Alerts

Loading alerts...

10, నవంబర్ 2023, శుక్రవారం

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు 

దేశవ్యాప్తంగా 650 జవహర్‌ నవోదయ విద్యాలయా(జేఎన్‌వీ)ల్లో పదకొండో తరగతిలో ఖాళీల సీట్ల భర్తీ(లేటరల్‌ ఎంట్రీ)కి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జేఎన్‌వీ ఎంపిక పరీక్షకు దరఖాస్తులు కోరుతోంది. హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 11వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

వివరాలు...

* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష- 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పదో తరగతి చదువుతుండాలి. 

వయసు: 01.06.2007 నుంచి 31.07.2009 మధ్య జన్మించి ఉండాలి.

ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో అయిదు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, ఇంగ్లిష్‌, సైన్స్‌, సోషల్‌ సైన్సెస్‌, మ్యాథమెటిక్స్‌) ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు 2.30 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష పేపర్‌ ఇంగ్లిష్‌, హిందీ భాషలో ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-11-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 10-02-2024.


Important Links

Posted Date: 08-11-2023

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు:

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...