అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1, జనవరి 2021, శుక్రవారం
Competitive Bits
🌎 *చరిత్రలో ఈ రోజు*
👉 *01 జనవరి 2021*
👉 *శుక్రవారం*
👉 *సంవత్సరములో మొదటి రోజు. మొదటి వారం*
👉 *సంవత్సరములో మొదటి రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 364 రోజులు మిగిలినవి*
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔴 *ప్రత్యేక దినాలు*
🚩 *ప్రపంచ వ్యాప్తంగా క్రొత్త సంవత్సరం జరుపుకుంటారు*
🚩 *అంతర్జాతీయ సార్వజనీన దినోత్సవం(పబ్లిక్ డొమైను డే, ప్రజాక్షేత్ర దినోత్సవం)*
ప్రతి సంవత్సరం జనవరి 1న నిర్వహించబడుతుంది. రచనల కాపీహక్కులు కాలం చెల్లిపోయినపుడు సార్వజనీనం అయ్యి ప్రజాక్షేత్రంలోనికి వస్తాయి. కాపీహక్కులు అనేది అనుసరించి జనవరి 1న ఆయా దేశాల వ్యక్తిగత కాపీహక్కుల చట్టం ఆధారంగా జరుగుతుంది.
సార్వజనీన దినోత్సవం పాటించడం మొదట్లో అనధికారికం. 2004లో మొట్టమొదటిసారిగా కెనడియన్ పబ్లిక్ డొమైన్ కార్యకర్త వాలెస్ మెక్లీన్ ఈ దినోత్సవం గురించి ప్రస్తావించాడు, లారెన్స్ లెస్సిగ్ మద్దతు ఇచ్చాడు.
ప్రపంచంలోని అనేక వెబ్‌సైట్లు ప్రతి సంవత్సరం జనవరి 1న పబ్లిక్ డొమైన్‌లోకి ప్రవేశించే రచయితల జాబితా విడుదల చేస్తాయి. ఈ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని సంస్థలు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కాపీహక్కుల పరిరక్షణ నిబంధనలు సాధారణంగా రచయిత జీవితకాలం లేదా రచయిత మరణించిన కొన్ని సంవత్సరాల తరువాత లెక్కించబడుతాయి. అనేక న్యాయ పరిధులలో, రచయిత మరణించిన రోజు నుండి 70 సంవత్సరాలు గడిస్తే పబ్లిక్ డొమైనులోకి వస్తాయని అర్థం. ఆ కాలం తరువాత, ఆ రచయితలు రాసిన రచనలు పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. దాంతో ప్రతి ఒక్కరూ ఎవరి అనుమతి లేకుండా వాటిని ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు. చట్టబద్ధంగా, ప్రతి సంవత్సరం జనవరి 1న ఆయా రచయితల రచనలు పబ్లిక్ డొమైనులోకి వస్తాయి.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🏀 *సంఘటనలు*
✴️630: ముహమ్మద్ మక్కాకు వెళ్ళి, దానిని రక్తం చిందించకుండా ఆక్రమించుకున్నాడు
✴️1651: స్కాట్లాండ్ రాజుగా రెండో చార్లెస్ నియామకం.
✴️1707: పోర్చుగల్ రాజుగా ఐదవ జార్జ్ నియమించబడ్డాడు.
✴️1804: హైతీలో ఫ్రెంచి పాలన అంతమైంది.
✴️1899: క్యూబా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందింది
✴️1877: ఇంగ్లాండు రాణి విక్టోరియాని భారత దేశపు మహారాణిగా వెల్లడించారు
✴️1877: 1866 నాటి కరువులో పూటకు ఎనిమిది వేల మందికి గంజి ఇచ్చి వేలాదిమంది ప్రాణాలు కాపాడిన బుడ్డా వెంగళరెడ్డి గారికి సన్మాన సభ ఢిల్లీలో 1877 జనవరి 1వ తేదీన జరిగింది.
✴️1906: బ్రిటీషు వారు ఇండియాలో భారత ప్రామాణిక కాలమానం పాటించడం మెదలు పెట్టారు
✴️1925: అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఎడ్విన్ హబుల్, పాల పుంతకు బయట ఇతర నక్షత్ర పుంతల ఉన్నాయని వెల్లడించాడు.
✴️1923: రామ్‌గోపాల్ మలానీ, హైదరాబాదులో డి.బి.ఆర్.మిల్స్ వ్యవస్థాపకుడు.
✴️1939: బిల్ హెవ్లెట్, డేవిడ్ ప్యకార్డ్ కలిసి హెచ్.పి. స్థాపించారు
✴️1948: విభజన తరువాత భారత దేశం పాకిస్తానుకు 55కోట్ల రూపాయలను చెల్లించనన్నది
✴️1953: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
✴️1956: సూడాన్ స్వాతంత్ర్యం పొందింది.
✴️1958: యూరోపియన్ కమ్యూనిటీ స్థాపించబడింది.
✴️1960: కామెరూన్ స్వాతంత్ర్యం పొందింది
✴️1971: అమెరికా టీవీలో ధూమపాన సంబంధిత అడ్వర్టైజెమెంట్లను బ్యాన్ చేసింది
✴️1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.
✴️1973: ఫీల్డు మర్షల్ ఎస్.హెచ్.ఎఫ్.జె. మానెక్‌షా భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
✴️1978: ఎయిర్ ఇండియా ఫ్లైట్ 855, ముంబాయి సముద్ర తీరాన, అరేబియ సముద్రములోకి పడిపోయింది.
✴️1981: గ్రీసు రిపబ్లిక్ యూరోపియన్ కమ్యునిటీలో చేరినది.
✴️1984: బ్రూనై స్వాతంత్ర్యం పొందింది.
✴️1985: ఇంటర్నెట్ డొమైన్ నేమ్ సిస్టం ఏర్పాటుచేయబడింది.
✴️1986: సెన్సెక్స్, బోంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ అనే ఒక విలువ-భార సూచీ ప్రారంభించబడింది.
✴️1993: చెకొస్లోవేకియా చెక్, స్లోవక్ రెండు దేశాలుగా విడిపోయింది.
✴️1994: ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (నాఫ్తా) అమలులోకి వచ్చింది.
✴️1995: GATT స్థానంలో ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చింది.
✴️1998: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
✴️1999: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
✴️2002: ఐరోపా లోని 13 దేశాల్లో యూరో నాణేలు, నోట్లను చెలామణీ లోకి తెచ్చారు.
✴️2006: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణ కోసం వేసిన సంఘం) నివేదికలోని సిఫార్సులను, సవరించిన జీతాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రోజునుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసింది. భత్యాలను మాత్రం 1 సెప్టంబరు 2008 నుంచి చెల్లించింది.
✴️2007: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బాబ్ కి మూన్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🌐 *జననాలు*
❇️1766: మహారాజా చందు లాల్, హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా, పేష్కరుగా పలు హోదాల్లో పనిచేసిన రాజకీయవేత్త. (మ.1845)
❇️1840: బుడ్డా వెంగళరెడ్డి, 1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (మ.1900)
❇️1892: మహదేవ్ దేశాయ్ భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. (మ.1942)
❇️1894: సత్యేంద్రనాథ్ బోస్, బెంగాలి గణిత శాస్త్రవేత్త.
❇️1905: లంక సుందరం, భారత పార్లమెంటు సభ్యులు, అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో నిపుణులు.
❇️1909: చర్ల గణపతిశాస్త్రి, వేద పండితులు, గాంధేయవాది, ప్రాచీన గ్రంథాల అనువాదకులు. (మ.1996)
❇️1911: ఎల్లాప్రగడ సీతాకుమారి, కథా రచయిత్రి, స్వాతంత్ర్య సమరయోధురాలు.ఆమె ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యురాలు.
❇️1920: మహమ్మద్ రజబ్ అలీ, ఖమ్మం జిల్లా రాజకీయనాయకుడు. (మ.1997)
❇️1928: మంత్రి శ్రీనివాసరావు తెలంగాణ ప్రాంత రంగస్థల నటుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖ తొలి శాఖాధిపతి. (మ.1974)
❇️1928: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (మ.2016)
❇️1929: ముకురాల రామారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత. (మ.2003)
❇️1938: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (మ.1986)
❇️1938: తిరుమల శ్రీనివాసాచార్య, గీతాలు, సాహిత్యవ్యాస సంకలనాలు, రుబాయీల రచయిత.
❇️1939: సత్యమూర్తి, వ్యంగ్య చిత్రకారుడు.
❇️1943: రఘునాథ్ అనంత్ మషేల్కర్, భారతీయ శాస్త్రవేత్త.
❇️1946: బాలు మహేంద్ర, దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు .
❇️1946: పప్పల చలపతిరావు, ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 14వ లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
❇️1948: షేక్ బడేసాహెబ్ తెలుగు రచయిత.
❇️1951: అష్ఫక్ హుస్సేన్, ఉర్దూ కవి.
❇️1952: నానా పటేకర్, నటుడు.
❇️1954: శాంతా రంగస్వామి, భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి.
❇️1961: దుర్గాప్రసాద్ ఓజా, భౌతిక శాస్త్రవేత్త.
❇️1962: మారొజు వీరన్న, తెలంగాణ మహాసభను స్థాపకుడు, సి.పి.ఐ. (యం.యల్) జనశక్తి కార్యకర్త. (మ.1999)
❇️1963: అబ్దుల్ హకీం జానీ షేక్ బాలసాహితీవేత్త.
❇️1966: వద్దిపర్తి పద్మాకర్, పేరుపొందిన అవధాని, ఆధ్యాత్మిక ప్రవచనకారుడు.
❇️1971: కళాభవన్ మణి, భారతీయ సినిమా నటుడు, గాయకుడు. (మ.2016)
❇️1974: కట్టా శ్రీనివాసరావు, ఉపాధ్యాయుడు, కవి, కవిసంగమం పేరుతో పేస్ బుక్ కవిత్వ వేదికలో ప్రధాన భాగస్వామి.
❇️1975: సొనాలి బింద్రే, హిందీ నటి.
❇️1978: విద్యా బాలన్, హిందీ నటి.
❇️1978: పరమహంస శ్రీ నిత్యానందా.
❇️1979: డింకో సింగ్, 1998 ఆసియా క్రీడలలో బంగారుపతకం గెలుచుకున్న భారత బాక్సింగ్ క్రీడాకారుడు.
❇️1982: ఐశ్వర్య ధనుష్ భారతీయ సినీ దర్శకురాలు. భారతీయ నటుడు రజినీకాంత్ పెద్ద కుమార్తె.
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
⚫️ *మరణాలు*
◾️1748: జొహాన్ బెర్నౌలీ, స్విట్జెర్లాండ్కు చెందిన గణిత శాస్త్రవేత్త.
◾️1775: అహమ్మద్ షా బహదూర్, 13వ మొఘల్ చక్రవర్తి. (జ.1725)
◾️1782: జొహాన్ క్రిస్టియన్ బాక్, జెర్మనీకు చెందిన సంగీత కళాకారుడు
◾️1894: హైన్రిచ్ రుడోల్ఫ్ హెర్ట్జ్, జెర్మనీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త
◾️1940: పానుగంటి లక్ష్మీ నరసింహరావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
◾️1955: శాంతిస్వరూప్ భట్నాగర్, రసాయన శాస్త్రవేత్త. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డును ఏర్పాటు చేసారు.
◾️1964: శొంఠి వెంకట రామమూర్తి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితశాస్త్రవేత్త. (జ.1888)
◾️1968: వెంపటి సదాశివబ్రహ్మం, పేరుపొందిన చలనచిత్ర రచయిత
◾️1994: చాగంటి సోమయాజులు, తెలుగు రచయిత. (జ.1915)
◾️1995: యూగీన్ విగ్నెర్, హంగేరీకు చెందిన, నోబెల్ బహుమతి గెలుచుకున్న భౌతిక శాస్త్రవేత్త
◾️2001: ఆరుట్ల కమలాదేవి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్న యోధురాలు. (జ.1920)
◾️2007: డూండీ, తెలుగు సినిమా నిర్మాత.
◾️2007: టిల్లీ అల్సెన్, అమెరికన్ రచయిత్రి (జ.1912)
◾️2008: ప్రతాప్ చంద్ర చుందెర్, భారతీయ క్యాబినెట్ మంత్రి.
◾️2009: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవి. (జ.1947).🙏🏻
➖➖➖➖➖➖➖➖
*_To Stay Negative Against COVID-19_*
*Wear Mask*
*Keep Safe Distance*
*Wash Hands Frequently with Soap/Sanitizer*
➖➖➖➖➖➖➖➖
#TODAY_IN_HISTORY
@jobsupdategovernment
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...