28, అక్టోబర్ 2021, గురువారం

Jeevan Pramaan: పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ సబ్‌మిట్‌ చేయండలా..!

Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాలి

Life Certificate: ప్రతి సంవత్సరం పెన్షన్‌దారులు తమ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పెన్షన్ మంజూరు చేసే సంస్థలకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికీ జీవించే ఉన్నామని రుజువుగా బ్యాంకులు, పోస్టాఫీసులు వంటి పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీలకు లైఫ్ సర్టిఫికేట్ లేదా జీవన్ ప్రమాణ్ పత్రాన్ని సమర్పించాలి. ప్రతినెలా పెన్షన్‌ను పొందాలంటే ఈ సర్టిఫికేట్‌ అందించడం తప్పనిసరి అయితే ఈ ఏడాది పింఛనుదారులు తమ జీవన్ ప్రమాణ్‌ను నవంబర్ 30 లోపు సమర్పించాలి. దీంతో వృద్ధులు కేంద్ర ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లలో కూడా లైఫ్ సర్టిఫికెట్సమర్పించే వెసులుబాటు ఉంది. వృద్ధులు కార్యాలయాలకు వెళ్లి జీవన్ ప్రమాణ్ పత్రాన్ని రూపొందించుకుని సబ్మిట్ చేయడం చాలా కష్టతరంగా మారింది.

ప్రస్తుత కరోనా కాలంలో బయటికి రావడం వారి ప్రాణాలకు ముప్పుగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లోనే ప్రమాణపత్రం జనరేట్ చేసుకొని సమర్పించడానికి వెసులుబాటు కల్పిస్తోంది. సురక్షితమైన ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ ద్వారా ఆన్‌లైన్‌లోనే లైఫ్ సర్టిఫికెట్ రూపొందించవచ్చు. తర్వాత పెన్షన్ మంజూరు చేసే సంస్థలు తమకు కావాల్సినప్పుడు వాటిని యాక్సెస్ చేయగలవు. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆన్‌లైన్‌ స్టోర్ అవుతుంది. మరి ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి.

పెన్షనర్‌ తప్పకుండా చెల్లుబాటు అయ్యే ఆధార్‌ నెంబర్‌ కలిగి ఉండాలి. ఆన్‌లైన్ సర్టిఫికేట్‌ను రూపొందించాలనుకునే పెన్షనర్ తప్పనిసరిగా పని చేసే మొబైల్ నెంబర్‌ను ఉండటం తప్పనిసరి. అన్నిటికంటే ముందుగా పెన్షనర్ ప్రభుత్వ జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

జీవన్ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ విధానం..

► పెన్షనర్ ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో జీవన్ ప్రమాణ్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

► తర్వాత పెన్షనర్ తన ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, పేరు, మొబైల్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (PPO) ఇలా పూర్తి వివరాలు నమోదు చేయాలి.

► సెండ్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఓటీపీ వచ్చాక ఆ నెంబర్‌ను కాపీ చేసి నమోదు చేయాలి. తరువాత ప్రమాణ్ ఐడీ జనరేట్ అవుతుంది.

► ఒకవేళ మీరు ఇప్పటికే ప్రమాణ్ ఐడీ క్రియేట్ చేసుకున్నట్లయితే మీరు పై స్టెప్స్ ఫాలో కాకుండా నేరుగా యాప్‌లో లాగిన్ కావచ్చు. ఇందుకు ఒకసారి ఓటీపీ ధృవీకరిస్తే సరిపోతుంది.

► లాగిన్ అయ్యాక ‘జనరేట్ జీవన్ ప్రమాణ్ (Generate Jeevan Pramaan)’ ఆప్షన్ పై క్లిక్ చేసి ఆధార్, మొబైల్ నంబర్‌లను నమోదు చేయాలి.

► ఇప్పుడు జనరేట్ ఓటీపీ ఆప్షన్ పై క్లిక్ చేసి దానిని నమోదు చేయాల్సి ఉంటుంది.

► పీపీఓ నెంబర్, పేరు, పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీ పేరును నమోదు చేయాలి. ఆధార్ డేటాను ఉపయోగించి, పెన్షనర్ వేలిముద్ర, ఐరిష్‌ను స్కాన్ ద్వారా స్వయం ధృవీకరణ చేయాలి.

► ధృవీకరణ పూర్తయిన తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రింట్ కాపీ మీ మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తుంది. దాని డిజిటల్ ప్రింట్ మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లైఫ్ సర్టిఫికెట్ కాపీ కనిపించిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌లో కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అంతే, ఇక లైఫ్ సర్టిఫికెట్ విజయవంతంగా జనరేట్ చేసి సబ్మిట్ చేసినట్లవుతుంది. ఈ విధానాల ద్వారా పెన్షనర్లు ఆన్‌లైన్‌లో జీవన్‌ ప్రమాణ్ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్‌ చేయవచ్చు.

 

 

Gemini Internet

India Post Recruitment 2021: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్..! పోస్ట్ మ్యాన్‌, పోస్టల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్..

India Post Recruitment 2021: స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ 

India Post Recruitment 2021: స్పోర్ట్స్ కోటా కింద పోస్టల్ అసిస్టెంట్, పోస్ట్‌మ్యాన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఆధ్వర్యంలోని ఢిల్లీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. https://www.indiapost.gov.inలో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. కింది పోస్టులకు అర్హులైన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

1. పోస్టల్ అసిస్టెంట్ – 72
2. పోస్ట్‌మ్యాన్ – 90
3. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ – 59

పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టు: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్: అభ్యర్థి తప్పనిసరిగా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
పోస్టల్/సార్టింగ్ అసిస్టెంట్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 4 (రూ. 25,500-81,100)
పోస్ట్‌మ్యాన్ – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 3 (రూ. 21,700-69,100)
MTS – పే మ్యాట్రిక్స్‌లో లెవల్ 1 (రూ. 18,000-56,900)

అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.indiapost.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు . వారు సంబంధిత పత్రాలతో పాటు పోస్ట్ ద్వారా దరఖాస్తులను AD (Recrt.), O/o CPMG, ఢిల్లీ సర్కిల్, మేఘదూత్ భవన్, న్యూఢిల్లీ – 110001కు సమర్పించవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12, 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Gemini Internet

PM Kisan scheme: రైతులకు గమనిక..! పీఎం కిసాన్‌ పథకంలో చేరాలంటే ఇప్పుడు ఈ కార్డు తప్పనిసరి..

PM Kisan scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం-కిసాన్) పథకం కింద మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం డాక్యుమెంట్ నిబంధనలలో 

PM Kisan scheme: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎం-కిసాన్) పథకం కింద మోసపూరిత కార్యకలాపాలను అరికట్టడానికి ప్రభుత్వం డాక్యుమెంట్ నిబంధనలలో మార్పులు చేసినట్లు తెలిసింది. కొత్త నిబంధనల ప్రకారం.. PM-KISAN ప్రయోజనాలను పొందాలంటే ప్రభుత్వం రేషన్ కార్డును తప్పనిసరి చేసింది. అర్హులైన వ్యవసాయ కుటుంబాలు ఇప్పుడు తమ రేషన్ కార్డ్ నంబర్, వాటి సాఫ్ట్ కాపీలతో పాటు ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, డిక్లరేషన్ ఫారమ్ సాఫ్ట్ కాపీలను PM-KISAN వెబ్‌సైట్‌లో సమర్పించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 10వ విడత డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎం కిసాన్) పథకాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి కోసం ప్రతి ఏటా రూ.6వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఆరు వేల రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది అర్హత గల ప్రతి రైతు ఖాతాలో నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చొప్పున జమ చేస్తుంది.

అయితే కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ఎందుకంటే వీరి దరఖాస్తు విధానంలో తప్పులు ఉండటం వల్ల డబ్బులు రావడం లేదు. అయితే వీరి పేరుపై డబ్బులు మంజూరై ఉన్నాయి కానీ వీరు తప్పులు సరిదిద్దుకుంటేనే ఆ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. మొబైల్ యాప్ ద్వారా మీ పేరును చెక్ చేసుకోవడానికి ముందుగా PM కిసాన్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మీరు యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత మీకు అన్ని వివరాలకు యాక్సెస్ ఉంటుంది.

రైతులు చేస్తున్న త‌ప్పులు
1. ఖాతా యాక్టివేట్‌గా ఉండ‌టం లేదు. హోల్డ్‌లో ఉంటుంది.
2 . వీరు ఇచ్చిన అకౌంట్ బ్యాంకులో ఉండ‌టం లేదు. దీని అర్థం ఖాతా నంబర్ త‌ప్పుగా ఉంటుంది.
3. పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (PFMS) ద్వారా రైతు రికార్డు ఆమోదించలేదు.
4. బ్యాంక్ తిరస్కరించిన ఖాతా అంటే ఖాతా మూసివేసార‌ని అర్థం.
5. PFMS/ ద్వారా రైతు భూ రికార్డును తిరస్కర‌న‌కు గురైంది.
6. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఆధార్ లింక్ జరగలేదు.
7. రాష్ట్ర ప్రభుత్వం నుంచి క‌ర‌క్ష‌న్ పెండింగ్‌లో ఉంది.

 Gemini Internet

FSSAI రిక్రూట్‌మెంట్ 2021: fssai.gov.inలో 300కి పైగా ఖాళీలు ప్రకటించబడ్డాయి, దరఖాస్తు చేయడానికి లింక్ చూడండి.

FSSAI రిక్రూట్‌మెంట్ 2021: మొత్తం పోస్టుల సంఖ్య

    డైరెక్టర్ (టెక్నికల్) -- 02
    జాయింట్ డైరెక్టర్ (టెక్నికల్, లీగల్, అడ్మిన్ & ఫైనాన్స్) -- 03
    సీనియర్ మేనేజర్ -- 01
    సీనియర్ మేనేజర్ (IT) -- 01
    డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్, లీగల్, అడ్మిన్ & ఫైనాన్స్) -- 07
    మేనేజర్ -- 02
    మేనేజర్ (IT) -- 01
    అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్) -- 11
    అసిస్టెంట్ డైరెక్టర్ (OL) -- 01
    డిప్యూటీ మేనేజర్ -- 04
    డిప్యూటీ మేనేజర్ (IT) -- 02
    అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ -- 10
    సీనియర్ ప్రైవేట్ సెక్రటరీ -- 06
    వ్యక్తిగత కార్యదర్శి -- 15
    అసిస్టెంట్ మేనేజర్ (IT) -- 01
    అసిస్టెంట్ -- 02
    స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) -- 02
    ఆహార విశ్లేషకుడు -- 04
    టెక్నికల్ ఆఫీసర్ -- 125
    సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (CFSO) -- 37
    అసిస్టెంట్ మేనేజర్ (IT) -- 04
    అసిస్టెంట్ మేనేజర్ -- 04
    అసిస్టెంట్ -- 33
    హిందీ అనువాదకుడు -- 01
    వ్యక్తిగత సహాయకుడు -- 19
    ఐటీ అసిస్టెంట్ -- 03
    జూనియర్ అసిస్టెంట్ (గ్రేడ్-1) -- 03

FSSAI రిక్రూట్‌మెంట్ 2021: ఎలా దరఖాస్తు చేయాలి

అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు FSSAI యొక్క అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు దరఖాస్తును సమర్పించడానికి ఇతర మోడ్ అందుబాటులో లేదు. అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్ యొక్క హార్డ్ కాపీలను FSSAIకి ఫార్వార్డ్ చేయాల్సి ఉంటుంది.
FSSAI రిక్రూట్‌మెంట్ 2021: దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్

పైన పేర్కొన్న ఖాళీల కోసం దరఖాస్తు చేయడానికి డైరెక్ట్ లింక్‌ని తనిఖీ చేయడానికి క్లిక్ చేయండి.
FSSAI రిక్రూట్‌మెంట్ 2021: దరఖాస్తు చేయడానికి చివరి తేదీ

కొన్ని ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 7 కాగా, మరికొన్ని ఖాళీలకు నవంబర్ 12.

FSSAI వెబ్‌సైట్ (www.fssai.gov.in)లో 'FSSAI (కెరీర్స్)లో ఉద్యోగాలు' విభాగంలో అర్హత, అనుభవం మొదలైన వాటికి సంబంధించిన వివరణాత్మక సమాచారం అందుబాటులో ఉంది.

Gemini Internet

ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. రూ.342కే రూ.4 లక్షల బెనిఫిట్!

2020లో వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి తర్వాత బీమా గురించి సాధారణ ప్రజలలో అవగాహన పెరిగింది. సమాజంలోని ప్రతి వర్గానికి చేరుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం చాలా తక్కువ మొత్తానికి బీమా సదుపాయాలను అందిస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతా కలిగిన వారు ఏడాదికి రూ.342తో డబ్బులు కడితే ఏకంగా రూ.4 లక్షల విలువ గల భీమా ప్రయోజనం మీరు పొందొచ్చు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలు అయిన ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పిఎంఎస్‌బివై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పిఎంజెజెబివై) మీకు రూ.4 లక్షల వరకు ప్రమాద బీమా + జీవిత బీమా అందిస్తున్నాయి.  అయితే, దీని కోసం మీరు కేవలం రూ.342 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ రెండు పథకాల గురించి సమాచారాన్ని షేర్ చేసింది. ఎస్‌బీఐ కస్టమర్లు ఆటో డెబిట్ సదుపాయం ద్వారా ఖాతాదారుడి సేవింగ్స్ బ్యాంక్ ఖాతా నుంచి ప్రీమియం కట్ అవుతుంది అని బ్యాంకు తెలియజేసింది.

ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన
ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద బీమా తీసుకున్న ఉన్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా లేదా పూర్తిగా వికలాంగులైనా రూ.2 లక్షల పరిహారం లభిస్తుంది. ఈ పథకం కింద బీమా చేసిన వ్యక్తి పాక్షికంగా లేదా శాశ్వతంగా వైకల్యం పొందినట్లయితే అతడు/ఆమెకు లక్ష రూపాయల పరిహారం లభిస్తుంది. దీనిలో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా చేరవచ్చు. ఈ ప్లాన్ వార్షిక ప్రీమియం కూడా రూ.12 మాత్రమే.  

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణిస్తే నామినీకి రూ.2 లక్షలు వరకు పరిహారం లభిస్తుంది. 18 నుంచి 50 సంవత్సరాల వరకు ఏ వ్యక్తి అయినా ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కోసం కూడా మీరు కేవలం రూ.330 వార్షిక ప్రీమియం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఈ బీమా ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ బీమా కవర్ జూన్ 1 నుంచి మే 31 వరకు ఉంటుందని తెలుసుకోవాలి. భీమా పొందాలంటే మీరు బ్యాంకు ఖాతాను కలిగి ఉండాలి. ప్రీమియం మినహాయింపు సమయంలో బ్యాంకు ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల కూడా బీమాను రద్దు చేసుకోవచ్చు.

 

 

Gemini Internet

Jeevan Pramaan Life Certificate Pension: మీరు పెన్షన్ తీసుకుంటున్నారా? లేదా మీ ఇంట్లో పెన్షనర్స్ ఉన్నారా? వెంటనే ఇలా చేయకపోతే పెన్షన్ ఆగిపోవచ్చు!

దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాలి. పెన్షనర్ దానిని తన పెన్షన్ ఖాతాలో సమర్పించాల్సి ఉంటుంది.

Pension: దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లు ఉన్నారు. వారు ప్రతి సంవత్సరం నవంబర్ 30 లోపు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని(లైఫ్ సర్టిఫికేట్) సమర్పించాలి. పెన్షనర్ దానిని తన పెన్షన్ ఖాతాలో సమర్పించాల్సి ఉంటుంది. నిజానికి, ఇది పెన్షనర్ సజీవంగా ఉన్నట్లు నిర్ధారించే సర్టిఫికేట్. కాబట్టి మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే లేదా మీ కుటుంబంలో ఎవరైనా పెన్షనర్ ఉంటే ఈ విషయంలో వెంటనే స్పందించాల్సి ఉంది. ఈ జీవిత ధృవీకరణ పత్రాన్ని నవంబర్ 30లోపు సమర్పించడం చాలా ముఖ్యం. లేదంటే మీ పెన్షన్ ఆగిపోయే అవకాశాలున్నాయి.

నవంబర్ 30 లోపు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించండి

లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. దీని ద్వారా పెన్షనర్లు వారి పెన్షన్ ఖాతాలో వారి మనుగడ ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. ఇది కాకుండా, మీరు మీ సమీపంలోని ఆధార్ కేంద్రం లేదా ఏదైనా సాధారణ సేవా కేంద్రం ద్వారా కూడా జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.

సర్టిఫికెట్లను డిజిటల్‌గా కూడా సమర్పించవచ్చు

ఇది కాకుండా, పింఛనుదారులు కావాలనుకుంటే, ఈ సర్టిఫికేట్‌ను డిజిటల్‌గా కూడా సమర్పించవచ్చు. ఇందులో ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ అథెంటికేషన్ సిస్టమ్ ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్లు సమర్పించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి, పెన్షనర్లు ముందుగా జీవన్ ప్రమాన్(https://jeevanpramaan.gov.in ) వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా మీరు వెబ్సైట్ లోకి వెళ్ళొచ్చు. ఆ తర్వాత గెట్ ఎ సర్టిఫికేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీని ద్వారా లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత, మీరు పింఛనుదారుల ఆధార్ నంబర్, పేరు, ఫోన్ నంబర్, పెన్షన్ కు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇవ్వాలి. ఆధార్ ద్వారా ప్రామాణీకరించబడిన తర్వాత, లైఫ్ సర్టిఫికేట్ ID పెన్షనర్ ఫోన్‌లో వస్తుంది. ఆ వెంటనే పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ ఐడిని ఇవ్వడం ద్వారా పిడిఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

లైఫ్ సర్టిఫికేట్ ఎందుకు సమర్పించాలి?

వాస్తవానికి, పెన్షన్ స్కీమ్-1995 (EPS-95) కింద పెన్షన్ చెల్లింపు కోసం పెన్షన్ హోల్డర్లు లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ పత్ర) లేదా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం తప్పనిసరి. అందువల్ల ప్రతి సంవత్సరం పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ లేదా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలి. దీంతో పింఛన్‌కు ఇబ్బంది ఉండదు. మీకు కూడా పెన్షన్ వస్తే. లేదా మీ కుటుంబంలో పెన్షనర్ ఉన్నట్లయితే, మీరు మీ జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించాలి. లేదంటే మీ పెన్షన్ ఆగిపోవచ్చు.

 

Gemini Internet