*🌻ఈనాడు, అమరావతి:* రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. 10 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. మొబైల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, పర్సు, నోట్సు, ఛార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివేవీ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. వాటిని పరీక్ష కేంద్రాల వద్దకు తీసుకురావొద్దని, భద్రపరచటానికి ఎలాంటి ఏర్పాట్లూ ఉండవని పోలీసు నియామక మండలి తెలిపింది. ‘‘అభ్యర్థులు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలి. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు, రేషన్‌కార్డు వంటి ఒరిజినల్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకొని రావాలి. పరీక్ష హాల్ టికెట్, బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి’’ అని పోలీసు నియామక మండలి అభ్యర్థులకు సూచించింది. మీ స్నేహితులకు లింక్‌ను షేర్ చేసి వారే స్వయంగా చేరేలా ...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు