CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) జనవరి-2024
వివరాలు...
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) జనవరి-2024
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు:
పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-11-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 01-12-2023.
ఫీజు చెల్లింపు చివరి తేది: 01-12-2023.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 21-01-2024.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి