RRB NTPC: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ-II పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC: RRB NTPC Graduate CBT-II Exam Schedule Released
ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ: ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ సీబీటీ-II పరీక్ష షెడ్యూల్ విడుదల ఈనాడు, ప్రతిభ డెస్క్: ఆర్‌ఆర్‌బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (ఎన్‌టీపీసీ) గ్రాడ్యుయేట్ పోస్టుల స్టేజ్-II పరీక్ష తేదీలు విడుదలయ్యాయి. అక్టోబర్ 13న కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగనుంది. సెప్టెంబర్ 19న సీబీటీ-1 పరీక్ష ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఆర్‌ఆర్‌బీ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 11,558 ఖాళీలు భర్తీ చేస్తోంది. వాటిలో మొత్తం గ్రాడ్యుయేట్ ఖాళీలు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ 3,445 ఖాళీలు ఉన్నాయి. వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీలకు సంబంధించి గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. RRB NTPC: RRB NTPC Graduate CBT-II Exam Schedule Released Eenadu, Prathibha Desk: The dates for the Stage-II examinations for RRB Non-Technical Popular Category (NTPC) graduate posts have been announced. The computer-based test is sch...