Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

5, నవంబర్ 2023, ఆదివారం

Private Jobs for Freshers | Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు | MOODY'S: మూడీస్‌ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ పోస్టులు | Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు | Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు | Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్‌ పోస్టులు | Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

సంస్థ పేరు

అప్లై చేయడానికి చివరి తేది

Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు 

17-11-2023

MOODY'S: మూడీస్కంపెనీలో ఫుల్ఫిల్మెంట్అనలిస్ట్పోస్టులు 

18-11-2023

Genpact: జెన్పాక్ట్లో టెక్నికల్అసోసియేట్పోస్టులు 

17-11-2023

Ingersoll: ఇంగర్సోల్లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు 

15-11-2023

Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్పోస్టులు  

15-11-2023

Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 

13-11-2023


Siemens: సిమెన్స్ కంపెనీలో గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టులు 

​​​​​సిమెన్స్ టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌- గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

ఖాళీల వివరాలు:

గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజినీర్

అర్హత: డిప్లొమా/ డిగ్రీతో పాటు 0-1 ఏళ్ల ఫైర్ లైఫ్ సేఫ్టీ సిస్టమ్స్ పని అనుభవం ఉండాలి. ఆటోకాడ్/ బ్లూబీమ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానం, ఆంగ్ల భాషలో నిష్ణాతులై ఉండాలి.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Official Website

Synchrony: సింక్రోనీ కంపెనీలో రెప్రెజెంటేటివ్‌ పోస్టులు  

సింక్రోనీ కంపెనీ... రెప్రెజెంటేటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

పోస్ట్ వివరాలు:

రెప్రెజెంటేటివ్‌ - అప్రెంటిస్‌షిప్‌ ప్రోగ్రామ్‌

అర్హత: ఏదైనా డిగ్రీ, 0-9 నెలల పని అనుభవం ఉండాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, కస్టమర్ సెంట్రిక్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

Official Website

Ingersoll: ఇంగర్‌సోల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టులు 

ఇంగర్‌సోల్ ర్యాండ్ కంపెనీ- గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ట్రైనీ

అర్హత: మెకాట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీటెక్.  మైక్రోసాఫ్ట్ ఆఫీస్ టూల్స్ పరిజ్ఞానం. స్పోకెన్‌ ఇంగ్లిష్‌, కమ్యూనికేషన్ స్కిల్స్‌ కలిగి ఉండాలి.

అనుభవం: ఫ్రెషర్స్‌.

జాబ్‌ లోకేషన్‌: బహదూర్‌ఘర్, హరియాణా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా చేసుకోవాలి.

Official Website

Genpact: జెన్‌పాక్ట్‌లో టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టులు 

జెన్‌పాక్ట్‌ కంపెనీ.. టెక్నికల్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీల వివరాలు:

టెక్నికల్‌ అసోసియేట్‌  

అర్హత: బ్యాచిలర్స్/ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ నాలెడ్జ్ కలిగి ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: హైదరాబాదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Official Website

MOODY'S: మూడీస్‌ కంపెనీలో ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ పోస్టులు 

మూడీస్‌ కంపెనీ.. ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.

పోస్టు వివరాలు:

ఫుల్‌ఫిల్‌మెంట్‌ అనలిస్ట్‌ 

అర్హత: ఇంగ్లిష్‌ ప్రావీణ్యం. అదనపు భాష వచ్చి ఉంటే ప్రయోజనం. సంబంధిత రంగంలో లేదా కస్టమర్ సర్వీస్ ఫీల్డ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం అవసరం. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి.

జాబ్‌ లొకేషన్‌: గురుగ్రామ్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

Official Website

Mouser: మౌసర్ ఎలక్ట్రానిక్స్‌లో ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ పోస్టులు 

మౌసర్ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ.. ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్ట్ వివరాలు:

ఆపరేషన్స్ సపోర్ట్ రిప్రజెంటేటివ్-I

అర్హత: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ. ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీపై పరిజ్ఞానం, పని అనుభవం, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు ఉండాలి. 

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

Official Website


- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

BSc Nursing: 5 నుంచి బీఎస్సీ నర్సింగ్‌ ఐచ్ఛికాల నమోదు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

BSc Nursing: 5 నుంచి బీఎస్సీ నర్సింగ్‌ ఐచ్ఛికాల నమోదు  

విజయవాడ (ఆరోగ్య విశ్వవిద్యాలయం), న్యూస్‌టుడే: ఏపీలో నర్సింగ్‌ కళాశాలల్లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు రెండో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి ఐచ్ఛికాల ఎంపికకు వైఎస్‌ఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన జారీ చేసింది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ కాని 987 సీట్లు, సీటు కేటాయించినా నిండని 2,578 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన 14 నర్సింగ్‌ కళాశాలల్లోని 390 సీట్లు కలిపి మొత్తం 3955 సీట్లకు రెండో విడత వెబ్‌ ఆధారిత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. రెండేళ్ల పోస్టు బేసిక్‌ బీఎస్సీ నర్సింగ్‌ కోర్సుకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్‌లో.. ఇప్పటి వరకు భర్తీ కాని 220 సీట్లు, సీటు కేటాయించినా నిండని 184 సీట్లు, కొత్తగా అనుమతులు వచ్చిన మూడు కళాశాలల్లో 84 సీట్లు కలిపి, మొత్తం 488 సీట్లు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 5వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 10 గంటల్లోగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ద్వితీయ సంవత్సరం ఎంబీబీఎస్‌ ఫలితాలను ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం (నవంబర్‌ 5) విడుదల చేసింది.



-| For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Local Recognition: స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు * 10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం * అదనంగా మరో రెండు జోన్ల ఏర్పాటు * రెండు మల్టీజోన్లు కూడా... * రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |-

Local Recognition: స్థానికత గుర్తింపునకు విద్యార్హత తగ్గింపు

* 10 బదులు 7వ తరగతిగా మార్చేందుకు మంత్రిమండలి ఆమోదం
* అదనంగా మరో రెండు జోన్ల ఏర్పాటు
* రెండు మల్టీజోన్లు కూడా...
* రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఉత్తర్వులు

 

విద్యార్థుల స్థానికత (లోకల్‌) గుర్తింపునకు విద్యార్హత స్థాయిని పది నుంచి ఏడో తరగతికి తగ్గిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆరు నుంచి పదో తరగతి వరకు ఎక్కడ ఎక్కువ తరగతులు చదివారన్న దానిపై దీన్ని నిర్ధారిస్తున్నారు. ఆ ప్రకారమే ఉద్యోగ నియామకాలు, ఉన్నత విద్యలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడటం, ఉన్నత విద్య కోసం బయట ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం వల్ల స్థానికులే అయినప్పటికీ చాలామంది స్థానికేతరులుగా గుర్తింపు పొందాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు పది నుంచి ఏడో తరగతి వరకు విద్యార్హత స్థాయిని తగ్గించడం వల్ల ఎక్కువ మంది స్థానికుల కోటా పరిధిలోకి చేరుతారు. ఆ ప్రకారం వారికి ఉద్యోగ, ఉన్నత విద్య ప్రవేశాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం జోన్‌-1 కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలున్నాయి. జోన్‌-2లో ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్‌-3 కింద గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, జోన్‌-4 కింద చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్నాయి. రెండు జోన్లను అదనంగా పెంచడం వల్ల కొత్త జిల్లాలు జోనల్‌ వ్యవస్థలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు ఉన్నాయి. ఒక జోన్‌ కింద ఉమ్మడి ఆరు జిల్లాలు, మరో జోన్‌ కింద ఉమ్మడి ఏడు జిల్లాలు ఉన్నాయి. వీటికి అదనంగా మరో రెండు మల్టీ జోన్లు రానున్నాయి. దీనివల్ల ప్రాంతీయ కార్యాలయాలు అదనంగా వస్తాయి. స్థానికతకు సంబంధించిన విద్యార్హతల తగ్గింపు, జోన్ల పెంపుపై మంత్రిమండలి నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది. రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీఓనుబట్టి చర్యలు తీసుకుంటున్నందున ప్రతిపాదిత కొత్తమార్పులకు అక్కడే ఆమోదం లభించాలి. ఇది లాంఛనప్రాయమే. తెలంగాణలోనూ ఇలాగే జరిగింది. అలాగే ఏపీ మంత్రివర్గం ప్రభుత్వ సర్వీసులకు లోకల్‌ కేడర్స్‌ అండ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రాఫ్ట్‌ ఆర్డర్‌-2023కూ ఆమోదించింది. డిస్ట్రిక్ట్‌ కేడర్‌గా టీచర్లు, జూనియర్‌ అసిస్టెంట్లు, వారి సమానస్థాయి ఉద్యోగులు ఉంటారు. జోనల్‌ కేడర్‌గా జూనియర్‌ అసిస్టెంట్లు, ఆపైన ఉన్నవారు.. మల్టీజోన్‌ పరిధిలో సెకండ్‌ లెవల్‌ గెజిటెడ్‌ అధికారులు, డిప్యూటీ కలెక్టర్‌ స్థాయివారు, స్టేట్‌లెవల్‌ కేడర్‌ ఉద్యోగులంతా మల్టీ జోనల్‌ పరిధిలోకి (ఏపీ సెక్రటేరియట్‌, హెచ్‌వోడీలు, రాష్ట్రస్థాయి సంస్థలు, కేపిటల్‌ ఏరియాలో పోలీసు కమిషనరేట్‌ను మినహాయించి) వస్తారు. దీనివల్ల 95% పోస్టులు స్థానికులకు లభిస్తాయి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

● ఇంజినీరింగ్‌లో తొలి, తుది దశ స్పాట్‌ అడ్మిషన్లలో సీట్లు దక్కని విద్యార్థులకు మాత్రమే!

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

● తొలి, తుది దశ స్పాట్‌ అడ్మిషన్లలో

సీట్లు దక్కని విద్యార్థులకు మాత్రమే!

అమరావతి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇంజినీరింగ్‌లో ప్రత్యేక అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఏపీఈఏపీ సెట్‌ కన్వీనర్‌ నాగరాణి తెలిపారు. ఏపీఈఏపీ సెట్‌–2023లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇప్పటికే రెండు దశల్లో స్పాట్‌ అడ్మిషన్లు ముగిశాయని, ఇప్పుడు కేవలం ఈ సంవత్సరానికి మాత్రమే వర్తించేలా ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌ను చేపడుతున్నామని ఆమె వివరించారు. ఇప్పటికే ఆప్షన్లు నమోదు చేసుకుని, తొలి, తుది దశ స్పాట్‌ అడ్మిషన్లలో సీట్లు పొందలేని విద్యార్థులు మాత్రమే ఈ ప్రత్యేక కౌన్సెలింగ్‌కు అర్హులని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కొత్తగా రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల్లోని బీఈ/బీటెక్‌ కోర్సుల్లో ఖాళీలను అనుసరించి నిబంధనల మేరకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. శనివారం నోటిఫికేషన్‌ జారీ కాగా, 6, 7 తేదదీల్లో రెండు రోజులపాటు ఆప్షన్ల నమోదు, 8న ఆప్షన్ల మార్పుకు అవకాశం, 10వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. ఈనెల 11 నుంచి 13 లోపు అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇందులో ప్రవేశాలు పొందినవారు కూడా కన్వీనర్‌ కోటాతో సమానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సహా అన్ని రకాల ప్రభుత్వ పథకాలకూ అర్హులవుతారని నాగరాణి తెలిపారు.

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Central Jobs: నవంబర్‌ 24న వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ * పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం * ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

Central Jobs: నవంబర్‌ 24న వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌  

* పదో తరగతి అర్హతతో దరఖాస్తు అవకాశం
* ఫిబ్రవరి 20 నుంచి రాత పరీక్షలు

కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్‌సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్‌ ప్రకారం నవంబర్‌ 24న నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్‌ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్‌ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

గతేడాది 50,187 ఖాళీల భర్తీ

గతేడాది నవంబర్‌లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి. 

 ఎస్‌ఎస్‌సీ అధికారిక ప్రకటన వివరాలు


 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...