అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆర్డీటీ ఏఎఫ్ ఎకాలజీ సెంటర్, ఎన్ఐఐఐటీ ఆధ్వర్యంలో ఐసీఐసీఐ బ్యాంక్ లో ఉద్యోగాలకు ఈ నెల 19న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం నగర శివారులోని ఉప్పరపల్లి రోడ్డు ఉన్న ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఇంటర్వ్యూలు ఉంటాయి. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి, 20 నుంచి 25 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. ఎంపికైన వారికి ఎన్ఐఐఐటీ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు శిక్షణ అందిస్తారు. అనంతరం ఏపీ, తెలంగాణలోని ఐసీ ఐసీఐ బ్యాంకుల్లో రిలేషన్ షిప్ మేనేజర్లుగా ఉద్యోగం కల్పిస్తారు. నెలకు రూ.20వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి. --------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డి...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యానం 3.00 గంటల నుండి సాయంత్రం 9.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు