CAT 2023: క్యాట్-2023 అడ్మిట్ కార్డులు విడుదల
* నవంబర్ 26న పరీక్ష
* జనవరి రెండో వారంలో ఫలితాలు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2023 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ సాయంతో అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో నవంబర్ 26న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి