JNV Selection Test: నవోదయ దరఖాస్తు గడువు మరోసారి పెంపు
* ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్‌వీ)లో తొమ్మిది, పదకొండో తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి