బైపీసీ చేయని వారూ ఇప్పుడు డాక్టర్ కావచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్ఎంసీ | నేషనల్ మెడికల్ కమిషన్(NMC) తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ | Those who haven't done Bi P C can now become doctors.. NMC said good news National Medical Commission(NMC) latest guidelines are good news for students who want to become doctors
ఢిల్లీ: డాక్టర్(Doctor)గా కెరీర్ లో సెటిల్ కావాలనేది చాలా మంది కల. అధిక ఖర్చు కారణంగా చాలా మంది తమ కలను నెరవేర్చుకోలేక.. ఇంటర్(Intermediate)లో వేర్వేరు గ్రూపులు తీసుకుంటారు. అయితే నేషనల్ మెడికల్ కమిషన్(NMC) విడుదల చేసిన తాజా గైడ్ లైన్స్ డాక్టర్ కావాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు.
ఎంపీసీ(MPC)ను కోర్ సబ్జెక్టుగా తీసుకుని 10 + 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారు డాక్టర్ గా మారవచ్చు. ఎలాగంటారా? ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10 + 2 స్థాయిలో జీవశాస్త్రం/బయోటెక్నాలజీని అదనపు సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలో ఉత్తీర్ణత సాధించడమే వారు చేయాల్సింది
ఇదివరకు ఒక విద్యార్థి ఎంబీబీఎస్(MBBS) లేదా బీడీఎస్(BDS) అభ్యసించే అర్హత పొందేందుకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ తో పాటు ఇంటర్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో సైన్స్ / బయో టెక్నాలజీ రెండు సంవత్సరాలపాటు చదివి ఉండాలి. కాలేజ్ నుంచి రెగ్యులర్ విధానంలో దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
బయాలజీ / బయోటెక్నాలజీ లేదా ఏదైనా ఇతర సబ్జెక్ట్ ని 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తరువాత అదనపు సబ్జెక్ట్ గా పూర్తి చేయడం సాధ్యం కాదని పాత నిబంధనల్లో ఉన్నాయి. ఎన్ఎంసీ తాజా నిబంధనలు వీటిని మార్చింది. దీంతో ఇంటర్ లో జీవశాస్త్రం / బయో టెక్నాలజీ ప్రధాన సబ్జెక్టుగా కలిగి ఉండకపోయినా, వైద్య విద్య చదువుకోవాలనుకునే స్టూడెంట్స్ కల నెరవేరనుంది.
కామెంట్‌లు