2, జులై 2021, శుక్రవారం

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న‌కు చెందిన ఈఎస్‌సీ స్కాల‌ర్‌షిప్‌ | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

 




హెచ్‌డీఎఫ్‌సీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న‌కు సంబంధించిన ఈఎస్‌సీ స్కాల‌ర్‌షిప్ ప్ర‌తిభావంతులైన నిరుపేద విద్యార్థుల‌కు చేయూతనందించ‌డమే ముఖ్యోద్దేశంగా ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది.
Scholarships 
ఆర‌వ‌త‌ర‌గ‌తి నుంచి యూజీ, పీజీ కోర్సుల చ‌దివే విద్యార్థులంద‌రికి ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న‌కు చెందిన ఈఎస్‌సీ స్కాల‌ర్‌షిప్‌

అర్హ‌త‌:
  • ఆరు నుంచి ఇంట‌ర్మ‌డీయ‌ట్ వ‌ర‌కు ప్రైవేట్‌ లేదా ప్ర‌భుత్వ స్కూల్‌లో చ‌దివిన వారు.
  • గ్రాడ్యుయేష‌న్ విద్యార్థులు క‌నీసం 55% మార్క‌ల‌తో ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
  • పీజీ విద్యార్థులు క‌నీసం 55% మార్క‌ల‌తో బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌
  • వార్షిక ఆదాయం 2 ల‌క్ష‌లకు లేదా అంత‌కంటే త‌క్కువ ఉన్న‌వారు అర్హులు
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://v1.hdfcbank.com/htdocs/common/ecss_scholarship.htm

విదేశీ విద్యార్థుల కోసం .....ఆస్ట్రేలియ‌న్ పూర్వపు విద్యార్థుల అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్‌ | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 31, 2021



ఆస్ట్రేలియ‌న్ పూర్వపు విద్యార్థుల అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్‌ ప్రోగ్రాం ఆస్ట్రేలియాలో చ‌దువు పూర్తి చేసుకున్న‌వివిధ దేశాల విద్యార్థుల‌ను గుర్తించి, వారిని ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. అంతేకాదు త‌మ కోర్సు కాల‌ప‌రిమితిలోని ట్యూష‌న్ ఫీజు 20% త‌గ్గిస్తోంది. ఆస్ట్రేలియాలో చ‌దువు పూర్తి చేసుకున్న‌వివిధ దేశాల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది.
Scholarships  
ఆస్ట్రేలియ‌న్ పూర్వపు విద్యార్థుల అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్‌
అర్హ‌త‌:
  • ఇంగ్లిష్‌కోర్సు
  • యూనివర్సిటీ ఫౌండేష‌న్ కోర్సు
  • స‌ర్టిఫికేట్ కోర్సులు
  • డిప్లొమా లేదా అడ్వాన్స్‌డ్ డిప్లొమా, అసోసీయేట్ డిగ్రీ లేదా వోకేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్
  • యూజీ లేదా పీజీ కోర్సులు
  • ఆస్ట్రేలియాలో కోర్సుల‌ను జూన్ 01, 2020 నుంచి జూలై 31, 2021కి పూర్తి చేసి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం:
  • ఆస్ట్రేలియాలో కోర్సులు చ‌దివిన‌ప్పుడే ఈ స్కాల‌ర్‌షిప్‌కి ఆటోమెటిక్‌గా అర్హుల‌వుతారు.
  • కోర్సుల‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసుకున్న వెంట‌నే ఈ స్కాల‌ర్‌షిప్‌కి ద‌ర‌ఖాస్తు చేసుకునే వెసులుబాటును క‌ల్పిస్తోంది.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 31, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://www.ecu.edu.au/scholarships/details/2021-international-australian-alumni-scholarship

విదేశాల్లో చ‌దువుకోవాల‌నే భార‌తీయ యువ‌త కోసం ...లీప్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం | ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 30, 2021


విదేశాల్లో చ‌దవాల‌నే త‌మ క‌ల‌ను సాకారం చేసుకోవాల‌నుకునే భార‌తీయ యువ‌త‌ కోసం లీప్ స్కాల‌ర్ షిప్ ప్రోగ్రాం స్కాల‌ర్‌షిప్‌లు అందించి వారికి స‌రైన మార్గ‌నిర్దేశాలను అందిస్తొంది. విదేశాల్లో చ‌దువుకోవాల‌నుకునే భార‌తీయ విద్యార్థుల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే కాక త‌మ నైపుణ్యాల‌ను మ‌రింతగా పెంపొందించుకోవాడానికి కావ‌ల్సిన స‌హ‌యస‌హకారాల‌ను అందిస్తోంది.
Scholarships
  • లీప్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం

అర్హ‌త‌:
  • 60% మార్కుల‌తో గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.
  • ఫ్రెష‌ర్ లేదా ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌రఖాస్తుల‌కు చివ‌రితేది: జులై 30, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://leapscholar.com/scholarship  (or)
https://leapscholar.com/assets/documents/Leap%20Scholarship%20Guide.pdf

భార‌తీయ విద్యార్థుల కోసం గూగుల్ కాన్ఫ‌రెన్స్‌ స్కాల‌ర్‌షిప్‌లు | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు01, 2021

 



టెక్నాల‌జీ రంగాన్ని కెరియ‌ర్‌గా ఎంచుకుని త‌మ సృజనాత్మ‌కత‌ను జోడించి సాంకేతిక రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్సుల‌కు నాంది ప‌లుకుతున్న జౌత్సాహిక అభ్య‌ర్ధుల‌ను ప్రొత్స‌హించ‌డం కోసమే ఈ స్కాల‌ర్‌షిప్‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టారు. వేగంగా దూసుకుపోతున్న సాంకేతిక‌రంగానికి సంబంధించిన వ్యాపార స‌మావేశాల‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స్కాల‌ర్‌షిప్‌లు అందిస్తోంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్త‌లు ఆహ్వానిస్తోంది.
Scholarships  
వివ‌రాలు..
  • గూగుల్ కాన్ఫ‌రెన్స్‌ స్కాల‌ర్‌షిప్‌

అర్హ‌త‌:
  • గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి కంప్యూట‌ర్ ఇంజ‌నీరింగ్ లేదా ఇన్ఫ‌ర్మేష‌న్ రంగంలో ఇంజ‌నీరింగ్ చేస్తున్న అభ్య‌ర్థులు అర్హులు.
  • సంబంధిత టెక్నాల‌జీ పై పేప‌ర్ ప్రెజెంటెష‌న్ ఇచ్చి ఉండాలి.
  • సంబంధిత టెక్నాల‌జీ స‌మావేశాల్లో పాల్గొని ఉండాలి.

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు01, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
https://programs-scholarships.appspot.com/scholarships/

ది రోడ్స్ స్కాల‌ర్‌షిప్ ఫ‌ర్ ఇండియా 2021-22 | ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 02, 2021


ప్ర‌పంచంలోనే అతి పురాత‌న‌మైన, ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌ అంత‌ర్జాతీయ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం. దీన్ని ది రోడ్స్ ట్ర‌స్ట్ ఇన్ ఆక్స్‌ఫ‌ర్డ్ నిర్వ‌హిస్తోంది. యూనైటెడ్ కింగ్ డ‌మ్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల‌కు ప్రతి ఏడాది వంద స్కాల‌ర్‌షిప్‌ల‌ను అందిస్తోంది. అనేక ర‌కాల స‌వాళ్లును అధిగ‌మించేలా, స్వ‌చ్ఛందంగా సేవ‌లందించేలా, భ‌విష్య‌త్త‌రాలకు ఉప‌యోగ‌ప‌డేలా ఒక గొప్ప యువ నాయుకులను తీర్చిదిద్ద‌డం కోసం ఈస్కాల‌ర్ షిప్‌ల‌ను అందిస్తోంది.
Scholarships 
ది రోడ్స్ స్కాల‌ర్‌షిప్ ప్రోగ్రాం 2021-22
అర్హ‌త‌:
  • భార‌త్‌లోని గుర్తింపు పోందిన స్కూల్ నుంచి ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త, ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త‌
  • భార‌త్‌లోని గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీ నుంచి బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.
  • అక్టోబ‌ర్ 1, 2020 క‌ల్లా బ్యాచిల‌ర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఆగ‌స్టు 02, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌:
http://www.rhodeshouse.ox.ac.uk/scholarships/apply

1, జులై 2021, గురువారం

ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో బీబీఏ, ఎంబీఏ.. దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021


భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌(ఐసీఐ).. 2021 విద్యాసంవత్సరానికి ఇందిరాగాంధీ నేషనల్‌ ట్రైబల్‌ యూనివర్సిటీతో కలిసి తిరుపతి, నోయిడా క్యాంపస్‌ల్లో బీబీఏ, ఎంబీఏ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions 
కోర్సుల వివరాలు
కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ): కోర్సు వ్యవధి–మూడేళ్లు(ఆరు సెమిస్టర్లు.
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–120 సీట్లు, నోయిడా–120 సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌/10+2 ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.07.2021 నాటికి 22ఏళ్లు మించకూడదు.

కోర్సు: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ): కోర్సు వ్యవధి –రెండేళ్లు (నాలుగు సెమిస్టర్లు)
అందిస్తున్న క్యాంపస్‌లు–సీట్లు: తిరుపతి–30సీట్లు, నోయిడా–30సీట్లు.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఆర్ట్స్‌ /హాస్పిటాలిటీ /హోటల్‌మేనేజ్‌మెంట్‌లో ఫుల్‌టైమ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే.
వయసు: 01.07.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఎంపిక ప్రక్రియ, పరీక్ష తేది వెల్లడించాల్సి ఉంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌/ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021

వెబ్‌సైట్‌: http://thims.gov.in

మనూలో రెగ్యులర్‌ యూజీ, పీజీ, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021.


హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సిటీ(మనూ).. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్‌ యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
Adminissions  
అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ప్రవేశాలు..
యూజీ ప్రోగ్రామ్‌లు: బీఈడీ అండ్‌ బీటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌).
పీజీ ప్రోగ్రామ్‌లు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్‌(కంప్యూటర్‌ సైన్స్‌), ఎంఈడీ.
ప్రొఫెషనల్‌ డిప్లొమా:డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్,పాలిటెక్నిక్‌ డిప్లొమా ఇన్‌ ఇంజనీరింగ్‌(సివిల్,కంప్యూటర్‌ సైన్స్‌ తదితరాలు).
పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు: ఉర్దూ, ఇంగ్లిష్, హిందీ, పర్షియన్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌ తదితరాలు.

ఎంపిక విధానం: అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 12.07.2021.

మెరిట్‌ ద్వారా అడ్మిషన్‌..
పీజీ ప్రోగ్రామ్‌లు
: ఉర్దూ, ఇంగ్లిష్,హిందీ,అరబిక్, ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్, ఉమెన్‌ స్టడీస్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌ తదితరాలు.
యూజీ ప్రోగ్రామ్‌లు: బీఏ, బీఏ(ఆనర్స్‌), బీకాం, బీఎస్సీ(ఎంపీసీ), బీఎస్సీ(ఎంపీసీఎస్‌), బీఎస్సీ(బీజెడ్‌సీ).

బ్రిడ్జ్‌ కోర్సులు: మదర్సా నుంచి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు(బీకాం/బీఎస్సీ).
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ కోర్సులు: మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ(ఎంఐటీ), మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ(ఎంఎల్‌టీ).
లేటరల్‌ ఎంట్రీ: బీటెక్‌ అండ్‌ పాలిటెక్నిక్స్‌.
పార్ట్‌టైం డిప్లొమా కోర్సులు: ఉర్దూ, హిందీ, అరబిక్, పర్షియన్‌ అండ్‌ ఇస్లామిక్‌ స్టడీస్‌ తదితరాలు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 04.09.2021.

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://manuu.edu.in