు.

2. సెక్షన్ 80D : బీమాలేని సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులకు మీరు మెడికల్ బిల్లులు చెల్లిస్తే రూ. 50,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

3. సెక్షన్ 80D : ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్.. పర్సనల్, లైఫ్ పార్ట్‌నర్, డిపెండెంట్ చిల్డ్రన్ కోసం రూ. 5,000 వరకు క్లెయిమ్ చేయొచ్చు.

4. సెక్షన్ 80GG : యజమాని నుంచి హెచ్‌ఆర్‌ఏ పొందకుంటే మీ అద్దెకు రూ. 60,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

5. సెక్షన్ 80DDB : నిర్దేశిత వ్యాధులతో బాధపడుతున్న డిపెండెంట్స్ చికిత్స కోసం రూ. 40,000 తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

6. సెక్షన్ 80U/80DD : వికలాంగ పన్ను చెల్లింపుదారులు U/s 80U, డిజేబుల్డ్ డిపెండెంట్స్ u/s 80DD ద్వారా రూ. 75,000 నుంచి రూ. 1,25,000 వరకు తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

7. సెక్షన్ 80C/CCD : నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ. 1,50,000 u/s 80 C , రూ. 50,000 u/s 80CCD తగ్గింపును క్లెయిమ్ చేయొచ్చు.

8. సెక్షన్ 80C/ 24 : మీరు ఉమ్మడి గృహ రుణగ్రహీత అయితే హోమ్ లోన్ పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇందుకోసం ఒక్కొక్కరు ప్రిన్సిపల్ రీపేమెంట్ కోసం రూ. 1,50,000 u/s 80C,

వడ్డీ రీపేమెంట్ కోసం రూ. 2,00,000 u/s 24 క్లెయిమ్ చేయొచ్చు.
80EE క్రింద మరొక 50000 అదనంగా మినహాయింపు పొందవచ్చు.

9. హిందూ అవిభాజ్య కుటుంబం (HUF).. ఒక ప్రత్యేక సంస్థ అయినందున వివిధ విభాగాల కింద మినహాయింపులను క్లెయిమ్ చేయొచ్చు.

10. సెక్షన్ 80G : రిజిస్టర్డ్ ధార్మిక సంస్థలు లేదా ఎన్‌జీవోలకు చేసిన విరాళాల కోసం తగ్గింపులను క్లెయిమ్ చేయొచ్చు.

11. మీ మూలధన నష్టాలను మర్చిపోవద్దు. మూలధన లాభాలపై పన్నులు చెల్లిస్తున్నప్పుడు.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలికంగా, మీరు మీ నష్టాలను లాభాలకు వ్యతిరేకంగా సెట్ చేయొచ్చు.

ఈ సంవత్సరం మీ పన్నును ఆదా చేయడానికి లేదా వచ్చే ఏడాది పన్ను ఆదా కోసం ప్లాన్ చేసేందుకు ఈ తగ్గింపులను ఉపయోగించవచ్చు.

Gemini Internet

Local Jobs కోసం ఇక్కడ క్లిక్ చేయండి | మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి



 

Gemini Internet

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...