దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు): రూ.3000/-
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
- ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 27, 2023
అప్లికేషన్‌ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు): రూ.3000/-
ముఖ్యమైన తేదీలు:
* ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో తొమ్మిది, పదకొండో తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
ప్రొఫెసర్లు: 26 పోస్టులు
అర్హత: పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,44,200 - 2,18,200/-
అసోసియేట్ ప్రొఫెసర్లు: 34 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ.
పే స్కేల్: రూ.1,33,400 - 2,17,100/-
అసిస్టెంట్ ప్రొఫెసర్: 43 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్‌డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్ అండ్ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్.
పే స్కేల్: రూ.57,700 - 1,82,400/-
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుదారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి (లింక్ ద్వారా: https://recruitments.universities.ap.gov.in)
అభ్యర్థి పూరించిన దరఖాస్తు యొక్క ప్రింట్-అవుట్ తీసుకొని, అన్ని
స్వీయ-ధృవీకరణ పత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్
ద్వారా "ది రిజిస్ట్రార్, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప - 516005,
వైఎస్ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్"".
ముఖ్యమైన తేదీలు:
Tirumala : డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 9వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
ఆలయంలో నవంబరు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
* నవంబర్ 26న పరీక్ష
* జనవరి రెండో వారంలో ఫలితాలు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2023 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో నవంబర్ 26న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.
త్రివిధ
దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో
కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. సంపూర్ణ క్రమశిక్షణ,
వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన
ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ
నుంచే నేర్పిస్తారు. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33
సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి
ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ
పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం
నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్
టెస్టింగ్ జెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఎన్‌జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.
పరీక్ష వివరాలు...
* అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ)-2024
సీట్ల కేటాయింపు: ఆరో తరగతి(ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.
అర్హతలు:
* ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
* తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
పరీక్ష విధానం: పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
* ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.
* తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.
* తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
సీట్ల కేటాయింపు: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.
పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా 186 కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.
దరఖాస్తు విధానం: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏ