హైదరాబాద్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు వాక్ – ఇన్ -ఇంటర్వ్యూలు :
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలోని అభ్యర్థులకు శుభవార్త.
తెలంగాణ
రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్
రీసెర్చ్ మానేజ్మెంట్ (NAARM)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ – ఇన్ –
ఇంటర్వ్యూ లు నిర్వహించనున్నారు.
ఈ ఉద్యోగాలు
కాంట్రాక్టు బేస్ విధానంలో భర్తీ చేయబడుతాయి. ఇరు తెలుగు రాష్ట్రాల
అభ్యర్థులు ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ముఖ్యమైన తేదీలు :
వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | డిసెంబర్ 21,2020 మరియు డిసెంబర్ 22,2020 |
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | ఉదయం 9 గంటలకు |
ఉద్యోగాలు – వివరాలు :
ప్రాజెక్ట్ల వారీగా యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు – వివరాలు :
PME సెల్ | 2 |
ట్రైనింగ్ యూనిట్ | 1 |
డైరెక్టర్స్ సెల్ | 1 |
డెవలపింగ్ డిజిటల్ కంటెంట్ మోడల్స్ ఫర్ అగ్రి ఇన్ఫర్మేషన్ | 1 |
డెవలపింగ్ డిజిటల్ కంటెంట్ మాడ్యూల్స్ ఫర్ అగ్రి వేర్ హౌసింగ్ | 1 |
అర్హతలు :
ఈ
ఉద్యోగాల భర్తీలో భాగంగా వాక్ -ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే
అభ్యర్థులు ప్రాజెక్ట్ విభాగాలను అనుసరించి పోస్టు గ్రాడ్యుయేషన్ అగ్రి
సైన్సెస్ / గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ /గ్రాడ్యుయేషన్ డిగ్రీ మొదలైన
కోర్సులను పూర్తి చేయాలి.
వయస్సు :
ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థుల వయస్సు 21 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం:
ఈ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 25,600 రూపాయలు నుండి 60,000 రూపాయలు వరకూ జీతమును అందుకోనున్నారు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
ICAR-National Academy of agricultural Research Management,
Rajendranagar,
Hyderabad – 500030.
Telangana , India.
ఈ
వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు హాజరు కాబోయే అభ్యర్థులు వారి వారి లేటెస్ట్
పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు , విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ఒరిజినల్స్
మరియు ఒక సెట్ జీరాక్స్ కాపీ లను సెల్ఫ్ అటెస్ట్ చేసి తమ కూడా తీసుకు
వెళ్లవలెను.
ఫోన్ నంబర్లు :
అభ్యర్థులు ఈ వాక్ – ఇన్ – ఇంటర్వ్యూ లకు సంబంధించిన సందేహాల నివృత్తికి ఈ క్రింది ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చును.
040-24581913,
040-24581555/366/390.
Fax No: 24015912
Website
Notification