29, నవంబర్ 2023, బుధవారం

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 | మరోసారి అప్లికేషన్ తేదీ పొడిగింపు | CBSE: Central Teacher Eligibility Test (CTET) Jan-2024 | Once again application date extension

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 18వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 27 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. 

వివరాలు...

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-2024

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-11-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది:  01-12-2023.

ఫీజు చెల్లింపు చివరి తేది: 01-12-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 21-01-2024.



Important Links

Posted Date: 29-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Work from Home Jobs | Do not pay money for these jobs

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

స్టాక్‌మార్కెట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: గ్రోత్‌క్లూస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.1,000-4,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 25, 2023

అర్హతలు: సేల్స్‌, మార్కెటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/16c3ef 


ఫైనాన్స్‌  

సంస్థ: గోలర్‌ వెబ్‌ సొల్యూషన్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.4,500-6,500

దరఖాస్తు గడువు: డిసెంబరు 5, 2023

అర్హతలు: అకౌంటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌, ఇన్వెస్టింగ్‌, ఎంఎస్‌-ఎక్సెల్‌, ఎంఎస్‌-ఆఫీస్‌, ట్యాలీ నైపుణ్యాలు  

internshala.com/i/b85856 


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: వెబ్‌ ఇగ్నిటో

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, ప్రీమియర్‌ ప్రొ, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్‌, వీడియో ఎడిటింగ్‌ నైపుణ్యాలు

internshala.com/i/087a24 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజిప్లస్‌

స్టైపెండ్‌: నెలకు రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు

internshala.com/i/10d834


సోషల్‌మీడియా మార్కెటింగ్‌

సంస్థ: స్కిల్‌ స్ట్రీట్‌

స్టైపెండ్‌: నెలకు రూ.5,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎస్‌ఈఓ నైపుణ్యాలు

internshala.com/i/c3ef06 


మీడియా అండ్‌ పీఆర్‌

సంస్థ: ఎఫ్‌ స్క్వేర్‌ మీడియా

స్టైపెండ్‌: నెలకు రూ.4,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: మీడియా అండ్‌ పీఆర్‌ నైపుణ్యం, ఆసక్తి ఉన్న విద్యార్థులు

internshala.com/i/ef9390


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: ఆబ్లిక్‌ ల్యాబ్స్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు

internshala.com/i/b5b79a 


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: డిజి గ్రో హబ్‌ ఎడ్యుకేషన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.3,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌, మాట్లాడటం, రాయడం, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం నైపుణ్యాలు

internshala.com/i/8004c7 


ఎస్‌పాంగిల్‌ కన్సల్టింగ్‌

1.ఇంటీరియర్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: 3డీస్‌ మ్యాక్స్‌, ఆటోక్యాడ్‌ నైపుణ్యాలు

internshala.com/i/8847b9 


2.యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

స్టైపెండ్‌: నెలకు రూ.7,500

దరఖాస్తు గడువు: డిసెంబరు 6, 2023

అర్హతలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్‌ నైపుణ్యం

internshala.com/i/162703 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

పవర్‌గ్రిడ్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీలు | ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు | Junior Technician Trainees in PowerGrid | Candidates who have passed ITI (Electrical) in electrician trade can apply

పవర్‌గ్రిడ్‌లో జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీలు

మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.




మహారత్న కేటగిరీకి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) 203 జూనియర్‌ టెక్నీషియన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌, ప్రీ-ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

లక్ట్రీషియన్‌ ట్రేడ్‌లో ఐటీఐ (ఎలక్ట్రికల్‌) పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఉన్నత సాంకేతిక అర్హతలైన డిప్లొమా/ బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అనర్హులు. దరఖాస్తు రుసుము రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు.

మొత్తం 203 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులకు 89, ఈడబ్ల్యూఎస్‌కు 18, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 47, ఎస్సీలకు 39, ఎస్టీలకు 10 కేటాయించారు.

12.12.2023 నాటికి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీ (ఎన్‌సీఎల్‌) అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు కేటగిరీని బట్టి పదేళ్లు అంతకంటే ఎక్కువ సంవత్సరాల సడలింపు ఉంటుంది.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. వ్యవధి 2 గంటలు. ప్రశ్నపత్రంలో రెండు పార్ట్టులుంటాయి.

  • పార్ట్‌-1లో టెక్నికల్‌ నాలెడ్జ్‌ (టీకేటీ) 120 ప్రశ్నలు ఉంటాయి.
  • పార్ట్‌-2లో ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఏటీ) - 50 ప్రశ్నలకు ఉంటుంది.
  • ప్రశ్నకు 1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ, ఒకటికంటే ఎక్కువ జవాబులు గుర్తించినా.. పావు మార్కు తగ్గిస్తారు.
  • పార్ట్‌-1లోని టెక్నికల్‌ నాలెడ్జ్‌ (టీకేటీ) ప్రశ్నలు ఐటీఐ-ఎలక్ట్రీషియన్‌ ట్రేడ్‌ సిలబస్‌కు సంబంధించినవి ఉంటాయి. ఈ సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది. నీ చదివిన సబ్జెక్టులేనని నిర్లక్ష్యం చేయకుండా వాటిలో గట్టి పట్టు సాధించాలి.
  • పార్ట్‌-2లోని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో భాగంగా..జనరల్‌ ఇంగ్లిష్‌, రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు.
  • పార్ట్‌-2లోని ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ కోసం.. బ్యాంక్‌, ఎస్‌ఎస్‌సీలాంటి పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు.
  • ఏయే అంశాల్లో బలహీనంగా ఉన్నారో తెలుసుకుని వాటికి అదనంగా సమయాన్ని కేటాయించాలి.
  • ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండే మోడల్‌ టెస్ట్‌లనూ రాయడం ద్వారానూ ఈ అంశాలపై పట్టు సాధించవచ్చు.
  • ముఖ్యంగా నిర్ణీత వ్యవధిలోగా అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయడం సాధన చేయాలి.

అర్హతకు ఎన్ని మార్కులు?

పరీక్షలో అన్‌రిజర్వుడ్‌/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 40 శాతం, రిజర్వుడ్‌ కేటగిరీ వారు 30 శాతం అర్హత మార్కులు సాధించాలి.

  • సీబీటీలో అర్హత సాధించినవాళ్లను డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, ట్రేడ్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు.
  • ట్రేడ్‌ టెస్ట్‌ అనేది అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
  • రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా.. ప్రీ ఎంప్లాయ్‌మెంట్‌ మెడికల్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు.
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారనేది వెబ్‌సైట్‌లో వివరంగా తెలియజేశారు.
  • పరీక్ష కేంద్రాలను రీజియన్లవారీగా విభజించారు. ఎస్‌ఆర్‌-1 రీజియన్‌ కిందికి.. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం కేంద్రాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులు రాత పరీక్షకు దరఖాస్తులో ఎస్‌ఆర్‌-1 రీజియన్‌ను ఎంపిక చేసుకోవాలి. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఒకే రోజున, ఒకే సెషన్‌లో జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఒక్క రీజియన్‌కు మాత్రమే దరఖాస్తు చేయాలి.

గమనించాల్సినవి

ఒకరు ఒక దరఖాస్తును మాత్రమే పంపాలి.

దరఖాస్తు ప్రింటవుట్‌ను భద్రపరుచుకోవాలి. దీన్ని డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ సమయంలో సమర్పించాలి.

ప్రభుత్వ/ పీఎస్‌యూల్లో పనిచేసే ఉద్యోగులు దరఖాస్తు సమయంలోనే ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను అప్‌లోడ్‌ చేయాలి.

రాత పరీక్షకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులను చెల్లిస్తారు.

రాత పరీక్షను జనవరి-2024లో నిర్వహించవచ్చు.  

దరఖాస్తుకు చివరి తేదీ: 12.12.2023

వెబ్‌సైట్‌: http://www.powergrid.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కొలువులు | Passing class 10 is enough! Jobs in Armed Forces

పది పాసైతే చాలు! సాయుధ దళాల్లో కొలువులు

కేంద్ర సాయుధ దళాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడొచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్‌ బేస్డ్‌, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే  సుమారు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో పదోన్నతులుంటాయి.

Updated : 29 Nov 2023 06:47 IST

దేశవ్యాప్తంగా 26,146 కానిస్టేబుల్‌ ఖాళీలు  


కేంద్ర సాయుధ దళాల్లో 26,146 కానిస్టేబుల్‌ జనరల్‌ డ్యూటీ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ప్రకటన విడుదల చేసింది. పదో తరగతి విద్యార్హతతోనే వీటికి పోటీ పడొచ్చు. మహిళలూ అర్హులే. కంప్యూటర్‌ బేస్డ్‌, దేహదార్ఢ్య, శారీరక ప్రమాణ, మెడికల్‌ టెస్టులతో నియామకాలుంటాయి. శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకుంటారు. మొదటి నెల నుంచే  సుమారు రూ.40 వేల వేతనం అందుకోవచ్చు. భవిష్యత్తులో పదోన్నతులుంటాయి.

సాయుధ దళాల్లో కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) దాదాపు ఏటా ప్రకటన విడుదల చేస్తోంది. పదో తరగతి విద్యార్హతతో, జనరల్‌ అభ్యర్థులు 23 ఏళ్ల వయసు వరకు పోటీ పడవచ్చు. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్నవారు విజయం సాధించడానికి అవకాశాలెక్కువ. ఎంపికైనవారు.. ఆసక్తి, మెరిట్‌ ప్రకారం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ (ఎస్‌ఎఫ్‌ఎఫ్‌), అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)లో నచ్చిన విభాగంలో సేవలు అందించవచ్చు. వీటిలో ఎందులో చేరినప్పటికీ వేతనం మాత్రం అందరికీ సమానమే. వీరు శిక్షణ అనంతరం విధుల్లోకి చేరిన తర్వాత లెవెల్‌-3 మూలవేతనం రూ.21,700 పొందుతారు. దీనికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర ప్రోత్సాహకాలు దక్కుతాయి తొలి నెల నుంచే సుమారు రూ.40 వేలు అందుకోవచ్చు. విధుల్లో ప్రతిభ, విద్యార్హత, అనుభవంతో హెడ్‌ కానిస్టేబుల్‌, ఏఎస్సై స్థాయికి చేరుకోవచ్చు. శాఖాపరమైన పరీక్షల ద్వారా ఎస్సై, ఆపై స్థాయికీ ఎంపిక కావచ్చు.

పరీక్ష ఇలా

గత ఏడాది నుంచి ప్రశ్నల సంఖ్యను 80కి పరిమితం చేశారు. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. ప్రశ్నపత్రం 160 మార్కులకు ఉంటుంది. జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్‌, ఇంగ్లిష్‌/ హిందీ విభాగాల్లో ఒక్కో అంశం నుంచి 20 చొప్పున మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. వీటికి ఒక గంటలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పదో తరగతి స్థాయిలోనే ప్రశ్నలు వస్తాయి. మాక్‌ టెస్టు ఎస్‌ఎస్‌బీ వెబ్‌సైట్‌లో పరీక్షకు కొద్ది రోజుల ముందు అందుబాటులో ఉంచుతారు.

పరీక్షలో అర్హత సాధించడానికి జనరల్‌ అభ్యర్థులు 30, ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌లు 25, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు పొందడం తప్పనిసరి. ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్‌కు 5, బీ ఉంటే 3, ఏ ఉన్నవారికి 2 శాతం మార్కులు కలుపుతారు. ఇలా అర్హత మార్కులు పొందినవారి జాబితా నుంచి విభాగాల వారీ మొత్తం ఖాళీలకు 8 రెట్ల సంఖ్యలో అభ్యర్థులకు ఫిజికల్‌ టెస్టులు
నిర్వహిస్తారు.

పీఈటీ, పీఎస్‌టీ

పీఈటీలో భాగంగా పురుషులు 5 కి.మీ. దూరాన్ని 24 నిమిషాల్లో, మహిళలు 1.6 కి.మీ. దూరాన్ని 8 1/2 నిమిషాల్లో చేరుకోవాలి. పీఎస్‌టీలో.. పురుషులు 170, మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ పురుషులు 162.5, మహిళలు 150 సెం.మీ. ఉంటే సరిపోతుంది. పురుషుల ఛాతీ విస్తీర్ణం 80 సెం.మీ. (ఎస్టీలకు 76) తప్పనిసరి. ఊపిరి పీల్చినప్పుడు 5 సెం.మీ.పెరగాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి.

అన్ని విభాగాల్లోనూ అర్హత సాధించినవారి జాబితా నుంచి వారు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం కేటగిరీలవారీ ఖాళీలకు 2 రెట్ల సంఖ్యలో అభ్యర్థులను మెడికల్‌ టెస్టుకు ఎంపిక చేస్తారు. అందులోనూ విజయవంతం కావాలి. తుది నియామకాలు పరీక్షలో సాధించిన మార్కుల మెరిట్‌, విభాగాల వారీ ఖాళీలు, రిజర్వేషన్ల ప్రకారం ఉంటాయి. అభ్యర్థులు దరఖాస్తు నింపినప్పుడే సర్వీసులవారీ ప్రాధాన్యం తెలపాలి. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు కానిస్టేబుల్‌ హోదాతో విధుల్లో కొనసాగవచ్చు.      


ముఖ్య సమాచారం

ఖాళీలు: 26,146.

  • బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌)-6174 -సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)-11025
  • సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌)-3337
  • సశస్త్ర సీమాబల్‌ (ఎస్‌ఎస్‌బీ)-635
  • ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటీబీపీ)-3189
  • అస్సాం రైఫిల్స్‌ (ఏఆర్‌)-1490
  • సెక్రటేరియట్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (ఎస్‌ఎస్‌ఎఫ్‌)-296.

ఈ ఏడాది నార్కోటిక్‌ బ్యూరోలో ఖాళీలు లేవు.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.

వయసు: జనవరి 1, 2024 నాటికి 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. జనవరి 2, 2001 - జనవరి 1, 2006 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: డిసెంబరు 31 రాత్రి 11 వరకు స్వీకరిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.వంద. మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు మినహాయించారు.

పరీక్ష: ఫిబ్రవరి, మార్చిలో. తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: ఏపీలో..చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణలో.. హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/


ఏ అంశాల్లో ప్రశ్నలు?


జనరల్‌ ఇంటెలిజన్స్‌ అండ్‌ రీజనింగ్‌: నంబర్‌ ఎనాలజీ, పోలికలు, తేడాలు, పరిశీలనలు, సంబంధాలు నంబర్‌ క్లాసిఫికేషన్‌, ఫిగర్‌ ఎనాలజీ, నంబర్‌ సిరీస్‌, కోడింగ్‌ - డీకోడింగ్‌, వర్డ్‌ బిల్డింగ్‌... మొదలైన విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గణితంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం ద్వారా వీటికి సమాధానాలు గుర్తించవచ్చు. తర్కంతో ముడిపడే తేలిక ప్రశ్నలే వస్తాయి.

జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌: ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి ప్రత్యేక ప్రావీణ్యం అవసరం లేదు. సాధారణ పరిజ్ఞానంతోనే జవాబులు రాయవచ్చు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితంతో ముడిపడే ఉంటాయి. పర్యావరణాంశాలకు ప్రాధాన్యం. రోజువారీ సంఘటనలే (వర్తమాన వ్యవహారాలు) ప్రశ్నలుగా వస్తాయి. వీటితోపాటు భారత్‌- పొరుగు దేశాలు, చరిత్ర, సంస్కృతి, భూగోళం, ఆర్థిక వ్యవహారాలు, పాలిటీ, సైన్స్‌ అంశాల నుంచీ ప్రశ్నలు ఉంటాయి. హైస్కూల్‌ సోషల్‌, సైన్స్‌ పాఠ్యపుస్తకాలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వర్తమాన వ్యవహారాల ప్రశ్నలు ఎదుర్కోవడానికి జనవరి 2023 నుంచి ముఖ్యాంశాలపై దృష్టి సారించాలి.  

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌: అంకెలతో ముడిపడే ప్రశ్నలే ఎక్కువగా అడుగుతారు. అంకెల మధ్య సంబంధం, శాతాలు, సగటు, భిన్నాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, కాలం-పని, కాలం-దూరం, వడ్డీ, డిస్కౌంట్‌, కొలతలు, క.సా.గు., గ.సా.భా., వైశాల్యాలు, ఘనపరిమాణాలు మొదలైన అంశాల్లో ప్రశ్నలు వస్తాయి. వీటిలో దాదాపు అన్ని అంశాలూ హైస్కూల్‌ మ్యాథ్స్‌ పుస్తకాల్లోనివే. వాటిని బాగా చదువుకుని వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే సరిపోతుంది.

ఇంగ్లిష్‌: అభ్యర్థి ప్రాథమిక ఆంగ్ల పరిజ్ఞానాన్ని పరిశీలించేలా ప్రశ్నలు వస్తాయి. ఖాళీలు పూరించడం, వ్యాక్యంలో తప్పును గుర్తించడం, సమానార్థాలు, వ్యతిరేక పదాలు, తప్పుగా ఉన్న పదాన్ని గుర్తించడం, జాతీయాలు, సామెతలు, ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలుగా మార్చడం, వాక్యంలో పదాలను క్రమ పద్ధతిలో అమర్చడం, కాంప్రహెన్షన్‌..తదితర విభాగాల నుంచే వీటిని అడుగుతారు హైస్కూల్‌ స్థాయి ఆంగ్ల పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణాంశాలు బాగా చదువుకుంటే ఎక్కువ మార్కులు సాధించడం కష్టమేమీ కాదు.


సన్నద్ధత

  • సిలబస్‌ వివరాలు శ్రద్ధగా గమనించాలి. అందులోని అంశాలవారీ వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి.పాత ప్రశ్నపత్రాలు పరిశీలించాలి. వీటిద్వారా ప్రశ్నల స్థాయి తెలుస్తుంది. సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి.  
  • పరీక్షలో 60 నిమిషాల వ్యవధిలో 80 ప్రశ్నలకు జవాబులు గుర్తించాలి. అంటే ప్రతి ప్రశ్నకూ  సమయం కేవలం 45 సెకన్లే. అందువల్ల అభ్యర్థులు తక్కువ వ్యవధిలో వీలైనన్ని సరైన సమాధానాలు గుర్తిస్తేనే విజయం సాధించగలరు.  
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగాల ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి ఎక్కువ సమయం కావాలి. పరీక్షకు ముందు ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం, సూత్రాలు ఉపయోగించే విధానం, షార్ట్‌ కట్‌ మెథడ్స్‌పై పట్టు సాధిస్తే తక్కువ వ్యవధిలో జవాబు గుర్తించగలుగుతారు.
  • సన్నద్ధత పూర్తయిన తర్వాత కనీసం పది మాక్‌ టెస్టులు రాయాలి. వాటి ఫలితాలను సమీక్షించుకుని, తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
  • రుణాత్మక మార్కులు ఉన్నందున జవాబులు తెలియనివాటిని వదిలేయాలి.
  • ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌.. అగ్నివీర్‌ పరీక్షల ప్రశ్నపత్రాలూ అధ్యయనంలో ఉపయోగమే. పరీక్షకు ముందు ఎస్‌ఎస్‌సీ వెబ్‌సైట్‌లో ఉంచిన మాక్‌ టెస్టునూ రాయాలి.
  • తర్వాత దశకు చేరుకోవడానికి పరీక్షలో అర్హత సాధించడం ముఖ్యం కాబట్టి దానిపైనే దృష్టి పెట్టాలి. అది ముగిసిన తర్వాత ఫిజికల్‌ టెస్టుల్లో ఉత్తీర్ణతకు సాధన చేయవచ్చు.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Postal: తపాలా శాఖలో 1,899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు | Postal: 1,899 Postal/ Sorting Assistant, Postman Vacancies in Postal Department

Postal: తపాలా శాఖలో 1,899 పోస్టల్/ సార్టింగ్ అసిస్టెంట్‌, పోస్ట్‌మ్యాన్ ఖాళీలు 

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్‌... దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది గ్రూప్ ‘సి’ ఖాళీల భర్తీకి ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 

ఖాళీల వివరాలు:

1. పోస్టల్ అసిస్టెంట్: 598 పోస్టులు

2. సార్టింగ్ అసిస్టెంట్: 143 పోస్టులు

3. పోస్ట్‌మ్యాన్: 585 పోస్టులు

4. మెయిల్ గార్డ్: 03 పోస్టులు

5. ఎంటీఎస్‌: 570 పోస్టులు

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1,899 (ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 51; తెలంగాణ సర్కిల్‌లో 91 ఖాళీలు ఉన్నాయి).

అర్హత: పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్‌ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ; 

పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్ పోస్టులకు పన్నెండో తరగతి; 

ఎంటీఎస్‌ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వివిధ స్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.

క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, చెస్, ఫెన్సింగ్, గోల్ఫ్, హ్యాండ్‌బాల్, హాకీ, జూడో, కబడ్డీ తదితరాలు.

వయోపరిమితి: మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్‌కు రూ.25,500 - రూ.81,100. పోస్ట్‌మ్యాన్/ మెయిల్ గార్డ్‌కు రూ.21,700 - రూ.69,100. మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కు రూ.18,000 - రూ.56,900.

ఎంపిక ప్రక్రియ: క్రీడా విజయాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం: 10.11.2023.

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 09.12.2023.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 09.12.2023.

దరఖాస్తులో మార్పులకు అవకాశం: 10.12.2023 నుంచి 14.12.2023 వరకు.


 

Important Links

Posted Date: 09-11-2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

బైపీసీ చేయని వారూ ఇప్పుడు డాక్టర్‌ కావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ | నేషనల్ మెడికల్ కమిషన్(NMC) తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ | Those who haven't done Bi P C can now become doctors.. NMC said good news National Medical Commission(NMC) latest guidelines are good news for students who want to become doctors

ఢిల్లీ: డాక్టర్‌(Doctor)గా కెరీర్ లో సెటిల్ కావాలనేది చాలా మంది కల. అధిక ఖర్చు కారణంగా చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేక.. ఇంటర్‌(Intermediate)లో వేర్వేరు గ్రూపులు తీసుకుంటారు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.

ఎంపీసీ(MPC)ను కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. ఎలాగంటారా? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది

కెమిస్ట్రీ, బయాలజీ / బయో టెక్నాలజీ ఇంగ్లీషుతో పాటు, ఇంటర్ పాసైన తరువాత అదనపు సబ్జెక్టులు రాసి నీట్-యూజీ పరీక్షలు రాసేందుకు అర్హత సాధించవచ్చు. ఆ అభ్యర్థులకు ఎన్ఎంసీ అర్హత సర్టిఫికేట్ కూడా మంజూరు చేస్తుంది. ఎన్ఎంసీ మంజూరు చేసిన ధ్రువపత్రం సదరు విద్యార్థి విదేశాల్లో సైతం అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులను అభ్యసించడానికి అర్హుల్ని చేస్తుంది.

ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొందేందుకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ తో పాటు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ / బయో టెక్నాలజీ రెండు సంవత్సరాలపాటు చదివి ఉండాలి. కాలేజ్ నుంచి రెగ్యులర్ విధానంలో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.

బయాలజీ / బయోటెక్నాలజీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్ట్ ని 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత అదనపు సబ్జెక్ట్ గా పూర్తి చేయడం సాధ్యం కాదని పాత నిబంధనల్లో ఉన్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధనలు వీటిని మార్చింది. దీంతో ఇంటర్ లో జీవశాస్త్రం / బయో టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండకపోయినా, వైద్య విద్య చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కల నెరవేరనుంది.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

28, నవంబర్ 2023, మంగళవారం

KVS Recruitment: 13,404 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు * ఎంపికైన అభ్యర్థులు వీరే..

KVS Recruitment: 13,404 పోస్టుల రాత పరీక్ష ఫలితాలు

* ఎంపికైన అభ్యర్థులు వీరే..

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నోటిఫికేషన్‌లో భాగంగా 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతానికి టీజీటీ, లైబ్రేరియన్‌, హిందీ ట్రాన్స్‌లేటర్‌, ప్రైమరీ టీచర్‌ ఫలితాలు వెలువడగా.. మిగిలిన పోస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

 


టీజీటీ ఎంపిక జాబితా
 


‣ లైబ్రేరియన్‌ ఎంపిక జాబితా
 


‣ హిందీ ట్రాన్స్‌లేటర్‌ ఎంపిక జాబితా 
 


‣ ప్రైమరీ టీచర్‌ ఎంపిక జాబితా
 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html