26, ఏప్రిల్ 2021, సోమవారం

ఏపీలో లైన్‌మెన్‌ కొలువులు.. దరఖాస్తుకు చివరి తేది 03.05.2021

 



విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీసీపీడీసీఎల్‌).. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
Jobs దీనిద్వారా గ్రామ/వార్డు సెక్రటేరియట్స్‌లో ఉన్న 86 ఎనర్జీ అసిస్టెంట్‌ (జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. రాత పరీక్ష, పోల్‌ క్లైబింగ్, మీటర్‌ రీడింగ్‌ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు మే 3వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అర్హతలు..
జూనియర్‌ లైన్‌మెన్‌ గ్రేడ్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. పదోతరగతితోపాటు ఎలక్ట్రికల్‌/వైర్‌మెన్‌ ట్రేడ్‌ల్లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ (ఎలక్ట్రికల్‌ డొమెస్టిక్‌ అప్లియెన్సెస్‌ అండ్‌ రివైండింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ కాంట్రాక్టింగ్‌/ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ అండ్‌ సర్వీసింగ్‌)లో ఉత్తీర్ణత సాధించాలి.
వయసు: 31.01.2021 నాటికి 18–35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్‌ టెస్ట్‌(పోల్‌/టవర్‌ క్లైబింగ్‌ టెస్ట్‌), మీటర్‌ రీడింగ్‌ టెస్టుల ద్వారా ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష..
పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతుంది. ఐటీఐలో సంబంధిత ట్రేడ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ పరీక్షల్లో జనరల్‌ అభ్యర్థులు కనీసం 40శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు కనీసం 35శాతం మార్కులు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.

పోల్‌ క్లైబింగ్‌..
పోల్‌ క్లైబింగ్‌ టెస్ట్‌లో భాగంగా.. 15 నిమిషాల వ్యవధిలో పోల్‌ ఎక్కి దిగాల్సి ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించి.. పోల్‌ క్లైబింగ్‌లో విఫలమైతే ఈ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తారు.

మీటర్‌ రీడింగ్‌..
రాత పరీక్షతోపాటు పోల్‌క్లైబింగ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో మీటర్‌ రీడింగ్‌ పరీక్షలకు పిలుస్తారు.

ఎంపిక తర్వాత..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15000 చొప్పున వేతనంగా అందిస్తారు. వీరు గ్రామ పంచాయతీ/వార్డులలో ఏర్పాటు చేసిన సెక్రటేరియట్స్‌/వార్డు సెక్రటేరియట్స్‌లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓసీ/బీసీ అభ్యర్థులు రూ.700, అలాగే ఎస్సీ/ఎస్టీ వారు రూ.350 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి: 03.05.2021
 
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.apcpdcl.in

22, ఏప్రిల్ 2021, గురువారం

ICAR Jobs Recruitment || రైస్ రీసెర్చ్ లో వివిధ ఉద్యోగాల భర్తీ

 

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునేందుకు చివరి తేదీ30-04-2021

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1)రీసెర్చ్ అసోసియేషట్1
2)జూనియర్ రీసెర్చ్ ఫెలో5
౩)టెక్నికల్ అసిస్టెంట్5

విభాగాల వారీగా మొత్తం ఖాళీల వివరాలు:

రీసెర్చ్ అసోసియేషట్(1),జూనియర్ రీసెర్చ్ ఫెలో(5),టెక్నికల్ అసిస్టెంట్(5) మొత్తం 11 ఉద్యోగాల భర్తీ కు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది

విభాగాల వారీగా అర్హతల వివరాలు:

1)రీసెర్చ్ అసోసియేట్:

అగ్రికల్చరల్ బయో టెక్నాలజీ/ప్లాంట్ బ్రీడింగ్ /జెనెటిక్స్/బయో టెక్నాలజీ లో పి.హెచ్.డి లేదా M.Sc. బయోటెక్నాలజీ / M.Sc లో 5 సంవత్సరాలు ఏదైనా లైఫ్ సైన్స్లో మొక్కల పెంపకం, మొక్కల పరమాణు జీవశాస్త్రం మరియు వరి వ్యవసాయ పంటల క్షేత్ర ప్రయోగాలు చేయడం పై  కనీస పరిశోధన అనుభవం కలిగి ఉండాలి. ఇలా మొదలగు అర్హతలు కావలెను.

2)జూనియర్ రీసెర్చ్ ఫెలో :

పి.జి. ప్రాథమిక శాస్త్రాలలో (బయోటెక్నాలజీ / లైఫ్ సైన్స్ / బయోకెమిస్ట్రీ / బోటనీ) మూడేళ్లతో అర్హతతో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి

లేదా

పి.జి. ప్రొఫెషనల్ సైన్సెస్ (M.Tech. Biotechnology / M.Sc. బయోటెక్నాలజీ) లో  3 సంవత్సరాలు ’
బ్యాచిలర్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల మాస్టర్ డిగ్రీ లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ తో పాటు 2 సంవత్సరాల మాస్టర్స్ డిగ్రీ కావలెను.

లేదా

అగ్రిల్ లో సబ్మిట్ చేసిన PH.D. సైన్సెస్ / బయోటెక్నాలజీ / బయోకెమిస్ట్రీ / నేచురల్ సైన్సెస్ / లైఫ్ సైన్స్ తో పాటు  బయోటెక్నాలజీలో అనుభవం కావలెను. మొదలగు క్వాలిఫికేషన్ లు కావలెను.

౩)టెక్నికల్ అసిస్టెంట్:

ఏదైనా లైఫ్ సైన్స్ / డిప్లొమాలో అగ్రికల్చరల్ డిగ్రీ

విభాగాల వారీగా జీతం వివరాలు:

రీసెర్చ్ అసోసియేషట్47000+24% HRA
జూనియర్ రీసెర్చ్ ఫెలో31000+24%  HRA
టెక్నికల్ అసిస్టెంట్20000

అప్లై చేసుకునే విధానం :

ఈ ఈమెయిల్ అడ్రెస్ కు వివరాలు పంపవలెను msmrecruitment2021@gmail.com

వయసు:

1)SRF / JRF & ప్రాజెక్ట్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ / ల్యాబ్ అసిస్టెంట్ కోసం: పురుషులకు 35 సంవత్సరాలు
మరియు మహిళలకు 40 సంవత్సరాలు ఉండవలెను

2)ఆర్‌ఏ కోసం: పురుషులకు 40 సంవత్సరాలు, మహిళలకు 45 సంవత్సరాలు

4)YP I & II కోసం: 21 సంవత్సరాలు మరియు గరిష్టంగా 45 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి

3)ఎస్సీ / ఎస్టీలకు 5 సంవత్సరాల వరకు, ఓబిసికి 3 సంవత్సరాలు, పిహెచ్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు
నిబంధనల ప్రకారం అందుబాటులో ఉంది

కాంట్రాక్టు వివరాలు:

1)రీసెర్చ్ అసోసియేషట్ — ప్రారంభంలో ఒక సంవత్సరం మరియు పొడిగించే అవకాశం ఉంది
2))జూనియర్ రీసెర్చ్ ఫెలో –ప్రారంభంలో ఒక సంవత్సరం మరియు పొడిగించే అవకాశం ఉంది

Website

Notification

Western Railway Jobs 2021 || రైల్వే లో ఉద్యోగాలు, పరీక్ష లేదు 75,000వరకూ జీతము

 

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా జగజీవన్ రామ్ వెస్ట్రన్ రైల్వే హాస్పిటల్ లో ఖాళీగా ఉన్న సుమారు 138 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ కాంట్రాక్టు రైల్వే ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Western Railway Jobs 2021

మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదిఏప్రిల్ 6 , 2021
ఇంటర్వ్యూల నిర్వహణ తేదిఏప్రిల్ 8, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

CMP – GDMO14
నర్సింగ్ సూపరింటెండెంట్59
రేడియో గ్రాఫర్2
రానల్ ప్లేస్ మెంట్ /హెమో డైలిసిస్ టెక్నీషియన్1
క్లినికల్ సైకాలజిస్ట్2
హాస్పిటల్ అటెండెంట్60

ఖాళీలు:

మొత్తం 138 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యూలేషన్, మరియు  సంబంధిత విభాగాలలో ఎంబీబీఎస్ /పీజీ డిగ్రీ /డిప్లొమా /మాస్టర్ డిగ్రీ /జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ సర్టిఫికెట్ మొదలైన విద్యా అర్హతలు కలిగి ఉండవలెను అని ప్రకటనలో పొందుపరిచారు.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో తెలిపారు.

మరింత ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 53 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సదలింపు కలదు.

రైల్వే లో రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులకు 65 సంవత్సరాలు వరకూ వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజును చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

టెలిఫోన్ / వాట్సాప్ ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,000 రూపాయలు నుండి 75,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.

ఈ జీతం తో పాటు అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.

Website Link 

Notification

21, ఏప్రిల్ 2021, బుధవారం

MIS AP Jobs మిలటరీ ఇంజనీరింగ్ సేర్వీసెస్- AP TS 502 డ్రాఫ్ట్స్‌మన్ సూపర్‌వైజర్ నియామకాలు

 

MIS AP Jobs మిలటరీ ఇంజనీరింగ్ సేర్వీసెస్

MIS Providing infrastructure to armed forces.

ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళం యొక్క అన్ని మౌలిక సదుపాయాల రూపకల్పన, నిర్మాణం మరియు నిర్వహణకు మిలిటరీ ఇంజనీరింగ్ సేవలు బాధ్యత వహిస్తాయి.

ఖాళీలు:  504 పోస్టులు

  • డ్రాఫ్ట్స్‌మన్- 52
  • సూపర్‌వైజర్- 450

ఏజ్ క్రైటీరియా: 18 – 30 సంవత్సరాలు

విద్యా అర్హత: 

  • 3 సంవత్సరాల డిప్లొమా(ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్)
  • ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో మాస్టర్ డిగ్రీ మరియు 1 సంవత్సరాల అనుభవం లేదా ఎకనామిక్స్ / కామర్స్ / స్టాటిస్టిక్స్ / బ్యూస్నెస్ స్టడీస్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తో డిప్లొమా ఇన్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ లేదా సమానమైన మరియు 2 సంవత్సరాల అనుభవం

జీతం:  Rs. 35,500 – 1,24,000/-

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 17.05.2021 

ఎంపిక ప్రక్రియ:  మెరిట్ OMR ఆధారిత రాత పరీక్ష

ఎలా దరఖాస్తు చేయాలి:

అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్  ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు–> – https://www.mes.gov.in Or https://www.mesgovonline.com

దరఖాస్తు రుసుము – 200/-

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండిClick Here

Classifieds 21-04-2021