ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులు Free training, employment opportunities Unemployed youth aged 18 to 35 years who have passed or failed 10th class, intermediate, engineering, degree are eligible for this training.
ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు అనంతపురం అగ్రికల్చర్ : నిహార్ స్కిల్స్, కడప ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు డీడీయూజీ కేవై కార్యక్రమం ద్వారా 4 నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అడ్మిషన్స్ కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగిన 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇంజినీరింగ్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన నిరుద్యోగ యువత ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ , జూనియర్ సాఫ్ట్‌వేర్ వెబ్ డెవలపర్ , బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కడపలోని నిహార్ స్కిల్స్ ఆధ్వర్యంలో ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కూడా అందజేస్తారు. శిక్షణ అనంతరం, కేంద్ర ప్రభుత్వ తరపున ఉచిత సర్టిఫికెట్‌తో పాటు వివిధ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అనంతపురం , సత్యసాయి , కర్నూలు , నంద్యాల , చిత్తూరు , అన్నయమ్య , తిరుపతి జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు ఈనెల 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉచిత కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9000487423 నంబర్కు సంప్రదించాలని తెలిపారు. Free Training and Employ...