అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
28, ఏప్రిల్ 2022, గురువారం
26, ఏప్రిల్ 2022, మంగళవారం
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ, గుంటూరు APRJC CET - 2022 | APRDC CET - 2022 ప్రవేశ పరీక్షా ప్రకటన
25, ఏప్రిల్ 2022, సోమవారం
7, మార్చి 2022, సోమవారం
NOS Scholarship 2022-23: ఈ కేంద్రప్రభుత్వ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు
MSJE National Overseas Scholarship 2022: భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సమాజిక, సాధికారత విభాగం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నేషనల్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ (National Overseas Scholarship)కు ఉన్నత విద్యనభ్యసించే అర్హులైన విద్యార్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 125
వయోపరిమితి: ఎప్రిల్ 1, 2022 నాటికి విద్యార్ధుల వయసు 35 ఏళ్లకు మించరాదు.
అర్హతలు: బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు, పీహెచ్‌డీ చేసే అభ్యర్ధులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, 2022-23 విద్యాసంవత్సరానికి దేశంలోని టాప్ 500 ఫారిన్ ఇన్‌స్టిట్యూషన్స్/యూనివర్సిటీల్లో పొందిన ప్రవేశాల ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
DRDO Scholarship 2022: ఏడాదికి రూ.1,86,600ల చొప్పున స్కాలర్‌షిప్ అందుకునే అవకాశం
DRDO scholarship 2022 last date: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) 2022-23 విద్యాసంవత్సరానికిగానూ స్కాలర్‌షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ స్కాలర్‌షిప్ సంబంధిత స్పెషలైజేషన్లో యూజీ, పీజీ చదివే గర్ల్ స్టూడెంట్స్ (Female Students)కు మాత్రమే అందించబడుతుంది. ఈ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 30
సబ్జెక్టులు: ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఎయిరో నాటికల్ ఇంజనీరింగ్, స్పేస్ ఇంజనీరింగ్ అండ్ రాకెట్రీ, ఏవియోనిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజనీరింగ్.
- యూజీ స్కాలర్‌షిప్‌లు-20
స్కాలర్‌షిప్: ఏడాదికి రూ. 1,20,000ల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజనీరింగ్) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ జేఈఈ మెయిన్ స్కోర్ కూడా ఉండాలి.
- పీజీ స్కాలర్‌షిప్‌లు-10
స్కాలర్‌షిప్ మొత్తం: ఏడాదికి రూ.1,86,600ల వరకు స్కాలర్‌షిప్ అందిస్తారు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ (ఇంజనీరింగ్) కోర్సుల్లో మొదటి సంత్సరం అడ్మిషన్ తీసుకున్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే వ్యాలిడ్ గేట్ స్కోర్ కూడా ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ మెయిన్/గేట్ స్కోర్ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
6, మార్చి 2022, ఆదివారం
KVS Admissions 2022: కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు కేంద్రీయ విద్యాలయాల్లో ఉచిత విద్య.. ఏ క్లాస్‌లోనైనా అడ్మిషన్ ఫ్రీ..!
KVs to offer free admission for these children: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన విద్యార్ధులకు పీఎమ్ కేర్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ (PM Cares for Children Scheme) కింద ఏ తరగతిలోనైనా ఉచితంగా సీటు ఇవ్వనున్నట్లు కేంద్రీయ విద్యాలయ సంగతన్ (free education in KVS) ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 1200 కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఏ తరగతిలోనైనా ఫ్రీగానే విద్య నందించడానికి ముందుకొచ్చింది. అంతేకాకుండా ఈ పథకం కింద ఇప్పటికే 4000 మంది విద్యార్థులకు చెందిన జాబితాను విద్యా మంత్రిత్వ శాఖ తయారు చేసి, ప్రాంతీయ అధికారులు, కేవీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు పంపింది కూడా. కాగా కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 విద్యాసంవత్సరానికిగానూ 1వ తరగతిలో ప్రవేశాలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 28న ప్రారంభించింది. ఇక 2 నుంచి 10వ తరగతికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఏప్రిల్ 8న ప్రారంభం అవుతాయి.10వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాలు ప్రకటించిన పది రోజుల్లో 11వ తరగతి రిజిస్ట్రేషన్‌లు ప్రారంభంకానున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది.
కోవిడ్ కారణంగా అనాథలైన పిల్లలను వారి వయస్సు ప్రకారం ఆయా క్లాసుల్లో చేర్చుకుంటామని తెల్పింది. అందుకనుగుణంగా అన్ని రకాల ఫీజుల నుంచి మినహాయించి, ఉచితంగా ప్రవేశాలు కల్పించడమేకాకుండా, ఫ్రీగా విద్యను అందించనున్నట్లు తాజా నోటిఫికేషన్ ద్వారా తెలియజేసింది. విద్యాలయ వికాస్ నిధి కేటగిరీ కింద, ఆయా జిల్లాల్లోని మెజిస్ట్రేట్ సిఫార్సుల మేరకు ఈ విధమైన విద్యార్ధులకు ప్రవేశం కల్పించనున్నట్లు తెల్పింది. గరిష్టంగా 10 మంది విద్యార్థులు.. అంటే ఒక్కో తరగతికి ఇద్దరేసి చొప్పున, డీఎమ్‌లు ఎంపిక చేసి అడ్మిషన్ ఇవ్వొచ్చు. ఈ టెహ్రాన్, మాస్కో, ఖాట్మండులోని అంతర్జాతీయ శాఖలతో సహా దేశంలోని మొత్తం 1200 పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. అడ్మిషన్లకు సంబంధించిన ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా సూచించింది.
Gemini Internet
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...